Online Puja Services

విష్ణునాభి రహస్యం

18.116.85.72

విష్ణునాభి రహస్యం

గెలాక్టిక్ సెంటర్విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒక గెలాక్సీలో అని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కే లేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈ పాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్ సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతం ధనూరాశిలో ఉంది. ఈ ధనూ రాశిలోనే గేలాక్టిక్ సెంటర్ దగ్గరగా మూలా నక్షత్రం ఉంది. ఈ ప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నదని సైన్సు అంచనా వేసింది.ఆ బ్లాక్ హోల్ ఒక పెద్ద నక్షత్రం సైజులో ఉండి, కొన్ని మిలియన్ల సూర్యుల సాంద్రతను కలిగి ఉంది. ఇది ఊహించ నలవి గానంత రేడియో తరంగాలను వేదజల్లగల శక్తిని కలిగి ఉంది.మన సూర్యుని నుంచి ఇది దాదాపు30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన సూర్యుడు తన సౌరమండల గ్రహాలతో సహా ఈ గెలాక్టిక్ సెంటర్ చుట్టూతా 200 మిలియన్ సంవత్సరాలలో ఒకసారి ప్రదక్షిణం చేస్తాడు. దీనికోసం ఆయన శూన్యంలో సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకొక విచిత్రం ఏమిటంటే- ఈ విష్ణు నాభి అనే ప్రాంతం ఒక ఎక్కుపెట్టబడిన విల్లువంటి ఆకారంలో,ధనుస్సులాగా ఉండి ధనూ రాశి అనే పేరుకు సరిగ్గా సరిపోతూ ఉంటుంది.

విష్ణు నాభి - మన పురాణాలు విశ్వం మొత్తాన్నీ విష్ణు స్వరూపంగా వర్ణించాయి. విశ్వం విష్ణు: అంటూ విష్ణు సహస్ర నామం కూడా చెప్పింది. విష్ణు నాబినుంచి ఉద్భవించిన కమలంలో సృష్టి మూలమైన బ్రహ్మ జననం జరిగిందని పురాణాలు చెప్పాయి. మన గెలాక్సీకి కేంద్ర స్థానం అయిన ఈ సెంటర్ ను మన భాషలో నాభి అనవచ్చు.  నాభి అనగా కుదురు, కేంద్రం అని అర్ధాలున్నాయి. అంటే విష్ణునాభి అయినగెలాక్టిక్ సెంటర్ సృష్టికి మూలం అవడానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నటువంటి "మూలా" నక్షత్రమండలం ఈ ఊహకు ఆధారాన్ని కలిగిస్తున్నది. ఇందులో చాలా రహస్యాలు దాగి ఉన్నవి. సృష్టిమూలమైన మహాశక్తి ఇక్కడే ఉన్నదని మనకు సూచన ప్రాయంగా తెలుస్తున్నది.ఇదే ప్రాంతంలో ఉన్నదని సైన్స్ ఊహిస్తున్న బ్లాక్ హోల్ ఆ శక్తి స్వరూపం కావచ్చునా? ఈ విషయం పురాణాలు వ్రాశిన మహర్షులకుఎలా తెలిసి ఉండవచ్చొ, ఈనాడు రేడియో టెలిస్కోపులకు కూడా లీలగా మాత్రమే అందుతున్న ఈ రాశికి వాళ్ళు ఆనాడే కళ్లతో చూచినట్లు "ధనూరాశి" అని ఎలా నామకరణం చేశారో, అందులో బ్లాక్ హోల్ సమీపంలోని నక్షత్రానికి "మూలానక్షత్ర మండలం" అని ఎలా పేరు పెట్టారో మన ఊహకు అందదు. 

రాహుకేతువులు- సృష్టి క్రమం- ఒక అంతుబట్టని రహస్యం.  ధనూ రాశి బాణం ఎక్కుపెట్టిన ఒక విలుకాని రూపంలో ఉంటుంది. ఆ బాణం సరాసరి ఎదురుగా ఉన్న మిధున రాశి వైపు గురి పెట్టి ఉంటుంది. ఈ విధంగా ధనూ రాశి నుంచి మిధున రాశి వరకు ఒక గీత గీస్తే, అది జ్యోతిశ్చక్రాన్ని రెండుగావిభజిస్తుంది. మిధున రాశిలో రాహువుదైన ఆర్ద్రా నక్షత్రం ఉన్నది. ధనూ రాశిలో కేతువుదైన మూలా నక్షత్రం ఉన్నది. మిధున రాశి జంట మిధునానికి సూచిక. అనగా స్త్రీ పురుషులు జంటగా ఉన్న బొమ్మ ఈ రాశిని సూచిస్తుంది. దీన్ని బట్టి ఏం అర్ధం అవుతున్నది? మూలా నక్షత్రం ఉన్న ధనూ రాశి నుంచి స్త్రీ పురుషుల సృష్టి జరిగడానికి అవసరమైన శక్తి ప్రసారం మిధున రాశి వైపు జరుగుతున్నది అని తెలుస్తున్నది. అంటే ప్రధమంగా విశ్వంలో జీవావిర్భావానికి మూలం అయిన శక్తి ప్రసారం ధనూ రాశిలో ఉన్న మూలా నక్షత్ర ప్రాంతం నుంచి మిధున రాశి వైపుగా జరిగి ఉండవచ్చు. ఇక్కడే ఇంకొక విచిత్రం ఉన్నది. ఈ నాటికీశిశు జననం జరిగినప్పుడు బొడ్డు కోయడంజరుగుతుంది. గర్భస్ఘ శిశువుకు బొడ్డు ( నాభి) ద్వారానే తల్లినుంచి పోషణ అందుతుంది. అలాగే విశ్వం మొత్తానికీ శక్తి ప్రసారం విశ్వ నాభి అయిన గెలాక్టిక్ సెంటర్లో ఉన్న మూలా నక్షత్రం నుంచి జరుగుతూ ఉండవచ్చు. ఆ శక్తి కేంద్రంతో బంధం తెగిన మరుక్షణం జీవి మాయామోహాలకు లోబడి మానవ జన్మలోకి ఆడుగు పెట్టటం జరుగుతుండవచ్చు.

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda