Online Puja Services

స్త్రీలు తలనీలాలు మొక్కుగా చెల్లించవచ్చా ?

18.227.190.93

స్త్రీలు తలనీలాలు మొక్కుగా చెల్లించవచ్చా ? 
- లక్ష్మి రమణ 

తలనీలాలు మొక్కుగా సమర్పించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం . మిగిలిన క్షేత్రాలకన్నా తిరుమల వెంకన్న ఆలయంలో ఈ మొక్కుని చెల్లించుకొనే భక్తులు చాలా ఎక్కువగా ఉంటారు. ఆడవారు కూడా తలనీలాలు స్వామివారికి సమర్పిస్తూంటారు . కానీ ఆడవారు ఇలా తలనీలాలు సమర్పించవచ్చా ? ఎప్పుడు సమర్పించాలి అనే విషయాన్ని పండితులు ఇలా వివరిస్తున్నారు . 

సాధారణంగా పిల్లలకి పాపకి , బాబుకి కూడా తొమ్మిదవనెలలో తలనీలాలు తీయిస్తారు.  ఇక్కడ ఈ మధ్య తెలియక కొంతమంది ఎదవా నెలలోనే పిల్లలకి తలనీలాలు తీయించడం అనేది చేస్తున్నారు . ఆవిధంగా చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది . ఒకవేళ తొమ్మిదోనెలలో కుదరకపోతే, పదకొండవ నెల ఆపైన మూడవ ఏడాది లేకపోతె, ఐదవ ఏడాది తీయించవచ్చు . అంతేకానీ తొమ్మిది నెలలు నిండకుండా మాత్రం తలనీలాలు తీయించ కూడదు.  

దీనితర్వాత, అంటే, తొలిసారి తలనీలాలు తీయించిన తర్వాత , ఆడపిల్లలకి శిరోముండనం చేయించకూడదు . మొక్కును కూడా మూడు కత్తెరలు మాత్రమే అని మొక్కుకోవాలి . తిరుపతి వెంకన్న దగ్గరైనా సరే , మూడు కత్తెరలే ఇవ్వాలి. అంతే కానీ పూర్తిగా కళ్యాణం చేయించుకోకూడదు. ఇది మన సంప్రదాయం. స్త్రీలు కేవలం భర్త కైవల్యాన్ని  పొందిన సందర్భంలో తప్ప , అన్యథా శిరోముండనం చేయించుకోకూడదని శాస్త్రం. 

కాబట్టి, వీలైనంతవరకూ ఆ స్వామికి తలనీలాలు పురుషులైతే, సంపూర్ణంగా సమర్పించండి. స్త్రీలైతే, మొక్కుకునేప్పుడు కూడా అయ్యా నీకు మూడు కత్తెరలు సమర్పిస్తాను . అని మొక్కుకొండి.  అప్పుడు ఈ ధర్మసందేహానికే తావుండదు. ధర్మము కూడా చక్కగా ఆచరించబడుతుంది .  

సర్వేజనా సుఖినోభవంతు !! శుభం . 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya