Online Puja Services

సుందరాకాండ చూపించే పాతిక పరిష్కారాలు !

18.222.240.21

మన సమస్యలకి సుందరాకాండ చూపించే పాతిక పరిష్కారాలు !
-లక్ష్మీ రమణ 
 
నిత్యజీవితంలో మనం ఎన్నో సమస్యలతో సతమతం అవుతూనే ఉంటాం. సంసారమనే సుడిగుండంలో ఈ సమస్యలు సాధారణమైనవే అయినా అవి ఒక్కోసారి జలగల్లాగా పట్టి పీడిస్తుంటాయి. ఈ పీడనకి ఎవరూ అతీతులు కాదుకదా ! సరే, సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని మానవప్రయత్నంగా వెతుక్కోవాలి. అలా వెతుక్కోకలేకపోతే, ఇక దైవమే దిక్కు. అలాంటి జటిలమైన సమస్యలకి పరిష్కారం చూపించగల మహిమగలది సుందరాకాండ.   

సుందరకాండ సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టింది. రాముని ఆర్తిని తీర్చింది. మారుతి మహిమని చెప్పేది. సుందరకాండ పారాయణం ఎన్నో సమస్యలకు పరిష్కారం. దీనిలోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది ప్రయోజనాన్ని పొందారు. ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితాల్లో దీన్ని ఒక్కరోజులో పారాయణం చేయడం సాధ్యమయ్యే పనికాదు. కానీ సుందరాకాండలోని కొన్ని సర్గలు పారాయణం చేయడం వలన మనం సమస్యల నుండీ బయటపడొచ్చు .  అయితే, అందులో ఏ సమస్యకు ఏ సర్గ పరిహారమనేది  వివరంగా ఉంది. దానిని ఇక్కడ పాఠకుల సౌకర్యార్థం పొందుపరుస్తున్నాం . చిన్న చిన్న  నియమాలతో కూడి ఉన్న ఈ పారాయణలని వీలయితే తప్పక ఆచరించండి . 

1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి:

శ్లోకం : ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
        లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు , 108 సార్లు , శక్తి  కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.

2. విద్యాప్రాప్తికి:

ఒకసారి సుందరాకాండని పరిపూర్ణంగా పారాయణ చేయాలి . 3 రోజులు ద్రాక్షపళ్ళు , అరటిపళ్ళు నివేదన చేయాలి. 

3. భూతబాధ  నివారణకు:

సుందరాకాండలోని 3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 రోజుల పాటు పారాయణ చేయాలి .  కొబ్బరికాయ , అరటిపళ్ళు స్వామికి నివేదించాలి .

4. సర్వ కార్య సిద్దికి:

సుందరాకాండలోని 64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 రోజులు పారాయణచేయాలి. శక్తి కొలది అరటిపళ్ళునివేదన చేయాలి .

5. శత్రు నాశనముకు:

51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి  కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయాలి. 

6. వాహనప్రాప్తికి:

8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 రోజులు పారాయణ చేయాలి.  శక్తి  కొలది  అరటి , దానిమ్మ నివేదన చేయాలి. 

7. మనః శాంతికి:

11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి.  అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయాలి. 

8. స్వగృహం కోరుకొనేవారు :

7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి  40 రోజులు పారాయణ చేయాలి. అరటిపళ్ళు చక్కెరతో కలిపి నివేదన చేయాలి . 

9. యోగక్షేమాలకు:

13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 రోజులు పారాయణ చేయాలి.  శక్తి  కొలది  అరటి , దానిమ్మ నివేదన చేయాలి . 

10. ఉద్యోగప్రాప్తికి:

63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి  కొలది  అరటి , దానిమ్మ నివేదన చేయాలి.

11. రోగ నివారణకు:

34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతి రోజూ, 21 రోజులు పారాయణ చేయాలి. శక్తి  కొలది బెల్లపు ముక్క  అరటిపళ్ళు నివేదన చేయాలి . 

 12. దుఃఖనివృత్తికి:

67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి.  శక్తి  కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయాలి.

13. దుస్వప్న నాశనానికి:

27వ సర్గ ఏకాగ్రతతో 1 సార్లు ప్రతి రోజూ చదవాలి. శక్తి  కొద్దీ అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయాలి . 

14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమం గా ఉండడానికి:

33 నుండి 40 వ సర్గ వరకు ఒకసారి , 21 రోజులు పారాయణ చేయాలి. శక్తికొద్దీ  అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయాలి.

15. ధనప్రాప్తికి:

15వ సర్గ ఏకాగ్రతతో రోజుకి ఒకసారి  40 రోజులు పారాయణ చేయాలి. అరటిపళ్ళు, పటిక బెల్లం నివేదన చేసి,   రామాయణం లోని  అయోధ్యకాండలో ఉన్న యాత్రాదానము 32 వ సర్గ  రోజుకి ఒకసారి , 40 రోజులు పారాయణ చేయాలి . శక్తి  కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయాలి ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).

 16. దైవాపచార ప్రాయశ్చిత్తం:

38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27రోజులు పారాయణ చేయాలి. శక్తి  కొలది అరటిపళ్ళు వీలైతే  పనసపండు నివేదన చేయాలి .

17. బ్రహ్మజ్ఞానము కోసము :

19 వ సర్గ  అతినిష్ఠతో రోజుకు ఒకసారి , ఒక సంవత్సరము రోజులు పారాయణ చేయాలి.  శక్తికొలది రోజూ అరటిపళ్ళు నివేదన చేయాలి .

18. ఏలిననాటి శనీ దోష పరిహారము, సకల రోగ నివృత్తికి , సర్వ పాప నివృత్తికి:

మొత్తం సుందరకాండ  నిష్ఠతో 9 రోజులకొకసారి పూర్తి చేస్తూ, 68 రోజులు చదవాలి .  అంటే, దాదాపు 7 సార్లు చదవాలన్నమాట .  రోజూ  కొబ్బరికాయ నివేదన చేయాలి . 

19. కన్యా వివాహం కోసం :

9 రోజులకొకసారి పూర్తి చేస్తూ 68 రోజుల్లు చదవాలి .  సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పారాయణ చేయాలి .  అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయాలి  .

20. విదేశీ యానము కోసం :

1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5  సార్లు 30 రోజులు పఠించాలి. శక్తికొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయాలి . 

21. ధననష్ట నివృత్తికి:

55వ సర్గ నిష్ఠతో 3  సార్లు 30 రోజులు చదవాలి . శక్తి కొలది అరటిపళ్ళు, పనస నివేదన చేయాలి . 

22. కోర్టుకేసుల్లో విజయము కోసం :

42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు , 21 రోజులు చదవాలి .  శక్తికొద్దీ అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయాలి.

23. వ్యాపారాభివృద్ధికి:

15వ సర్గ నిష్ఠతో, నియమంతో 5 సార్లు 21 రోజులు పారాయణ చేయాలి . శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .

24. పుత్ర సంతనం కావాలనుకునేవారు :

ప్రతిరోజూ  7 వ సర్గని  నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయాలి .  శక్తికొద్దీ అరటిపళ్ళు , కొబ్బరికాయ , నివేదన చేయాలి . తమలపాకులతో స్వామికి అర్చన చేయాలి  . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చు .

25. ఋణ విముక్తికి:

28 వ సర్గ చాలా నిష్ఠగా , రోజుకి 1 సారి 41 రోజులు పఠించాలి .  శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయాలి. 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi