శ్రీవారి మొదటి గుమ్మం కులశేఖరపడి

3.236.212.116
తిరుమల శ్రీవారి మొదటి గుమ్మం కులశేఖరపడి.
 
కులశేఖరుడు కేరళకు చెందిన మహారాజు.  
ఈయన మహా వైష్ణవ భక్తుడు, మంచి కవి. ఈయన వేంకటాచలాన్ని (తిరుమలను) ఉద్దేశించి తమిళంలో 11 పాశురాలను రాసాడు. ఒక దానిలో....

"పడియాయ్ కెడందు ఉన్ పవళవాయ్ కాన్ బేనే"
 
- "ఓ శ్రీవేంకటేశా, నీముందు రాతిగడపగా పడిఉంటే నీ ముఖారవిందాన్ని నిత్యం చూస్తూ ఉండవచ్చుకదా!" అని అర్ధం. అందుకే శ్రీవారి ముందువున్న గడప(పడి) 'కులశేఖరపడి' అని ప్రసిద్ది పొందింది.

ఆహా ఈ కులశేఖరుడు ఎంత ధన్యుడో కదా!  ఈయన 'ముకుందమాల' వంటి గ్రంథాన్ని రచించిన మహాకవి. ఆ కులశేఖరపడి గడపకు అందరం నమస్కరించి, ఆ గడప అవతల ఉన్న శ్రీవారిని గట్టిగా స్మరిద్దాం. 

గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవింద

సేకరణ: K ముని సుబ్రహ్మణ్యం 

Quote of the day

The Way is basically perfect. It doesn't require perfecting.…

__________Bodhidharma