Online Puja Services

మంగళసూత్రాలమీద లక్ష్మీదేవి రూపు వేయించుకోవచ్చా ?

18.191.5.239

మంగళసూత్రాలమీద లక్ష్మీదేవి రూపు వేయించుకోవచ్చా ?
-లక్ష్మీ రమణ 

మంగళసూత్రాలమీద లక్ష్మీదేవి రూపు వేయించుకోవచ్చా ?మంగళ సూత్రాలు చేయించుకునేప్పుడు ఆ సూత్రాలమీద రకరకాల దేవీదేవతలు బొమ్మలని వేయించుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్గా మారిపోయింది . కొంతమంది ప్రత్యేకించి, లక్ష్మీ రూపుని వేసి నల్లపూసలు కూడా చేయించుకుంటారు. ఇలా చేయించుకోవడం పైన పండితులు యేమని చెబుతున్నారో తెసుసుకుందామా ?

మంగళసూత్రం అంటే, పవిత్రమైన బంధనం అని అర్థం. ఇందులో గుచ్చే రెండు సూత్రాలూ పుట్టింటివారొకటి, మెట్టినింటివారొకటి తీసుకొస్తారు. ఈ రెండూ కూడా పరమేశ్వరి, పరమేశ్వరులకు ప్రతీకలు. అందువల్ల వీటిమీద ఎటువంటి దేవతా మూర్తుల ప్రతిరూపాలూ వుండకపోవడమే మంచిది . ఆది దంపతులు ఆ జంట అన్యోన్యతనీ, సర్వమంగళాదేవి ఇల్లాలి సౌభాగ్యాన్ని , పసుపు , కుంకుమలనూ రక్షిస్తూ ఉంటారు. అందువలనే , ఇది పరమపవిత్రమైనది అని చెబుతారు పెద్దలు . 

ఇక కొంతమంది, కేవలం నల్లపూసలు మాత్రమే ధరించి,ఉంటారు . ఆ నల్లపూసలకి గౌరీపూజ సమయంలో నవవధువు చేత, పూజలు చేయిస్తారు. అప్పుడు ఆ గౌరీ నల్లపూసల్లో నిలిచి, నీలలోహిత గౌరిగా మారి, ఆ వధువుకి, నూతనమైన వారి దాంపత్యబంధానికి రక్షణగా నిలుస్తుంది . అది నల్లపూసల్లో ఉన్న విశిష్ఠత . 

అయితే, దీంట్లో గుచ్చుకోకుండా సూత్రాలని బంగారం తాడుకి పసుపు సూత్రంతో కట్టి వేసుకోవడమే సరైనదని పండితులు చెబుతున్నారు . ఇక ఇలా వేసుకున్న సూత్రాన్ని మెడలో నుండీ తీసి పక్కపెట్టడం, దిండుకింద, పక్కబట్టలకింద  పడెయ్యడం సరైన విధానం కాదని సూచిస్తున్నారు . ఇంకా దీనికి వేరే ఏవిధమైన దేవీదేవతల బొమ్మలనీ తగిలించుకోకూడదని అంటున్నారు. ప్రత్యేకించి లక్ష్మీ దేవి ప్రతిమని అస్సలు వేయించుకోవద్దని, అలా చేస్తే , అరిష్టమని చెబుతున్నారు . 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba