గుత్తొంకాయ కూర ఎలా చేయాలి? (సరదాగా)

44.192.25.113

🍆గుత్తొంకాయ కూర  ఎలా చేయాలో, ఎంత సరదాగ చెప్పారో చూడండి🍆

😆😄

🍆 గుత్తొంకాయ కూర చేసే విధానం 🍆

♦️ముందుగా గుత్తొంకాయల్ని ఉప్పు నీటిలో ఒక పది నిముషాల పాటు ఉంచి ఆ తరువాత వా టిని శుభ్రంగా పిల్లాడి స్నానం అయ్యాక పొడి గుడ్డతో తుడిచినట్లు తుడవాలి.

♦️తరువాత వాటిని చక్కగా నాలుగు భాగాలుగా కోసి అందులో కూర పొడి స్కూలుకెళ్ళే పిల్లాడి నోట్లో పెరుగన్నం కుక్కినట్లు కూరి గిన్నెలో పెట్టుకోవాలి.

♦️వేరు కాపురాలు పెట్టిన తోడి కోడళ్ళు పండక్కి కలిసినట్లుగా వంకాయ మాత్రం ముచ్చిక దగ్గర కలిసే ఉండాలి. ఆస్థులు పంచుకున్న అన్నదమ్ముల్లా విడి పోకూడదన్నమాట.

♦️ఒక బాండ్లీలో చాలినంత నూనె పోసుకోవాలి. వేరు శనగ నూనె అయితే అత్తయ్య ప్రేమ లాగా మంచి రుచిగా ఉంటుంది.

♦️స్టవ్ మీద బాండ్లీ పెట్ఠి స్టవ్వెలిగించాలి. నూనె కాగిన తరువాత స్టవ్వును సిమ్ లో పెట్టి పొడి కూరిన గుత్తొంకాయలను ఒక చేత్తో వియ్యపురాలి మీద వాక్బాణాల్లాగ' ఒకటొకటిగా బాండ్లీలోకి వదలాలి.

♦️అలా వేసిన కాసేపటికి వంకాయలు మాట చెల్లని మాఁవ గారి ముఖంలా ముభావంగా తయారవుతాయ్.

♦️ఈలోగా మరొక చేత్తో పెద్దల్లడు బంతిలో నెయ్యి వడ్డించినట్లు చిప్ప గరిటెలో తిరగమోత సిధ్ధం చేసుకోవాలి. అంటే అది పెద్ద పని కాకపోయినా దాని విలువ దానికుంది మరి.

♦️ఇప్పుడు సిధ్ధమైన తిరగమోతను వంకాయలున్న బాండ్లీలో వేసి ఒక చేత్తో బాండ్లీని పట్కారుతోనో, గుడ్డతోనో పట్టుకుని ఇంకో చేత్తో గరిటె పట్టుకుని అలిగిన ఆడపడుచు ఇంటిల్లి పాదిని ఓ రౌండేసినట్లు కలియ తిప్పాలి.

♦️పొడి చాల్లేదననిపిస్తే మరొక చేత్తో చాలా రోజుల తరువాత పెత్తనం దొరికిన పిన్ని గారిలాగా' కొంత కూర పొడి పైపైన అలా అలా బులబులాగ్గా చల్లాలి.

♦️అలా కలియతిప్పిన తరువాత ఇంకో చేత్తో ఖాళీగా ఉన్న చిన్న కోడలి మీద అత్తగారు ఆర్డరేసినట్లు బాండ్లీ మీద మూత పెట్టాలి. అంటే మూత పెట్టక పోయినా పర్లేదని అర్ధం.

♦️కొంతమంది పచ్చి మిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటారు, కానీ దానివల్ల కొత్తల్లుడు వచ్చాక పాతల్లుడి ప్రాభవం తగ్గినట్లుగా కూర పొడి రుచి కొంచెం తగ్గచ్చు.

♦️ఈ మధ్య పేరంటానికి వచ్చిన ముత్తైదువుల్లాగా కొత్తిమీర కూడా కనపడుతోంది.

♦️కొంత సేపటికి బాండ్లీ మీద మూత తీసి అంతా అయిపోయాక అత్తగారి పెత్తనంలాగా మరొక చేత్తో మరొక సారి కలియపెట్టాలి.

♦️ఆ తరువాత బాండ్లీలోని గుత్తొంకాయలను తోడి కోడలింటికి వచ్చి కొత్తగా ఏఁవేఁవి సామాన్లు కొన్నారో చూసినట్లుగా ఒక్కొక్కటి ప్లేటులో పెట్టుకోవాలి, నాణ్యత ఎలా ఉందో చూస్తూ.

○●○●○●○●○ కూర రెడీ ○●○●○●○●○

♦️పెళ్ళి కొడుకు బాబాయికి పని తక్కువ, హడావిడి ఎక్కువ అన్నట్లు ఈ మాత్రం కూరకు ఇంత రైటప్పా? అని మీరనుకుంటే అందులో ఎంత మాత్రం తప్పు లేదు ....🎠

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna