Online Puja Services

హోమాలు చేయడం వలన కోరికలు తీరతాయా ?

18.118.137.243

హోమాలు చేయడం వలన కోరికలు తీరతాయా ?
- లక్ష్మి రమణ 

పూర్వకాలం నుండీ ప్రజా సంక్షేమం కోసం , వివిధమైన కామ్యములు నెరవేర్చడం కోసం మహర్షులు హోమాలు , యజ్ఞాలు , యాగాలూ చేశారని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అగ్ని కార్యం చేయడం వల్ల భగవంతుడు ప్రీతి చెందుతాడని వేదం చెబుతోంది. అయితే, జ్యోతిష్యులు ఫలానా హోమం చేసుకుంటే, మీకు గ్రహశాంతి కలుగుతుంది. వ్యాధులు తగ్గిపోతాయి ,  సంపద,ఉద్యోగంలో స్థిరత్వం , గృహలాభం , వాహన లాభం వంటివి చేకూరుతాయి అని చెబుతూ ఉంటారు . ఇలా హోమాలు చేయడం వలన అటువంటి ఫలితాలు సిద్ధిస్తాయా ? అని చాలామందికి అనుమానం . దానికి పండితులు ఇలా చెబుతున్నారు . 

పూర్వం జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన నాగజాతి మీద పగబట్టాడు. సర్పయాగం చేశాడు .  సర్పాలన్నీ ఆ యాగాగ్నిలో కాలిపోయాయి.  దశరథుడు పుత్రసంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. శ్రీరామ , లక్ష్మణ , భరత, శత్రుఘ్నులని పుత్రులుగా పొందాడు.  ఇలా యాగాలు , యజ్ఞాలు, హోమాలు అనేవి మన ఇతిహాసాలలో , పురాణాలలో ఇష్టసిద్ధిని అనుగ్రహించేవిగా కనిపిస్తాయి. 

మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు.  తమ ఆశయాలను నెరవేర్చుకునేవారు కూడా ! ఇక్కడ గమనించాల్సింది ఏటంటే, మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల సంక్షేమానికి , లోక శ్రేయస్సుకి  ఉద్దేశించి ఉండేవి. ఇవి నిజంగానే ఫలిస్తాయా ? మనకో సందేహం ఖచ్చితంగా వస్తుంది . అది అనుభవంలో తెలుసుకోవడమే ఉత్తమం . 

 జ్యోతిష్య శాస్త్రం నక్షత్రాలు , గ్రహాల గమనాన్ని ఆధారంగా చేసుకొని కాల ప్రభావాన్ని ఒక్కో జాతకునికి తెలియజేయగలిగిన విశిష్టత కలిగినది . సృష్టి గమనం గ్రహాలు సమతుల్య స్థితిలో ఉంటేనే సక్రమంగా సాగుతుంది. కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం వర్షాలు సక్రమంగా పడకపోవడం లాంటివి జరుగుతాయి ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి లేదా ఎనర్జీ భూమిమీద తక్కువగా ఉన్న లేదా ఎక్కువగా ఉన్నా అసమతుల్యతలు ఏర్పడతాయి.  అందుకే ఆ గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో ఇతర వస్తువులతో హోమం చేస్తారు జ్యోతిష్యవేత్తలు. దానివల్ల ఆ అసమతుల్యత సమసిపోతుందని విశ్వాసం . ఇది సృష్టికి , సృష్టిలోని ఒక్కో జాతకునికి కూడా వర్తిస్తుంది. స్థూలంగా ఇది హోమం చేయడంలోనే ఉద్దేశమని పండితులు తెలియజేస్తున్నారు . 

 అన్ని హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేస్తున్నారు.  ఒక వ్యక్తి జాతకంలో నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా ఉంటే, దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాంటి సమయంలో  ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమాన్ని చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. 

హోమాల్లో ఎన్నో రకాల సమిధలని వాడవలసి ఉంటుంది . వీటిల్లో ఒక్కో సమిధా ఒక్కో గ్రహానికి సంబంధించినదై ఉంటుంది.  ఉదాహరణకి సూర్యగ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా మారితే ఆ వ్యక్తి అకాల మృత్యువాత పడొచ్చు లేదా ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం సంభవించవచ్చు.  దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయించమని జ్యోతిష్యులు సూచిస్తూ ఉంటారు.  అలా నవగ్రహాలలో ఏ గ్రహానికి అవసరమో ఆ గ్రహానికి అవసరమైన శాంతి హోమాన్ని వారు సూచిస్తూ ఉంటారు .  ఇలా  శని గ్రహ అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహు కోసం గరికను ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం ఆర్క సమిధను ఉపయోగిస్తారు.  కేతు గ్రహ ఉపశాంతి కోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి ఉంది. శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు ఉంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడుతారు.  అటువైద్యపరంగా చూస్తే జీర్ణవ్యవస్థను అద్భుతంగా పునర్జీవింప చేసే శక్తి మోదుగకు ఉంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహ శాంతి కోసం ఉపయోగిస్తారు. ఇది వివిధ కఫదోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో ఉంది. 

హోమం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరి .  ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి పరోక్షంగా నవగ్రహాల పైన ప్రభావాన్ని చూపిస్తుందని అర్థమవుతోంది. మరో ముఖ్య సంగతి ఏమంటే హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమఫలం అందుతుంది. విదేశాలలో నివసించే తెలుగువారి కోసం ఇటువంటి సేవలని మీ వర్చువల్ పూజారిగా హితోక్తి అందుబాటులోకి తెచ్చింది .  కావాలనుకునేవారు మా హితోక్తి వెబ్సైట్ ని సందర్శించి అవసరమైన జ్యోతిష్య వివరణని , హోమాలు చేయించుకోవడానికి / చేసుకోవడానికి పౌరోహిత సేవని పొందవచ్చు .  మరింకెందుకాలశ్యం , శుభశ్య శీఘ్రం !

#homam

Tags: homam, yagam, yajnam, 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha