సుదర్శన చక్రం ఇప్పటికీ ఉంది .

3.236.51.151

విష్ణుమూర్తి అనగానే అందరికీ గుర్తు వచ్చేది సుదర్శన చక్రమే. ఆయా చూపుడు వేలే ఆలంబనగా తిరిగే ఈ చక్రానికి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. యుద్ధంలో శత్రు వినాశనం, భక్తుల కోరికలు నెరవేర్చడం,ఇలా చెప్పుకుంటూ పొతే విష్ణు శక్తి అంతా  సుదర్శనమేనేమో అనిపించక మానదు . అంతటి శక్తి స్వరూపాన్ని ఒక్కసారైనా కళ్లారా చూడగలిగిన భాగ్యం కల్గిన వారిదే కదా అదృష్టమంటే . అయితే, అసలు ఈ చక్రాన్ని మనం చూసే అవకాశం ఉందా అంటే ,చరిత్రకారులు ఉండొచ్చు అనే సమాధాం ఇస్తున్నారు .  మరిక పదండి , చక్రానికున్న చరిత్రేమిటో , అది ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకుందాం . 

సుదర్శనోపనిషత్తు ప్రకారం, సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మచే తయారుచేయబడినది. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు. అప్పుడు రాలిన పొడితో మూడింటిని తయారుచేశాడు. ఒకటి పుష్పక విమానం, రెండవది పరమశివుని త్రిశూలం, మూడవది విష్ణుముర్తి సుదర్శన చక్రం. సుదర్శన చక్రం తేజస్సుకి చిహ్నం. శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శనచక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. ఇది పురాణవచనం. అయితే , చారిత్రిక ఆధారాలు ఏం చెప్తున్నాయి . 

మధ్యయుగ కాలం నాటికి యుధాలలో చక్రాయుధాన్ని వినియోగించేవారు. వీటిల్లో అనేక రకాలైన చక్రాలు కూడా ఉండేవి . అయితే ,మిగిలిన ఆయుధాల్లా దీనికి పిడి ఉండి  పట్టుకుందుకు వీలుగా ఉండేది కాదు .  దీన్ని ఉపయోగించాలంటే , ఒక ప్రత్యేకమైన ఒడుపుతో తిప్పితిప్పి శత్రువులమీదికి విసిరివేసేవారు . విసరడంద్వారా వాడేటటువంటి గొడ్డలి వంటి ఆయుధాలు చేసే గాయాలకన్నా , చక్రాయుధం చేసే గాయం చాలా లోతుగా ప్రభావవంతంగా ఉండేది . అయితే ఈ చక్రాలు మనం విష్ణుమూర్తి చేతిలో చూసేటటువంటివి కావు. ఇవి పదునైన సన్నని ఇనుముతో చేసిన చక్రాలు .  ఒక అంచనా ప్రకారం ఇవి సిక్కుల చేత పరిచయం చేయబడ్డాయి . 1500 A. D. లో శత్రువుల్ని మట్టుపెట్టడానికి వివిధ పరిమాణాల్లో ఉండే వీటిని సిక్కు యోధులు వాడేవారు . ఇంకొందరు చరిత్రకారుల ప్రకారం యూరోపియన్లు వీటిని పరిచయం చేశారు . అయితే యూరోపియన్ చరిత్రలో వీటి వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు అంతగా లభించడం లేదు . కానీ అక్బరునామా లో చక్రప్రహారానికి సంబంధించిన తైలవర్ణ చిత్రాలు మనం చూడొచ్చు .   

ఒక్కొక్క యోధుడూ కనీసం ఒక డజను (12) చక్రాలను మొదటి వరుసలో ఉన్న సైనిక పాతాళం మీదికి విసరదాన్ని మనం ఈ పుస్తకంలోని సజీవ చిత్రాల్లో చూడొచ్చు . వీరిలో కొందరు కృష్ణుడు తిప్పినట్టు వేలితో చక్రాన్ని తిప్పి విసరడాన్నిగమనించొచ్చు.  దీన్ని బట్టి ఈ చక్రఆవిర్భం 1500 AD కి ముందర సిక్కుల చేత  జరిగిందని అనుకోవచ్చు. కానీ 2014లో దక్షిణ భారత దేశంలో బయల్పడిన ఒక శిలా శాసనం మనకి ఈ చక్రప్రహారానికి అంతకన్నా ప్రాచీన చరిత్రే ఉందని తెలియజేసింది . సిక్కుమతం పుట్టే నాటికే చక్రాలని యుద్దాలలో వాడడం మన దేశంలో ఉండేదని దీనివల్ల తెలుస్తూఉంది . సిక్కుమతం 1469 లో పునాదులు వేసుకుంది . కానీ ఈ శాశనం అంతకన్నా ముందరికాలంనాటిదంటారు పురాతత్వ శాస్త్రవేత్తలు . ఇది దాదాపుగా 12 లేదా 13 AD శతాబ్దాలకి చెందినదిగా చరిత్రకారులు చెప్తున్నారు . అప్పటికాలానికే దీన్ని హిండూ క్షత్రియులు  వాడేవారు . ఎలాగంటే ఈ శాశనం బయల్పడింది ఒక హిందూ దేవాలయంలో మరి . 

అయితే, చక్రం అనేది 12 వ శతాబ్దంలో పుట్టిందా అంటే , కాదు దీని చరిత్ర అంతకన్నా ప్రాచీనమైనది అనే తెలుస్తుంది . 2000 సంవత్సరాల క్రితం నాటి భారతీయ ఆధ్యాత్మికత ఇందుకు సంబంధించిన ఆధారాలు అందిస్తోంది . చక్రాన్ని విష్ణువు ఆయుధంగా చెప్పారు .  అదే సుదర్శన చక్రం . దీన్ని తిప్పి వదిలిన తర్వాత అగ్నిని జనింప గల్గడమే కాకుండా, అది శతృనాశనం చేశాక తిరిగి యజమానిని చేరుకునేవిధమైన సాంకేతికత గలిగినదిగా వర్ణింపబడినది . 11వ శతాబ్దంలో తయారైన ఈ చక్రానికి సంబంధించిన ఒక నమూనా మనకి లభ్యమవుతూ ఉంది .  దీనిని ప్రయోగ చక్రం అని పిలుస్తారు .  పూర్తిస్థాయిలో సుదర్శనంలా పనిచేసేది కాదన్నమాట . కేవలం నమూనా మాత్రమే .  ప్రయోగాత్మకంగా సుదర్శన వివరాలు మనం తెలుసుకోవడానికి పనికివస్తుంది . ఈ చక్రం వెనుక మరో చిన్న పాటి చక్రాన్ని అనుబంధంగా కలిగి ఉంటుంది . వెనుకానున్నది ఇన్పుట్ అయితే, బయట ఉన్నది అవుట్ఫుట్ అన్నమాట . వెనుకవైపునున్న చక్రానికి నాలుగు వైపులా సూర్య శక్తిని గ్రహించేవిధంగా రత్నాలని అమరిస్తే , ముందరివైపు కనిపించే చక్రానికి నాలుగువైపులా మూడు వజ్రాన్ని వాడడం మనకి ఆశ్చర్యాన్ని కలిగించక మానదు . అగ్ని చోదనకి సంబంధించిన డిజైన్ ని కూడా మనం ఈ చక్రం మీద చూడొచ్చు . సుదర్శన చక్రానికి చోదకాలుగా విశ్వశక్తిని , సూర్య శక్తిని వాడడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం . మనం ఈ ఇరవయ్యో శతాబ్దంలోనే కదా సోలార్ వస్తువులు విరివిగా వాడుతున్నాం . కానీ ,  ఈ సాంకేతికత మన పూర్వీకులది . అదికూడా 2000 సంవత్సరాల క్రితంనాటి భారతీయ పూర్వజులది . 

ఇప్పుడున్న భారతదేశానికి అటూ ఇటూ విస్తరించి ఉన్న దేశాలవైపు ఒక్కసారి చూసొద్దాం .   ఆఫ్గనిస్తాన్ లో నాల్గవ శతాబ్దానికి చెందిన  చెందిన బ్యాక్ట్రిన్ వంశానికి చెందిన రాజు విష్ణుమూర్తికి ప్రణామం  చేస్తున్న ప్రతిమలో విచిత్రమైన చక్రాయుధాలు ధరించిన విశాల రూపంలో విష్ణుమూర్తి దర్శనమిస్తారు .  ఆతర్వాత అనేకమైన ప్రాచీన కాలం నాటి విదేశీ నాణేల మీద కూడా చక్ర ప్రతిరూపాలున్నాయి .  అవి సుదర్శన చక్ర ప్రతిరూపాలేనని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా నిర్థారించారు . థాయిలాండ్లో మనం ఇప్పటి కాలంలో వినియోగిస్తున్న రౌటర్లవంటి నిర్మాణాలు కలిగిన చక్రాల ప్రాచీన నిర్మాణ నమూనాలు లభ్యం అవుతున్నాయి .  థాయిలాండ్  ని పరిపాలిస్తున్న చక్ర వంశ రాజుల రాజచిహ్నం సైతం చక్రాన్ని దాని మధ్యలో ఒక త్రిశూలాన్ని కల్గి ఉండడం విశేషం . థాయిలాండ్ ప్రజల నమ్మకం ప్రకారం ఈ రాజా వంశీకులు దైవలోకం నుండీ దిగివచ్చారని,ఇప్పటికీ సుదర్శన చక్రం ఈ రాజవంశీకుల దగ్గర సురక్షితంగా ఉందని. అది నిజమయ్యే అవకాశాలూ లేకపోలేదు మరి ! మీరేమంటారు ? ఈ కింది కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి .  

-ప్రవీణ్ మోహన్ గారి పరిశోధనాత్మక వీడియోకి తెలుగు స్వేచ్చానువాదం .
(లక్ష్మి రమణ)

ప్రవీణ్ మోహన్ గారి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Quote of the day

It is the habit of every aggressor nation to claim that it is acting on the defensive.…

__________Jawaharlal Nehru