Online Puja Services

శ్రీ ఆంజనేయ దండకం

3.141.197.212

శ్రీ ఆంజనేయ దండకం 

ఇందులో సంస్కృత పదాలు పొదగబడటంవల్ల 
శబ్దశక్తి, మంత్రశక్తి కలిగి ఉంది.
అందువల్లనే ఈ దండకం శ్రద్ధగా పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీర్చటంలో చాలా ప్రభావశాలిగా ఉన్నది.

ఈ దండకాన్ని నిష్టతో పఠించినట్లయితే, 
సర్వపాపాలూ నశిస్తాయి.
బాధలు, భయాలు, అనారోగ్యాలూ ఉండవు. భోగభాగ్యాలు వరిస్తాయి.
సకల సంపదలూ కల్గుతాయి. 
భూతప్రేత పిశాచ రోగ శాకినీ డాకీనీ గాలిదయ్యంబులు దరికి చేరవు..!!

దండకం

శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజేవాయుపుత్రం భజే వాలగాత్రం 
భజేహం పవిత్రం భజే సూర్య మిత్రం 
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ 
ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే
దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిఁవిచారించి
సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి
యవ్వాలినిన్ జంపించి కాకుత్థ్సతిలకున్ 
దయాదృష్టి వీక్షించి
కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భుమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి 
సంతుష్టునింజేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలుదులున్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై
యా దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తిన్ వైచి
యాలక్ష్మణున్ మూర్చనొందింపగానప్పుడే 
నీవు సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదులన్ వీరులంబోర 
శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోద్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి 
శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి 
నీ కీర్తనల్ చేసినన్ పాపముల్బాయునే 
భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే 
సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నెంచి 
యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ 
స్థిరముగన్ వజ్రదేహంబునున్ దాల్చి 
శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన 
ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి 
నీ దీర్ఘదేహంబు తైలోక్య సంచరివై 
రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ 
రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత 
ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ డాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,
కాలాగ్ని రుద్రండవై బ్రహ్మప్రభా భాసితంభైన నీదివ్యతేజంబునున్ జూచి,
రారనాముద్దునరసింహాయంచున్,
దయాదృష్టివీక్షించి, నన్నేలు నాస్వామి ! 
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే ! 
వాయుపుత్రా నమస్తే !
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః

- శ్రీ రాధా లక్ష్మి 

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda