Online Puja Services

భర్త చనిపోయిన స్త్రీని

18.119.125.7

భర్త చనిపోయిన స్త్రీని పుట్టింటివారు లేదా బంధువులు వారి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో పాటించవలసిన నియమాలు ఏమిటి ?
- లక్ష్మీరమణ 

విధి వశాన భర్త చనిపోయిన ఇల్లాలిని చక్కగా ఆదరిందండి . ఆమెకి మేమున్నామన్న ధైర్యాన్నివ్వండి . స్వాంతన  చేకూర్చండి . అంతే కానీ అనవసరమైన నమ్మకాలకీ  , మూఢత్వానికీ  ఈ విషయంలో తావు లేదని గ్రహించండి .  మానవత్వమే దైవత్వం. ఆ దైవానికి ఇష్టమైన కార్యం . ఈ సమయంలో మీరు చూపించే ఓర్పు , ప్రేమ, ఆర్ద్రత ఆమె మానశికంగా కోలుకోవడానికి సాయపడుతుంది .  ఇది పురాణ ప్రమాణంతో చెబుతున్న మాట ! 

భర్త చనిపోయిన తొలి నెల రోజుల్లో ఆ స్త్రీని పుట్టింటి వారు. లేదా బంధువులు  తీసుకువెళ్లి బట్టలు పెడతారు .  దీన్నే కొన్ని ప్రాంతాల్లో గడపతొక్కించడం అని కూడా అంటారు . ఈ కార్యక్రమాన్ని ఎవరి సంప్రదాయానుసారం వారు నిర్వహిస్తూంటారు . లోకంలో కొన్ని విపరీత పోకడలు, అనవసర భయాలు ఈ విషయంలో ఉన్నాయని చెప్పుకోక తప్పదు . ఈ సందర్భంలో మనం అనుసరించాల్సిన కర్తవ్యమ్ ఏమిటనేది స్కాందపురాణం చెబుతోంది . 

స్కాందపురాణంలో అగస్త్య మహర్షి, లోపాముద్రాదేవి సంవాదంలో మహర్షి ఇలా చెప్తారు .  “ఉమా శివ సమస్సాక్షాత్ పూజ్యతే సర్వలోకిణాం” అంటే భర్త మరణించిన స్త్రీ - శివుడు,ఉమాదేవిలతో సమానం. ఆమె అంతటి  పూజనీయురాలు అని అర్థం .  లోకమంతా పూజించే అగస్త్య మహర్షి కన్నా పరమ ప్రామాణిక పురుషుడెవరు ? ఆయన  మాటకంటె పరమ ప్రామాణికము లేదు కదా ! 

కాబట్టి, వయసులో ఆవిడ చిన్నవారైతే  చక్కగా చదివించండి. ఆర్థిక స్వతంత్రత ఇవ్వండి. ఆమె కాళ్ళ మీద ఆమెను నిలబడనివ్వండి. పెద్దవారైతే, ఆమెని ఉమాసమానురాలిగా గౌరవించండి . భర్త ఉండగా ఆమెకి, ఆమె భర్తకి కుటుంబంలో చూపించిన గౌరవాన్ని, మర్యాదనూ, స్థానాన్ని ఇప్పుడు కూడా ఆమెకి ఇవ్వండి .  ఆమె ఈ కుటుంబానికి ఎంతో అవసరమని, మీ రందరూ తనని ఎంతో గౌరవిస్తున్నారన్న భావనని తనకి కలగనియ్యండి. చక్కగా ఆదరణ బట్టలు పెట్టి ఆదరించండి . 

శుభం 

#dharmasandehalu

Tags: dharma sandehalu,

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi