Online Puja Services

హనుమంతుడు సువర్చలా వృత్తాన్తం ఎక్కడ వుంది?

3.142.98.108

ఓం నమో భగవతే శ్రీ సువర్చలా సమేత ఆంజనేయాయ నమః

హనుమత్కల్యాణం

 జై శ్రీరామ్ 

రామాయణంలో హనుమంతుని 
కల్యాణం విషయం లేదు కదా *
సువర్చలా వృత్తాంతం ఎక్కడిది *
అని కొందరు ప్రశ్నిస్తారు * 

సమాధాన మేమిటంటే *
హనుమంతుని చరిత్ర అంతా రామాయణంలో లేదు *
కథకు అవసరమైన మేరకే వాల్మీకి స్వీకరించాడు *
అన్నీ యుగాలలోనూ చిరంజీవిగా ఉన్న
హనుమంతుని సంపూర్ణ చరిత్ర *
కేవలం త్రేతాయుగానికి చెందిన
రామాయణంలో  ఉండే అవకాశం లేదు *

అలాగే * హనుమంతుడు  బ్రహ్మచారి అంటారు *
ఈ వివాహం ఎలా జరిగిందనేది మరో ధర్మసందేహం

బ్రహ్మచర్యం నాలుగు రకాలు *

గాయత్రం * బ్రహ్మం * ప్రజాపత్యం *
బృహన్ * అని వాటికి పేర్లు *

భార్యతో నియమపూర్వక జీవితం గడిపేవారిని  ప్రజాపత్య బ్రహ్మ -- చారులంటారు *
బ్రహ్మచర్య నియమాలను సరిగా
అర్ధం చేసుకోగలగాలి *

హనుమంతుడు భవిష్యద్ర్బహ్మ
ఆయన బ్రహ్మస్తానం పొందినవాడు *
సువర్చలాదేవి సరస్వతి స్థానం పొందుతుంది *
దేవతల భార్యలంటే అర్ధం వారి శక్తులే *
బ్రహ్మచర్య నిష్టాగరిష్టునికి ఉండే శక్తి
వర్చస్సు సువర్చస్సు ఆమెయే సువర్చలా దేవి *

              కళ్యాణ వైభోగం

సువర్చలాపతిష్షష్ఠః అన్నారు *
హనుమంతునికి నవావతారాలు ఉన్నాయి *
వాటిలో ఆరోది సువర్చలాంజనేయ అవతారం *

సువర్చలా హనుమత్ ద్వాదశక్షరీ మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది *

ధ్వజదత్త, కపిలాది భక్తి ఉపాసకులకు సువర్చలాహనుమత్ సాక్షాత్కారం జరిగింది *

దేశం నలుమూలలా మాత్రమే కాకుండా విదేశాలలో
కూడా సువర్చలాంజనేయ విగ్రహాలున్నాయి *

బందరు పరాసుపేటలో
శివాజీగురువు సమర్ధ రామదాసుస్వామి
16వ శతాబ్దిలో ప్రతిష్ఠించినది సువర్చలాంజనేయ
ఆలయమే * అనేక హనుమాదాలయాలలో
వైశాఖ, జ్యేష్ఠ, మాసాల్లో కల్యాణాలు నిర్వహించడం
సువర్చలాంజనేయుల ఉత్సవమూర్తులను
సిద్ధంచేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది * హనుమ- దుపాసకులు ఎందరో
హనుమత్కల్యాణం నిర్వహిస్తూ ఉంటారు *

మార్గశిర శుద్ధ త్రయోదశినాటి
హనుమద్ర్వత సమయంలో
సువర్చలాంజనేయ కలశాలను ఉంచి పూజిస్తారు *

సువర్చలా హనుమత్ గాయత్రి మంత్రం
జపించడంవల్ల వివాహంఅయిన వారెందరో ఉన్నారు,
గృహస్ధులైన వారికి సువర్చలాంజనేయ సేవ
సకల శ్రేయేభివృద్ధులనూ కలిగిస్తుంది *

సూర్యుని భార్య సంజ్ఞాదేవి *
ఆమె విశ్వకర్మ కుమార్తె * సూర్యతాపాన్ని భరించలేక
తన ఛాయను సృష్టించి/సూర్యుని సేవలో ఉంచింది *
తాను సముద్రగర్బంలో అశ్వరూపంలో
తపస్సు చేసుకుంటుంది *

ఒకరోజు విశ్వకర్మ తన కుమార్తెను చూడడానికి వచ్చాడు *
సూర్యుని వద్ద ఉన్నది తన కుమార్తె కాదని గుర్తించి
సూర్యునికి ఆ సంగతి తెలియచేసాడు *
అప్పుడు సంజ్ఞాదేవి సముద్రగర్బంలో
ఉండటం గ్రహించిన సూర్యుడు
అశ్వరూపంలోనే ఆమెను కలిశాడు *
అప్పుడు పుట్టినవారే అశ్వినీదేవతలు *

సంజ్ఞాదేవి తన తేజస్సు భరించలేకుండా
ఉన్నకారణంగా మామగారైన దేవశీల్పి
విశ్వకర్మను రావించాడు *
లోహాన్ని ఒరిపిడి పెట్టినట్లు చేసి
సూర్యతేజస్సును కొంత తగ్గించాడు *

విశ్వకర్మ అలా ఒరిపిడి పెట్టిన‌తేజస్సు నుంచి
విష్ణువుకు చక్రము * శివునికి త్రిశూలం *
మొదలైన ఆయుధాలను విశ్వకర్మ తయారుచేశాడు * ఇంకా కొంత సూర్యుని వర్చస్సు మిగిలింది *
దానికి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ/చేశాడు *

శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆడపిల్ల అయింది *
ఆ సూర్యసర్చస్సుకు సువర్చస్సు -- సువర్చల
అని పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు *

ఈ సుగుణవతి ఎవరికి భార్య అవుతుంది ?
అని ఇంద్రాదులు ప్రశ్నించినప్పుడు *
సూర్యుని ఫలమనే బ్రాంతితో పట్టబోయినవానికి
ఈమే భార్య‌ కాగలదని  సమాధానం చెప్పాడు *

ఆయనే హనుమంతుడని అందరికీ
తెలిసిన విషయమే *
ఆంజనేయుడు సూర్యుని వద్ద‌
విద్యాభ్యాసం చేశాడు *
ఏకసంథ్మాగ్రాహిగా వేదశాస్త్రాదులు * ఇంద్రవ్యాకరణంతో సహా
వ్యాకరణాలు నేర్చుకున్నాడు *
ఆయనలోని అసాధారణ పజ్ఞకు
సూర్యుడు చాలా సంతోషించాడు *

తస్య బుద్ధిం చ విద్యాం చ బల శౌర్య పరాక్రమాన్ !
విచార్య తస్మె ప్రదతౌ స్సస్య కన్యాం సువర్చలామ్ !!

హనుమంతుని బుద్ధి *
విద్య బలపరాక్రమములు
చూచి మెచ్చిన సూర్యభగవానుడు
తన కుమార్తె అయిన సువర్చలను
హనుమంతునకు ఇచ్చి వివాహం చేయదలిచాడు *
కానీ హనుమంతుడు బ్రహ్మచర్య వ్రతం  
పాటించ దలచానని చెప్పాడు *
నీ బ్రహ్మచర్య నిష్టకు భంగం కాని రీతిలో
ఈమెను స్వీకరించు అంటూ సూర్యభగవానుడు జ్యేష్ఠ శుద్ద దశమినాడు సువర్చలా హనుమంతునకు
కల్యాణం చేశాడు *

రామభక్తులకు రామాయణం *
కృష్ణభక్తులకు భాగవతం * ఎలా ప్రమాణమో *
హనుమద్బక్తులకు పరాశర‌ సంహిత అలా ప్రమాణం *

ఈ గ్రంథం చాలాకాలం వెలుగులోకి రానందువల్ల
సమాజానికి పూర్తి హనుమచరిత్ర
ఆలస్యంగా అందింది *

శ్రీరామదూతం శిరసా నమామి
ఓం నమో నారాయణాయ
 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 
 జై శ్రీ రామ్ 

- Murthy VS

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha