Online Puja Services

తృటి అంటే ఏమిటి?

18.224.38.3

మనం అప్పుడప్పుడు వింటుంటాం.. పత్రికలలో చదువుతుంటాం.. 
" తృటి లో తప్పిన ప్రమాదం "  అని.. అసలీ తృటి అంటే ఏమిటి? 
మన పూర్వీకులు మన కాలాన్ని ఎన్ని భాగాలు గా విడదీసారొ,వాటి పేర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేశం అంటే రెప్ప పాటుకాలం నిముషం కాదు.. 
3 నిమేశాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్ట
12 కష్టాలు = ఒక నిముషం 
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

అదన్నమాట సంగతి.. 
మనము మన విజ్ఞానాన్ని తెలుసుకుందాం.. భావి తరాలకు తెలుపుదాం.. 

సర్వేజనా సుఖినోభవంతు!

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha