ఐశ్వర్యము అంటే...

100.24.115.215

ఐశ్వర్యము అంటే... 


  ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా?

      లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!.

    ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,లోకెర్స్ లోని తులాల బంగారాలు కాదు...!

  ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"
   
 ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"

  ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"

  అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"

పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"

  పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"

  మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం

పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"

  ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"

  అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు  "ఐశ్వర్యం

 బుద్ధికలిగిన బిడ్డలు  "ఐశ్వర్యం

   బిడ్డలకొచ్చే చదువు  "ఐశ్వర్యం"

భగవంతుడిచ్చిన ఆరోగ్యం  "ఐశ్వర్యం

    చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి  "ఐశ్వర్యం

పరులకు సాయంచేసే మనసు మన  "ఐశ్వర్యం

    ఐశ్వర్యం అంటే చేతులు
 లేక్కేట్టే కాసులు కాదు

 కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం
 మనసు పొందే సంతోషం ఐశ్వర్యం

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna