Online Puja Services

స్త్రీలు వేదమంత్రాలతో కూడిన దైవిక కర్మలకి అర్హులు కాదా?

18.217.144.32

స్త్రీలు వేదమంత్రాలతో కూడిన దైవిక కర్మలకి అర్హులు కాదని  మన పూర్వులు ఎందుకంత గట్టిగా చెప్పారు ?
లక్ష్మీ రమణ   

ప్రకృతి మాతృ స్వరూపమని , ఆ అమ్మా నుండీ ఈ సృష్టి పుట్టిందని మన ధర్మం చెబుతుంది . స్త్రీకి సర్వశక్తి స్వరూపిణి అనే స్థానాన్ని ఇచ్చి గొప్ప వేదిక మీద కూర్చోబెడుతుంది . ఆమె లేకపోతే, త్రిమూర్తులైనా శక్తి విహీనులే అంటుంది . మరి పరమాత్మ యొక్క తత్వాన్ని వివరిస్తూ సాగే మంత్రానుష్టానానికి ఎందుకు వారిని దూరం పెట్టాల్సి వచ్చింది ? ఏ సంప్రదాయమైనా సరైన కారణంలేకుండా అనువర్తింపజేయడం మన పూర్వీకులకు అలవాటు లేదు . మరి ఇందులో దాగిన ధర్మ సూక్ష్మం ఏమిటి ?

అమ్మని లలిత అంటాము. ఆమె లలితమైన శరీరాన్ని కలిగినది . స్త్రీలందరూ కూడా ఆ లాలిత్యాన్ని వారిలో నింపుకున్నవారే ! ఒక విత్తనం నాటాకా మనం ఆ విత్తనానికి నీరు పోస్తేనే అందులోనుండి మొక్క ఉద్భవిస్తుంది . అలా తండ్రి నాటిన బీజానికి , నీరు పోసి  ప్రాణాన్ని ఇవ్వగలిగిన శక్తి స్త్రీలకి మాత్రమే స్వంతం . అందువల్ల వారు జల తత్త్వం కలిగినవారు . ఈ సృష్టిని ఆ విధంగా కొనసాగించే వరం  కోసం వారు నెలనెలా మూడురోజులపాటు గొప్ప అసౌచాన్ని భరిస్తారు . ప్రకృతిని తమలో నింపుకొని ప్రకృతి సిద్ధంగా వచ్చే ఆ అసౌకర్యాన్ని సహిస్తారు . ఓర్పుగా తట్టుకుంటారు . వారీ స్థితిని ప్రతినెలా ఏ రోజుల్లో కహచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందో కూడా చాలా మందికి తెలియని స్థితిలోనే ఉండడం కూడా ఇందుకు ఒక కారణం కావొచ్చు . ఆరోజుల్లో భగవంతుని ఆరాధన, సరైనది కాదు . 

పెట్రోల్ ని మండించినపుడు శక్తి ఏవిధంగా విడుదల అవుతుందో , అదే విధంగా ఒక మంత్రాన్ని ఉచ్చరించినపుడు కూడా శక్తి అనేది పుడుతుంది . అంటే అగ్ని కదా ! అలా  పురుషులు అగ్నితత్త్వ శరీరాలు కలిగినవారు.  మంత్రాలు కూడా అగ్నితత్త్వం కలిగినవి. అందుచేత ఏ తత్త్వం గలవారు ఆ తత్త్వానికి సంబంధించిన అనుష్ఠానమే చెయ్యాలి. అందుకే మరింత సులువుగా అర్థమయ్యేందుకు స్త్రీపురుషుల తత్వాన్ని వివరిస్తూ , పురుషులు సూర్యుని నుండీ జన్మించిన అగ్ని తత్వాలనీ, స్త్రీలు చంద్రునినుండీ జన్మించిన ప్రశాంత చిత్తులని అంటుంది పాస్చాత్య తత్వశాస్త్రం . 

స్త్రీలు జపించిన (వేద) మంత్రాలు నిర్వీర్యమవుతాయని శ్రీ గురుచరిత్రలో దత్తాత్రేయస్వాములవారు స్వయంగా సెలవిచ్చారు. అందుక్కారణం - వారి భౌతిక ఉపాధి (శరీరం) జలతత్త్వం గలది కావడమూ, అందులో అగ్నితత్త్వం గల (వేద) మంత్రాలు ఇమడకపోవడమూ. అదీ గాక చాలామంది స్త్రీల ఆరోగ్యం బహు సున్నితమైనదిగా ఉంటుంది .  పైగా  తమకు తరువాతి మాసధర్మం ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా చెప్పలేనివారి సంఖ్య చాలా ఎక్కువ. అందుచేత వారికి ఈ మంత్రయుక్తమైన కార్యకలాపాల నుండీ మినహాయింపుని ఇచ్చి ఉండవచ్చు . 
 
అందుకని వారికోసం కావ్యసంస్కృత భాషలో వివిధ స్తోత్రాల్ని, వ్రతాల్ని నిర్దేశించారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విశేషం కూడా ఉంది . పురుషులు భార్య లేకుండా హిందూధార్మిక విధుల్ని నిర్వర్తించరాదనడాని క్కూడా వారి అగ్నితత్త్వ శరీరాలే కారణం. పురుషుడు అగ్ని. మంత్రం అగ్ని. హోమం అగ్ని. అనుష్ఠానం ద్వారా ఇన్ని అగ్నులు ఒకేసారి ప్రజ్వరిల్లితే అది ఇతరులకు ఉపద్రవంగా మారుతుంది. కనుక ఆ అగ్నుల్ని సమతూకం (balance) చెయ్యడం కోసం భార్య ఉండాలన్నారు. అదన్నమాట సంగతి !

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore