Online Puja Services

శ్రీవారి పూజలో కొన్ని ముఖ్యమైనవి

18.216.124.8
శ్రీవారి  పూజలో కొన్ని ముఖ్యమైనవి.........!!
 
అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిని ఎంత పూజించిన కిర్తించిన తనివి తీరదు.  కొలిచే వారి కొంగు బంగారమై కోరిన వరాలను ఇచ్చే కోనేటి రాయుడు , పద్మావతి ప్రియుడు, ప్రసన్న వధనుడు, అయిన శ్రీవారికి ఏది ఇష్టమో తెలుసుకుందాము...
 
శ్రీనివాసుడికి ముఖ్యమైన సమయం ఉదయం 3 గం. ఆ సమయంలో , యంత్ర ప్రతిష్ట చేసిన ప్రతి దేవాలయంలో ని విగ్రహం రెప్పపాటు సమయం మహావిష్ణువు రూపం దాల్చి తిరిగి యధా రూపం దాల్చుతుంది.  ఆ సెకండ్ సమయంలో స్వామి వారిని దర్శించేందుకు ముక్కోటి దేవతలు, మునులు వేచి ఉంటారు. ఆ సమయంలో రోజు అష్టాక్షరీ మంత్రం తో ధ్యానం చేయడం, చాలా విశేష ఫలితం ఇస్తుంది.
 
 శ్రవణ నక్షత్రం రోజు స్వామి వారికి ఉదయం 3 am కి తేనే నివేదన చేసి నెలలో. ఒక్క రోజు ఆవిధంగా చేస్తే నెలంతా చేసిన ఫలితం దక్కుతుంది.
 
ఉదయం 5.30 ని దీపానికి అధిపతి లక్ష్మీ దేవి ఏ ఇంట్లో అయితే ఆ సమయంలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ని దీపంలో లక్ష్మీ దేవి కొలువై శ్రీనివాసుని ద్యానిస్తుంది ఎక్కడ ఆ తల్లి కూర్చిని స్వామి ని ద్యానిస్తుందో ఆ ఇంటి పైన శ్రీనివాసుని దృష్టి పడుతుంది.
 
వెంకటేశ్వర స్వామి కి ఇష్టమైనది పిండి దీపాలు, బియ్యం పిండిని ప్రమిధగా చేసి అందులో ఆవు నైయి పోసి దీపం వెలిగించాలి.. ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతుంది, అప్పులు తిరిపోతుంది, స్త్రీలకు మాంగళ్య దోషం తోలగి పోతుంది, ఇంట్లో గొడవలు తగ్గుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది, ఉపాధి లేని వారు ప్రతి శనివారం, మంగళవారం ఇలా పిండితో శ్రీనివసుడికి దీపం వెలిగించి చింబిలి నివేదిస్తే వారి ఆటంకాలు అన్ని తొలగి పోతుంది.
 
స్వామి కి తులసి అంటే ఇష్టం ప్రసాదంలో కచ్చితంగా తులసి ఆకు పెట్టె నైవేద్యం పెట్టాలి తులసి దొరకని సమయంలో తులసమ్మను తలచుకుని నైవేద్యం పెట్టాలి, బియ్యం, నువ్వులు, బెల్లం, ఆవు నైయి కలిపి పొడి చేస్తే చింబిలి అవుతుంది.. అది ప్రతి శనివారం రోజు నివేదించి ప్రసాదం స్వీకరిస్తే శని బాధలు, ఈతి బాధలు, తగ్గుతుంది.. బెల్లం అన్నం శుక్రవారం రోజు స్వామికి నివేదించాలి.
 
స్వామి వారి తీర్థంలో ముఖ్యమైనది తులసి తీర్థం అందులో పచ్చ కర్పూరం, స్వామి వారికి తీర్థం తాంభూలంలో పచ్చ కర్పూరం తప్పకుండా వాడాలి స్వామి వారికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం.
 
వివాహం, ఉద్యోగం, ఏదైనా కొనడం అమ్మడం, కోర్ట్ తగాధాలు ఇలాంటి కొన్ని సమసిపోని సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామి కి శనివారం రోజు ఒక పసుపు బట్టలో 11 రూపాయి నాణాలు ముడుపు కట్టి స్వామి ముందు ఉంచి వారి కోరిక చెప్పుకొని అది నెరవేరాక ఆ ముడుపు తో పాటు వడ్డీ కలిపి హుండీలో వేయాలి.. ఇది మంచి పరిష్కారం.
 
స్వామి వారికి కీర్థనలు అంటే చాలా ఇష్టం కలియుగంలో నామ స్మరణ, కీర్తన తోనే ప్రసన్నుడు అవుతాడు స్వామి, పాడటం అందరికి రాకపోయినా రోజూ ఒకసారి గోవింద నామాలు స్మరించడం వల్ల స్వామి అనుగ్రహం దక్కుతుంది.
 
ఇక స్వామి వారి అనుగ్రహం కోసం, ఏకాదశి వ్రతాలు, ఏడు శనివారం వ్రతాలు, శనివారం ఉపవాసాలు, ఇవన్నీ ప్రీతిగా భక్తిగా ఆచరిస్తారు, శనివారం నాడు రావి చెట్టు ప్రదర్శన చేసిన స్వామి అనుగ్రహము దక్కుతుంది.. నిత్యం హరినామ స్మరణ సకల పాపహారం...
 
(శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, స్వామి ని ఎంత అలంకరిస్తే అంత సంతోష పడతాడు, అలాగే పూజ చేసే వారు కూడా స్వామి నామం ధరించి చక్కగా అలంకారం తో చేయాలి.)
 
- చేవూరి శ్రీకాంత్ 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi