Online Puja Services

సమస్యలకి సుందరకాండ అద్భుత పరిష్కారాలు

3.141.165.180
మన సమస్యలకి సుందరకాండ అతిశక్తివంతమైన తాంత్రిక పరిష్కారాలు!!!!
 
సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు.. 
ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది. 
ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.
 
1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి
-----------------------------------
శ్లోకం : ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
*లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||
 
21 దినములు , 108 సార్లు , శక్తి కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.
 
2. విద్యాప్రాప్తికి
----------------------
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన
 
3. భూతబాధ నివారణకు
--------------------------------
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన
 
4. సర్వ కార్య సిద్దికి
------------------------
64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను .శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను
 
5. శత్రు నాశనముకు
--------------------------
51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను .
 
6. వాహనప్రాప్తికి
---------------------
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .
 
7. మనః శాంతికి
--------------------
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .
 
8. స్వగృహం కోరువారికి
------------------------------
7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను .
 
9. యోగక్షేమాలకు
------------------------
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.
 
10. ఉద్యోగప్రాప్తికి
-----------------------
63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .
 
11. రోగ నివారణకు
------------------------
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను .
 
12. దుఃఖనివృత్తికి
-------------------------
67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను
 
13. దుస్వప్న నాశనానికి
---------------------------------
27వ సర్గ ఏకాగ్రతతో 1 సార్లు ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .
 
14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు
------------------------------------
33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 21 దినములు నిష్ఠతో పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .
 
15. ధనప్రాప్తికి
-------------------
15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పఠించవలెను.*
*అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 32 వ సర్గ 1 సారి , 40 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).
 
16. దైవాపచారా ప్రాయశ్చిత్తం
------------------------------------
38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను .
 
17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు
------------------------------------
19 వ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 1 సంవత్సరము పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
 
18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు
----------------------
సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి
------------------------------------
మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 68 రోజులు చదువవలెను. నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును .
 
19. కన్యా వివాహమునకు
--------------------------------
9 దినములలో ఒకసారి పూర్తిగా 68 దినాలలో పఠించవలెను. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించవలెను. అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను .
 
20. విదేశీ యానమునకు
-----------------------------
1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు 30 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .
 
21. ధననష్ట నివృత్తికి
----------------------------
55వ సర్గ నిష్ఠతో 3 సార్లు 30 దినములు పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, పనస నివేదన చేయవలెను.
 
22. వ్యాజ్యములో విజయమునకు
-----------------------------------
42 సర్గ అతి ఏకాగ్రతతో 3 
సార్లు , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను .
 
23. వ్యాపారాభివృద్ధికి
---------------------------
15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .
 
24. పుత్ర సంతానానికి
---------------------------
ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ , నివేదన చేయవలెను. శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును .
 
25. ఋణ విముక్తికి
--------------------------
28 వ సర్గ చాలా నిష్ఠగా , రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda