ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు

75.101.220.230
ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!! మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి!!
 
ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!
 
జయత్యతి బలో రామః 
లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో 
రాఘవేణాభి పాలితః !!
 
దాసోహం కౌసలేంద్రస్య 
రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం 
నిహంతా మరుతాత్మజః !!
 
నరావణ సహస్రం మే 
యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః
పాదపైశ్చ సహస్రశః !!
 
అర్ధయిత్వాం పురీం లంకాం 
మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి 
మిషతాం సర్వ రక్షసాం !!
 
హనుమాన్ అంజనాసూనుః
వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ ఫల్గుణః స్సఖః
పింగాక్షోమిత విక్రమః
 
ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పహ.
 
ద్వాదశైతాని నామాని
కపీంద్రశ్చ మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం 
యాత్రాకాలే విశేషతః
 
తస్యమృత్యు భయంన్నాస్తి 
సర్వత్ర విజయీ భవేత్!!
 
(ఈ హనుమంతుని ద్వాదశనామాలను
విశేషించి యాత్రలకు వెళ్ళేటప్పుడు లేదా
ఏదైన ముఖ్యమైన పనులకోసం వెళ్ళేటప్పడు
పఠించండి సర్వత్రా విజయాన్ని పొందండి)
 
అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.
 
శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.
 
ఇది పఠించిన వారికి జయం తధ్యం !!
 
జయశ్రీ రామ!! శుభమ్ భూయాత్!!!!
 
- రాజారెడ్డి వేడిచర్ల 

Quote of the day

Democracy and socialism are means to an end, not the end itself.…

__________Jawaharlal Nehru