Online Puja Services

తిరుమల లో అంగప్రదిక్షణ

18.219.236.62

తిరుమల లో అంగప్రదిక్షణ...

వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .

1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు .

2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి టికెట్స్ ఇవ్వరనుకుంట .

3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది .

   మీరు 1am లోపే అక్కడ ఉండండి .

4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా చెబుతారు .

5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది .

6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఉచితంగా ఒక లడ్డు ఇస్తారు 

7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .

8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు .

9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం .

10. ఈ దర్శనంలో ఇంకా గొప్ప అనుభూతి ఏంటంటే స్వామి సుప్రభాతం మొదలు అవ్వగానే అంగప్రదక్షణ కూడా మొదలు అవుతుంది..
మనం అంగప్రదక్షణ చేసి దర్శనం కి వెళ్లే సమయానికి అర్చన తోమాల మొదలు అవుతాయి..

11. సుప్రభాతం, అర్చన, తోమాల వంటి సేవలు లభించని వారు ఒక్క అంగప్రదక్షణ సేవతో అన్ని అనుభూతి పొందవచ్చు.. ఆ సమయంలో కాస్త రద్దీ కూడా తక్కువ ఉండటంతో దర్శనం చాలా బాగా జరుగుతుంది..

12. అంగప్రదక్షణ సేవ కోసం టోకెన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి గా ఉండాలి..

ఈ సారి తిరుపతి వెళితే ప్రయత్నించండి..అందరూ మనస్పూర్తిగా స్వామి వారి అనుగ్రహం కొరకు భక్తితో మరొక్క సారి స్మరించండి 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha