Online Puja Services

జపం చేసే మాలని ధరించవచ్చా ?

18.221.245.196

జపం చేసే మాలని ధరించవచ్చా ?
- లక్ష్మి రమణ 

భగవంతునికి చేరువచేసేది జపం . శక్తి మంత్రానికి ఉండవచ్చు. కానీ ఆ శక్తి ని జాగృతి చేసేది జపం . కాబట్టి జపం చేసేప్పుడు లక్ష్యం మీద మనసు కేంద్రీకృతం కావడం అవసరం . అలా కాకుండా  సంఖ్య మీద మాత్రమే మనసు కేంద్రీకృతం అయ్యిందంటే, అక్కడ మన లక్ష్య సిద్ధి లోపించినట్టే . జపం చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పండితులు . 

జపం చేసే మాలలో 108 పూసలు ఉండేలా చూసుకోవాలి. లేదా  54 పూసలు ఉన్న మాలని వినియోగించవచ్చు. ఇంకా తక్కువ పూసలున్న మాలతో చేసుకోవాలనుకునేవారు  27 లేదా 9 పూసలున్న జపమాలని వినియోగించవచ్చు.  అయితే ఈ మాలల్లో పూసలకి వినియోగించిన పదార్ధం అంటే అది రుద్రాక్ష , స్పటికం , తులసి పూస ఈ విధంగా దేనితో ఆ పూసతయారు చేయబడింది అనేదానిమీద కూడా సిద్ధి ఆధారపడివుంటుంది . అదెలాగంటే, మనం జపం చేసేటప్పుడు ఆ మంత్రం యొక్క జాగరణ జరిగి  ఆశక్తి అనేది మన శరీరంలోకి ప్రవహిస్తుంది . దానిని మనకి అందించే జపమాలలోని పదార్ధం అందుకు వాహకంగా ఉండి ఉండవచ్చు. 

జపం చేసేటప్పుడు మాల బయటికి ఉండకూడదు .  స్వయంగా జపంచేసేవారి కంటికిగానీ, చూసేవారి కంటికిగానీ కనిపించేవిధంగా జపమాలని పట్టుకొని జపం చేయకూడదు . దానివల్ల లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది . అందువల్ల అలా చేయకూడదని మన  పెద్దలు నిబంధన పెట్టారు. అందువల్ల గోముఖం సంచీలో జపమాలని ఉంచి జపం చేయవచ్చు . జపం చేసేప్పుడు ఖచ్చితంగా ఉత్తరీయాన్ని ధరించి ఉండాలన్న నియమం ఉందికాబట్టి , ఉత్తరీయం లేదా మనం పైమీద ధరించిన వస్త్రం చాటున జపమాలని ఉంచి జపం చేయాలి . నవగ్రహ శాంతి జపాలు చేసేప్పుడు కూడా ఈ విధానాన్ని ఆచరించాలి .  

ఇక మనం జపం చేసేటటువంటి మాలని ధరించకూడదు .  ఖచ్చితంగా ఆ మాల విడిగానే ఉండి తీరాలి . మనం అలంకారం కోసం , శరీర రక్షణ కోసం లేదా ఆరోగ్యం కోసం ధరించేటటువంటి  మాలతో జపం చేయకూడదు అని పండితులు సూచిస్తున్నారు. 

#japamala #japam #pooja

Tags: japamala, japam, puja, pooja

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha