తిరుమల వేంకటేశ్వరుని దర్శించాలనుకుంటే ఇవి పాటించాలి..

3.236.212.116

కరోనా మహమ్మారి ప్రజలనే కాదు. దేవుళ్లను కూడా చాలా ఇబ్బంది పెట్టింది.  మార్చ్ 23 నుంచి అమలు చేసిన లాక్ డౌన్ వల్ల దేశంలోని అన్ని దేవాలయాలలోను దర్శనాలను నిలిపి వేశారు. లాక్ డౌన్ 4 దఫాలుగా విరామం లేకుండా పొడిగించినప్పటికీ ఫలితం లేకపోగా ఇంకా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం తో 5 వ దఫాగా జూన్ 30 వరకు కొన్ని సడలింపులతో లాక్ డౌన్ పొడిగించారు. అయినా కరోనా ఎక్కడ నుంచి, ఎవరి నుంచి సోకుతుందో అని ప్రజలు సహజంగానే ఆందోళన చెందుతున్నారు. 

ఈ వైరస్ ను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.  అయినప్పటికీ ప్రజల ఇబ్బందులు, కష్టాలు దృష్టిలో ఉంచుకొని జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులో భాగంగా జూన్ 8 నుంచి ప్రార్ధనా స్థలాలు, దేవాలయాలు ప్రజల దర్శనార్ధం తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా అందరికి ముఖ్యమైన, ఎంతో మందికి కులదైవం ఐన తిరుమల తిరుపతి వెంకన్న దేవాలయం కూడా ప్రజల దర్శనానికి సిద్ధమవుతోంది. అయితే తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకోవాలంటే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. అవి ఏంటో తెలుసుకుందామా.. 

కేంద్ర ప్రభుత్వం ఆలయాలను దర్శనానికి అనుమతి ఇవ్వడంతో, టీటీడీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మార్గదర్శకాలను దేవాదాయ శాఖ తయారు చేసి వైద్య ఆరోగ్య శాఖకు పంపినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం  నుంచి అనుమతి లభించిన వెంటనే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. 

- అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా కేవలం లఘు దర్శనానికే పరిమితం చేస్తారు. 

- గంటకు 300 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. 
- కంపార్టుమెంట్స్ లో వేచి వుండే పద్ధతి ఉండదు. 
- కరెంటు బుకింగ్, ఆన్ లైన్ ద్వారా టైం స్లాట్ టికెట్స్ జారీ చేస్తారు 
- తిరుమలకు వచ్చే  భక్తులు విధిగా మాస్కులు, గ్లౌజలు ధరించాల్సి ఉంటుంది. 
- కాటేజీ గదులలో కూడా ఇద్దరు మాత్రమే బస చేసేందుకు అనుమతి అని సమాచారం. 

- కాటేజీ గదులు కూడా ఒక దానిని వదిలి ఇంకొకటి మాత్రమే ఇస్తారు. మొత్తం వున్న గదులలో 50%  గదులు మాత్రమే కేటాయిస్తారు.
 - తల నీలాలు సమర్పించే చోట్ల క్షురకులు అన్ని జాగ్రత్తలు తీసుకొనేలా చర్యలు చేపట్టారు. . అలాగే భక్తులు కూడా పూర్తి జాగ్రత్త వహించాలని     సూచిస్తున్నారు.  
- ఆలయ ప్రాంగణం లోని దుకాణాలు కూడా ఒకదానిని విడిచి మరొక దానికి మాత్రమే అనుమతి. 
- రెగ్యులర్ గ జరిగే అన్నదానం, నిత్యాన్నప్రసాదం ఉండదు. 
- ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతులు లేవు
- బయట ఫుడ్ స్టాల్ల్స్ కు అనుమతులు లేవు

ప్రభుత్వం, దేవాదాయ శాఖ, టీటీడీ బోర్డు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, భక్తులు ఎంత జాగ్రత్తగా ఉంటే, వారికి, వారితో పాటు ఇతర భక్తులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో మంచిది. ఆ వెంకన్న మనలను కాపాడుతాడు మన జాగ్రత్తలో మనం ఉంటే..  
 

 

Quote of the day

The Way is basically perfect. It doesn't require perfecting.…

__________Bodhidharma