Online Puja Services

తిరుమల వచ్చే భక్తులకు మనవి

18.224.30.118

 

తిరుమల వచ్చే భక్తులకు మనవి

 

 

ఆన్లైన్ లో 300 రూపాయల దర్శనం టికెట్ వేయించుకున్న వారు CRO ఆఫీస్ కి వెళితే అక్కడ 100 రూపాయలరూమ్స్ వరహస్వామి విశ్రాంతి భవనం నందు రూమ్ కి ఇద్దరి చొప్పున వెంటనే రూమ్స్ ఇస్తున్నారు 

 అలానే ఎక్కడ టిఫిన్ హోటల్స్  లేవు వాటర్ బాటిల్స్ అమ్మడం లేదు కావున తిరుమల వచ్చే వారు ఇంట్లోబాటిల్ తెచ్చుకుంటే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్  ఫిల్ చేసుకోవచ్చు.

 ఒక్క వరహస్వామి విశ్రాంతి భవనం పక్కన ఒక్క టిఫిన్ హోటల్,   మెడికల్ షాప్  మాత్రమే ఉన్నది వెంగమాంబ లో టేబుల్ కి ఇద్దరిని మాత్రమే కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్  చేస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం వసతి ఏర్పాటు చేశారు .

లడ్డుప్రసాదం ఒకటి 50 రూపాయలు చొప్పున ఎవరికి ఎన్నికావాలంటే అన్ని ఇస్తున్నారు.దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది ఎక్కడ ఎవరిని తగలకుండా చాలా జాగ్రత్తలు_తీసుకుంటూ నిదానంగా పంపిస్తున్నారు టైమింగ్ కి.  ఒక 45 నిమిషాలలో దర్శనం అవుతుంది.

అలానే తలనీలాలు మూడుకతెర్లు ఇచ్చే వాళ్ళు నందకం గెస్ట్ హౌస్  కింద అండర్ గ్రౌండ్  లో ఎటువంటి రుసుము లేకుండా పలు జాగ్రత్తలు పాటిస్తూ చేతికి గ్లౌజ్స్ వేసుకొని  ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.

స్వామివారిని మనజన్మ లో ఇటువంటి దర్శనం చేసుకోలేము.  ఇంత ప్రశాంతమైన తిరుమల ఎప్పుడు చూడలేము.

వరాహస్వామి టెంపుల్ రిపేర్ చేయిస్తున్నారు కావున వరహస్వామి టెంపుల్ క్లోజ్ చేశారు.

ఏడుకొండల వాడా వెంకటరమణ  గోవింద గోవిందా

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore