క్షవరం (కటింగ్ ) ఎప్పుడు చేయించుకోవచ్చు?

3.230.142.168

క్షవరం (కటింగ్ ) ఎప్పుడు చేయించుకోవచ్చు . శుక్రవారం కూడా చేయించుకోవచ్చా ?
లక్ష్మీ రమణ 

ప్రెంచ్ వారు , డచ్చి వారూ వచ్చి మనకి చాలా గొప్ప అలవాట్లని ఇచ్చిపోయారు కదా ! అలా మనకి ఒకవారం అంటూ ఏమీ లేకుండానే చక్కగా క్షవరం (కటింగ్ ) చేయించుకునే అలవాటు అయ్యింది. కానీ దీనికే ఒక లెక్కుంది అంటుంది సనాతన ధర్మం . అలా నడుచుకుంటే, మంచిదని చెబుతూనే , ఎందుకు అలా నడుచుకోవాలో చెప్పడం మన ధర్మం  గొప్పదనము కూడా ! 

ఈ రోజుల్లో మగపిల్లలు చక్కగా జుట్టు పెంచేసుకొని , దానికొక రబ్బరుబ్యాండ్ వేసుకొని ఫ్యాషన్ గా ఉండడం చూస్తున్నాం. ఇది వెనుకటి సంస్కృతీ అని కూడా చెప్పుకోవడం వినిపిస్తుంది. కానీ, తల తరగడం తల గొరగడం ఒకటేనని వెనకటి వారు అంటుండేవారు . రుక్మిణీ కళ్యాణం సమయంలో , శ్రీకృష్ణుడు రుక్మిణీ మాతని తరలించుకుని వెళ్లే సందర్భంలో - ఆమె అన్నయ్య రుక్మికి తలతరగకుండా , రెండవపని చేసి వదిలారు భగవానుడు .  

కథలు బాగా చెప్పారుగానీ, తల పెరిగిపోకుండా, గడ్డం మాసిపోకుండా టిప్ టాప్ గా ఉంటేనే, ఇవాళ మా ముఖం ఎవరైనా చూసేది . అని మీరనొచ్చు . ఈ విషయం చెప్పినందుకు లోకంలోని భార్యలందరూ తిట్టుకోవచ్చు . మా బాస్ నీట్ గా లేకపోతె ఒప్పకోరని కూడా చెప్పొచ్చు. ఇది ఇవాళ మనకి తప్పదు. కానీ, అసలు సంప్రదాయం ఏం  తెలుసుకోవడం, వీలైనప్పుడు ఆచరించగలగడం ఒక్కటే మనం ప్రస్తుతకాలంలో చేయదగిన పని. ఈ వివరాలు మనకి  వారాహీ సంహితలో లభ్యం అవుతున్నాయి.  ఈ గ్రంధంలో గర్గాది మహర్షులు మనకీ విషయాలని విశదీకరించి ఎప్పుడు క్షవరం చేసుకుంటే, మంచిది అని తెలియజేశారు . 

వారము - క్షౌరకర్మ ఫలితాలు 

ఆదివారము - ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది. 
సోమవారముము - ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు సోమవారంనాడు క్షారము చేయించుకోనగూడదు.
మంగళవారముము - ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది. 
బుధవారముము - ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును. 
గురువారముము -పది మాసములు ఆయువు వృద్ధి చెందును. కానీ సంపదను, లక్ష్మి దేవి అనుగ్రహాన్ని  కోరుకునేవారు గురువారమునాడు క్షారము చేయించుకోనగూడదు. 
శుక్రవారముము -పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును. 
శనివారముము - ఏడు మాసములు ఆయువు తగ్గిపోతుంది. 

అదీ సంగతి.  అందువలన బుధవారం , శుక్రవారం క్షవరం చేయించుకోవచ్చు, ఎటువంటి ఆంక్షలూ లేకుండా! ఈ ఆదివారాలు సెలవు బ్రిటీషువారి పధ్ధతి . దీనినుండి విముక్తిని ప్రసాదించి, ఈ రెండువారాలలో ఒకరోజు మనకి సెలవు ప్రకటిస్తే, ఎంచక్కా అందుకు వీలుగా ఉంటుందని, అలా జరగాలని కోరుకుంటూ శలవు .  

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda