పట్టుబట్టలే కట్టుకోవాలి అనడంలో ఆంతర్యం ఏమిటి

44.192.25.113

పట్టుబట్టలే కట్టుకోవాలి అనడంలో ఆంతర్యం ఏమిటి ?
 లక్ష్మీరమణ 

పూజలు, వ్రతాలు, నోములు, వివాహాది శుభకార్యాలకు పట్టుచీరలు కొనిపించుకోని ఆడవాళ్ళుంటారా ? ఆడవారికీ , అందమైన పట్టుబట్టలకీ అవినాభావ సంబంధం ఉంది మరి . అసలు ఈ రకమైన శుభకార్యాలలో పట్టుబట్టలే కట్టుకోవాలని ఎందుకంటారు ? 

పూర్వము మన దేశంలో బంగారం, వెండి రాగితీగలతో పట్టుబట్టలని నేసేవారు . అద్భుతమైన శిల్పకళా చాతుర్యమున్న హైందవ కళాకారులున్న ఈ దేశంలో అద్భుతమైన చేనేతకళాకారులూ ఉండడంలో విశేషంఏమీ లేకపోవచ్చు .  అయితే ఈ పట్టు బట్టలని ధరించడంలో మాత్రం గొప్ప విశేషమే ఉంది. అందుకే పెద్దలు శుభసమయాల్లో పట్టుబట్టలే కట్టాలని చెబుతుంటారు . 

పట్టు బట్టలు ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీని ఆకర్షించే నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శరీరం మరియు పట్టు బట్టల మధ్య ఘర్షణతో, విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది ఎలక్ట్రో స్టాటిక్ ఆకర్షణకు దారితీస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ విడుదలవుతుందన్నమాట . అలాగే పాజిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది కూడా ! 

 శక్తి, శాస్త్రాల ప్రకారం, భక్తుడి మనస్సుపై పనిచేస్తుంది. పూజించేటప్పుడు ఉత్పన్నమయ్యే పాజిటివ్  వైబ్రేషన్స్ కూడా పట్టు దుస్తులను ధరించడం ద్వారా  గ్రహించడానికి చక్కని అవకాశం ఉంటుంది .  దీన్నే మరో అర్థంలో చెప్పుకుంటే, పూజ అంటే, పరమాత్మ అయిన ఆ పరమపవిత్ర స్వామిని ఆహ్వానించడం . (పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడం ) . ఆ పరమాత్మ ఇచ్చే ఆశీర్వాదం / శక్తి కూడా పాజిటివ్ ఎనర్జీనే కదా ! దాన్ని అందుకోవడం ఈ రెండూ కూడా పట్టుబట్టలు కట్టుకోవడం ద్వారా మరింత సులభంగా లభిస్తాయన్నమాట . అంటే, భగవంతునికి భక్తునికీ అనుసంధానం చేస్తాయన్నమాట . అదీ సంగతి . !!
 

 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna