Online Puja Services

ఒక్క మహాలయశ్రాద్ధ కర్మయినా చేసి తీరాలి

3.147.103.202

ఒక్క మహాలయశ్రాద్ధ కర్మయినా  చేసి తీరాలి  - విధానం ఏమిటి ?

భాద్రపద బహుళ పాడ్యమి మంగళవారం నుంచి (21-09-21 నుండి 6-10-21)పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా ఈజన్మలో ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి.

ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం‌లోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు.

వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి:

మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది.

భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం, వారి సంతానానికి తప్పని సరి విధి.

శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు.

నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథిగా భావించబడినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, స్వయంపాకం దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి.

శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుంది :

శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది… కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.

ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు:

పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది.
ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది.
తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు.
చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు.
పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.
షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.
సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి.
నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది.
దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది.
ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి..వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది.
ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.
త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.
చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.
అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి.

 
ఒక్క మహాలయమైన చేసి తీరాలి: 

ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు లేదా స్వయంపాకం సామాగ్రి దానం చేయవచ్చు.
అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి బాధపడితే ఆ కారే కన్నీరు వారికి అక్షయమై ఆకలి తీర్చగలదు, శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.


"పితృ తర్పణము" -ఇంట్లో చేసుకొనే విధానం : 

కావలసిన వస్తువులు:

పంచ పాత్ర, ఉద్ధరిణి,జలము, 50గ్రా.ల నల్ల నువ్వులు(తిలలు), ధర్భలు, చనిపోయిన వారి లిస్టు,గోత్రాలు...!

నియమాలు : 

ఇంటి లోపల "తిల తర్పణము" నిషిద్ధము....!! మీ ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని, వరండాలో కానీ, తులసి కోట దగ్గరగానీ, నది తీరము వద్ద కానీ లేదా ఏదైనా క్షేత్రంలో కానీ దక్షిణ దిక్కును చూస్తూ కూర్చోని మాత్రమే తర్పణము ఆచరించాలి...!

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు.సజీవులు గా ఉన్న వారిని వదలి, మరణించిన మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12గం.లు...! 

తర్పణము వదలునపుడు ప్రాచీనావీతిగా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి (పితృ తీర్థంలో) నీరు, తిలలు కలిపి వదలాలి.

విధి :
ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః |ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీ కేశాయ నమః | ఓం పద్మ నాభయ నమః| ఓం దామోదరాయ నమః |
ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః| ఓం అనిరుద్దాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమ|| ఓం అధొక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః| ఓం జనార్దనాయనమః | 
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | 
ఓం శ్రీ కృష్ణాయ నమః ||

పవిత్రం దృత్వా || ( దర్భ పవిత్రమును ఉంగరం వేలుకు ధరించాలి)

౹౹ఓం పవిత్రవంతః పరివాజమాసతే పితైషాం ప్రత్నోఅభిరక్షతివ్రతం౹౹ 

౹౹మహస్సముద్రం వరుణ స్తిరోదధే ధీరా ఇచ్చే కుర్చరుణే ష్వారభం౹౹ పవిత్రపాణి: ప్రాచీనావీతి। దక్షిణాభిముఖ:
అని చెప్పి ప్రాణాయామం చేయాలి.

పునరాచమ్య || ( మరల ఆచమనము చేయాలి )

భూతోచ్చాటన :

 ఉత్తిష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భారకాః | యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే | | | అని చెప్పి నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి ,
(సాధారణ తర్పణాలకు నీరు,ప్రత్యేక తర్పణాలకు
తిలలు వాసన చూడాలి)

ప్రాణా యామము :(ముక్కు. బొటనవేలు,చిటికెన వేలుతొ పట్టుకొని)

 ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః ఓం మహః ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యం | ఓం
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్పు వస్సు
వరోమ్ || 
( అని మనసులో జపిస్తూ ప్రాణా యామము చేయాలి )

సంకల్పం : సంకల్పం మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారతాయి. కనుక సంకల్పాన్ని ముందుగా చూసుకొని అందులోని విశేషాలని సేకరించుకోగలరని మనవి .

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య - శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , 
శ్రీ గోవింద గోవింద గోవింద | 
శ్రీ మహా విష్ణొరాజయా ! ప్రవర్తమానస్య | అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే! స్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే | కలియుగే|
ప్రధమ పాదే! జంబూ ద్వీపే, భరత వర్షే | భరత ఖండే! మేరోదక్షిణ దిగ్బాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే ,కృిష్ణా కావేర్యోర్మద్యదేశే|
 సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన - వ్యావహారిక
చాంద్రమానేన -. శ్రీ .........  నామ సంవత్సరే
దక్షిణాయనే.,వర్షఋతౌ, భాద్రపద మాసే కృష్ణపక్షే
......తిదౌ........వాసరే.|
  శ్రీవిష్ణు నక్షత్రే.! శ్రీవిష్ణు యోగే | శ్రీవిష్ణు కరణ | ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య
తిధౌ|

ప్రాచీనావితి: 
 ( యజ్ఞోపవీతమును ఎడమ నుండి కుడి భుజము పైకి మార్చుకొనవలెను)

మహాలయము : పితృణాం మాతామహాదీనాం సర్వీకారుణ్యానాంచ అక్షయ్య పుణ్యలోకా వాప్త్యర్దం కన్యాగతే సవితరి ఆషాడ్యాది పంచమాపరపక్షొ కర్తవ్య సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ద ప్రతినిధి సద్య, తిల తర్పణం కరిష్యే ||

సవ్యం:
సవ్యమనగా ఎడమబుజము పైకి యజ్ఞోపవీతమును మార్చవలెను. సవ్యం చేసుకుని నీరు వదలాలి.

ప్రాచీనావితి:  || మరల ప్రాచీనావీతి చేసుకొనవలెను.

 ముందుగా తూర్పు కొసలుగా మూడు ధర్బలు, వాటిపై దక్షిణ కొసలుగా రెండు కూర్చలు
పరిచి వాటి పై పితృదేవతలను
ఓం ఆగచ్చంతు మే పితర ఇమం గృహ్ణాంతు జలాంజలిమ్ ||" 
అని చదువుతూ తిలలు వేసి ఆహ్వానించవలెను. దక్షిణముఖముగా తిరిగి, ఎడమ మోకాలు మాత్రమే క్రింద ఆన్చి కూర్చుని తర్పణ విడువవలెను.

 "స్వధానమిస్తర్పయామి' అన్నప్పుడల్లా మూడుసార్లు తిలోదకము పితృతీర్ధముగా
ఇవ్వవలెను. వారి భార్య కూడా లేనిట్లైతే 
సవిత్నీకం అని, స్త్రీల విషయమున భర్త కూడా లేనట్లైతే సభర్తకం అని చేర్చుకొనవచ్చును. 

క్రింద మొదటి
ఖాళీలో అస్మత్ ...... గోత్రమును, రెండవ చోట మరణించిన వారి పేరును ...... శర్మాణం చెప్పి తర్పణ చేయాలి. ప్రతి దానికి ముందు "అస్మత్" అను శబ్దాన్ని చేర్చ వలెను. 
బ్రాహ్మణులైతే శర్మాణం అన్నది పనికొస్తుంది. 
కానీ రాజులైతే వర్మాణాం .
వైశ్యులైతే గుప్తం అని, మిగిలిన
ఇతరు కులముల వారు (మీ మీ కుల తోకలు తగిలించుకుని) "దాసం" అని మాత్రమే పలకాలి.

(ప్రాచీనావీతి) అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం)కరిష్యే.....(ప్రాచీనావీతి)  దక్షిణాభిముఖో భూత్వా..

1) పితరం..(తండ్రి పేరు చెప్పి)
 అస్మత్ .....గోత్రం, .... పేరు......శర్మాణం..వసురూపం..స్వధానమస్తర్పయామి.. అని 3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...!!

2) పితామహం..(తాత)
అస్మత్ ...... గోత్రం, ....... శర్మాణం.. రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి అని 
3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి..

3)ప్రపితామహం.(ముత్తాత)
అస్మత్ ......గోత్రం, .........శర్మాణం... ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి అని 3మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

4) మాతరం (తల్లి) గోత్రాం...దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి 
3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

5) పితామహీం (నానమ్మ) గోత్రాం..దాయీం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి
3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) గోత్రాం.. దాయీం..ఆదిత్యరూపాం
స్వధానమస్తర్పయామి
3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

7) సాపత్నిమాతరం ( సవితి తల్లి) గోత్రాం....దాయీం...వసురూపాం స్వధానమస్తర్పయామి 
3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

8)మాతామహం (తాత . అనగా తల్లి గారి తండ్రి)
గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి 
3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

9) మాతుః పితామహం (తల్లి గారి తాత)
గోత్రం..శర్మాణం... రుద్రరూపంవసురూపం.. స్వధానమస్తర్పయామి 
3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

10)మాతుఃప్రపితామహం
(తల్లి యొక్క తాతగారి తండ్రి)  గోత్రం...శర్మాణం.. ఆదిత్య రూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

11) మాతామహీం.(అమ్మ మ్మ) గోత్రాం..దాయీం. వసురూపాం స్వధానమస్తర్పయామి...3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

12) మాతుః పితామహీం.(తల్లి యొక్క నానమ్మ)
గోత్రాం.. దాయీం.. రుద్రరూపాం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి..

13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) గోత్రాం... దాయీం.. ఆదిత్య రూపాం..వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి..

14) ఆత్మ పత్నీం ( భార్య) గోత్రాం.. దాయీం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

15) సుతం (కుమారుడు)
గోత్రం..శర్మాణం.. వసురూపం  
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) గోత్రం..శర్మాణం.. వసురూపం  
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

17) కనిష్ఠ భ్రాతరం ( స్వంత చిన్నసోదరుడు)
గోత్రం..శర్మాణం.. వసురూపం  
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

18)తత్పత్నీం (సోదరుని భార్య.. వదిన)గోత్రాం..దాయీం వసురూపాం  . స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

20)తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) గోత్రాం..దాయీం
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

21)తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. గోత్రం... శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) గోత్రాం..దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

23)మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

24) తత్పత్నీం (మేనమామ భార్య) గోత్రాం..దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

25) దుహితరం (కూతురు) గోత్రాం..దాయీం.
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

25) ఆత్మ భగినీం ( సోదరి. అక్క&చెల్లెలు) గోత్రాం.. దాయీం
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

26)తద్భర్తారం (కూతురి భర్త & అల్లుడు) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

27)దౌహిత్రం (కూతురి కొడుకు & మనుమడు) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

28) తత్పత్నీం (కూతురు యొక్క కొడుకు భార్య) గోత్రాం..దాయీం.
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

29)భాగినేయకం ( మేనల్లుడు) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) గోత్రాం.దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

31) పితృ భగినీం ( మేనత్త & తండ్రి సోదరి) గోత్రాం..దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

32) తద్భర్తారం (మేనత్త భర్త) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

33)మాతృ భగినీం ( తల్లి సోదరి . చిన్న మ్మ. పెద్దమ్మ)  గోత్రాం..దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

34) తద్భర్తారం ( తల్లి సోదరి యొక్క భర్త) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

35) జామాతరం ( అల్లుడు కూతురి భర్త) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

36)స్నుషాం ( కోడలు)  గోత్రాం.దాయీం..
వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

37)శ్వశురం ( పిల్లనిచ్చిన మామ)
 గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

38)శ్వశ్రూం ( పిల్లనిచ్చిన మామ భార్య.. అత్త) గోత్రాం..దాయీం..
వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

39)శ్యాలకం (బావమరిది) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

40) తత్పత్నీం (బావమరిది భార్య) గోత్రాం..దాయీం.
వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

41) ఆత్మ పత్నీం (భార్య)
 గోత్రాం...దాయీం
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

42)గురుం ..  గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...

43)రిక్థినం ..
 గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....అని 3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి...!!!

యే బాంధవాః యే బాంధవాః  యేయే అన్య జన్మని  బాంధవాః |
తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన... వారిణా ||

ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః |
తృప్యంతు పితర స్సర్వే‌ మాతృ  మతామహాదయః ||

అతీత కుల కోటీనాం  సప్త ద్వీప నివాసినాం |
ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం ||
     (యజ్ణోపవీత నిష్పీడనం)

యజ్జోపవీతమును నివీతిగా (దండలాగా) మెడలో వేసుకుని ముడిని నీటిలో ముంచి నేలపై పిండుతూ ఈ క్రింది విధంగా చదువవలెను.

||శ్లొ|| యేకే దాస్మత కులే జాతాః ఆపుత్రా గోత్రిణొ మృతాః | తే గృహ్ణంతు మయాదత్తం సూత్ర నిప్పిడనొదకం ||

( నా కులములోను, గోత్రమునందును పుత్రులు లేక మరణించిన వారందరూ నేను వదిలే ఈ ఉదకమును స్వీకరించెదరు గాక! ]

శ్రీరామ రామ రామ | | అనుచూ యజ్ఞోపవీతపు ముడులను కళ్లకద్దుకుని సవ్యముగా చేసుకొనవలెను. 

తర్పణము అయ్యాక ఇది చెప్పాలి:

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా పితృ పక్షే సకృన్మహాలయే తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||

అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు :

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా ఈ కింది విధముగా చెయ్య వచ్చును.. 
ఇది కేవలం మీకు విధి లేని,గతిలేని పరిస్థితిలో మాత్రమే... ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ చాలా ముఖ్యము. 

ఈ శ్లోకము చెప్పి , మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను :

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||

ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్

ఆచమనం చేసి, శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి... మీ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు లేదా వారికి స్వయంపాకం దానంగా కూడా ఇవ్వొచ్చు.

ఇతి దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ !!

స్వస్తి !

- లక్ష్మి రమణ 

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha