Online Puja Services

వయస్సు దాటుతున్న వేళ

18.191.176.66

 

వయస్సు దాటుతున్న వేళ

1. ఈ సమయం  ఇన్నాళ్ళూ  సంపాదించినదీ,  దాచుకున్నదీ  తీసి  ఖర్చు  పెట్టె  వయసు.  తీసి  ఖర్చు  పెట్టి  జీవితాన్ని  ఎంజాయ్  చెయ్యండి.  

దాన్ని  ఇంకా  దాచి  అలా  దాచడానికి  మీరు  పడిన  కష్టాన్ని,  కోల్పోయిన ఆనందాలనూ  మెచ్చుకునేవారు  ఎవరూ  ఉండరు  అనేది  గుర్తు పెట్టుకోండి 

 2. మీ  కొడుకులూ,  కోడళ్ళూ  మీరు  దాచిన  సొమ్ముకోసం  ఎటువంటి  ఆలోచనలు చేస్తున్నారో? ఈ  వయసులో  ఇంకా  సంపాదించి  సమస్యలనూ,  ఆందోళనలూ  కొని తెచ్చుకోవడం  అవుసరమా? 
ప్రశాంతంగా  ఉన్నది  అనుభవిస్తూ జీవితం  గడిపితే  చాలదా? 

3. మీ  పిల్లల  సంపాదనలూ,  వాళ్ళ  పిల్లల  సంపాదనల  గురించిన  చింత  మీకు  ఏల?  వాళ్ళ  గురించి  మీరు  ఎంత  వరకూ  చెయ్యాలో  అంతా  చేశారుగా?  వాళ్లకి  చదువు,  ఆహారం, నీడ మీకు  తోచిన  సహాయం  ఇచ్చారు.  ఇపుడు  వాళ్ళు  వాళ్ళ  కాళ్ళమీద  నిలబడ్డారు.  ఇంకా  వాళ్ళకోసం  మీ  ఆలోచనలు  మానుకోండి. వాళ్ళ  గొడవలు  వాళ్ళను  పడనివ్వండి.

  4. ఆరోగ్యవంతమైన  జీవితం  గడపండి.   అందుకోసం  అధిక  శ్రమ  పడకండి. తగిన  మోతాదులో  వ్యాయామం  చెయ్యండి. (నడక, యోగా   వంటివి  ఎంచుకోండి) తృప్తిగా  తినండి.  హాయిగా  నిద్రపోండి.   అనారోగ్య  పాలుకావడం  ఈ వయసులో  చాలా  సులభం,  ఆరోగ్యం  నిలబెట్టుకోవడం  కష్టం.  అందుకే  మీ  ఆరోగ్య  పరిస్థితిని  గమనించుకుంటూ  ఉండండి. మీ వైద్య  అవుసరాలూ,  ఆరోగ్య  అవుసరాలూ   చూసుకుంటూ  ఉండండి.  మీ డాక్టర్  తో  టచ్  లో  ఉండండి.  అవుసరం  అయిన  పరీక్షలు  చేయించుకుంటూ  ఉండండి.  (ఆరోగ్యం  బాగుంది  అని  టెస్ట్ లు  మానేయకండి) 

5. మీ  భాగస్వామికోసం  ఖరీదైన  వస్తువులు  కొంటూ  ఉండండి.  మీ  సొమ్ము  మీ  భాగస్వామితో  కాక  ఇంకెవరితో  అనుభవిస్తారు? గుర్తుంచుకోండి ఒకరోజు  మీలో  ఎవరో  ఒకరు  రెండో  వారిని  వదిలిపెట్టవలసి  వస్తుంది.  మీ డబ్బు  అప్పుడు  మీకు  ఎటువంటి  ఆనందాన్నీ  ఇవ్వదు.  ఇద్దరూ  కలిసి  అనుభవించండి.

6. చిన్న  చిన్న  విషయాలకు  ఆందోళన  పడకండి. ఇప్పటివరకూ  జీవితం  లో  ఎన్నో  ఒత్తిడులను  ఎదుర్కొన్నారు.   ఎన్నో  ఆనందాలూ,  ఎన్నో  విషాదాలూ  చవి  చూశారు.  అవి  అన్నీ  గతం. 
మీ  గత  అనుభవాలు మిమ్మల్ని  వెనక్కులాగేలా  తలచుకుంటూ  ఉండకండి,  మీ భవిష్యత్తును భయంకరంగా  ఊహిచుకోకండి.  ఆ  రెండిటివలన  మీ  ప్రస్తుత  స్థితిని   నరకప్రాయం  చేసుకోకండి. ఈరోజు  నేను  ఆనందంగా  ఉంటాను అనే  అభిప్రాయంతో  గడపండి.   చిన్నసమస్యలు  వాటంతట  అవే  తొలగిపోతాయి . 

7. మీ  వయసు  అయిపొయింది  అనుకోకండి.  మీ  జీవిత  భాగస్వామిని  ఈ  వయసులో  ప్రేమిస్తూనే  ఉండండి. జీవితాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. కుటుంబాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. మీ  పొరుగువారిని  ప్రేమిస్తూ  ఉండండి. 

  "జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ  ఉన్నన్ని నాళ్ళూ   మీరు  ముసలివారు  అనుకోకండి. నేను  ఏమిచెయ్యగలనూ  అని  ఆలోచించండి.  నేను  ఏమీ  చెయ్యలేను  అనుకోకండి" 

8. ఆత్మాభిమానం  తో  ఉండండి  (మనసులోనూ బయటా  కూడా) హెయిర్  కట్టింగ్  ఎందుకులే  అనుకోకండి.  గోళ్ళు  పెరగనియ్యిలే అనుకోకండి.  చర్మసౌందర్యం  మీద  శ్రద్ధ   పెట్టండి.  పళ్ళు  కట్టించుకోండి. ఇంట్లో  పెర్ఫ్యూమ్ లూ,  సెంట్లూ ఉంచుకోండి. బాహ్య  సౌందర్యం  మీలో అంతః సౌందర్యం  పెంచుతుంది అనే  విషయం  మరువకండి.  మీరు  శక్తివంతులే! 
  
9. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయిన ఒక  స్టైల్స్ ఏర్పరచుకోండి.  వయసుకు  తగ్గ  దుస్తులు  చక్కటివి  ఎంచుకోండి. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయినట్టుగా  మీ  అలంకరణ ఉండాలి.  మీరు  ప్రత్యేకంగా  హుందాగా ఉండాలి. 

10. ఎప్పటికప్పుడు  అప్ డేట్  గా  ఉండండి. న్యూస్ పేపర్లు  చదవండి. న్యూస్ చూడండి.  పేస్  బుక్ , వాట్సాప్ లలో  ఉండండి. మీ  పాత  స్నేహాలు  మీకు  దొరకవచ్చు.  

11. యువతరం ఆలోచనలను  గౌరవించండి. 
మీ  ఆదర్శాలూ  వారి  ఆదర్శాలూ  వేరు  వేరు  కావచ్చు. అంతమాత్రాన  వారిని  విమర్శించకండి.

సలహాలు  ఇవ్వండి, అడ్డుకోకండి. మీ  అనుభవాలు  వారికి  ఉపయోగించేలా  మీ  సూచనలు  ఇస్తే  చాలు. వారు  వారికి  నచ్చితే  తీసుకుంటారు.  దేశాన్ని  నడిపించేది వారే!

 12. మా  రోజుల్లో ...  అంటూ   అనకండి.  మీరోజులు  ఇవ్వే!
మీరు  బ్రతికి  ఉన్నన్ని  రోజులూ   " ఈరోజు నాదే"  అనుకోండి  

అప్పటికాలం  స్వర్ణమయం  అంటూ  ఆరోజుల్లో   బ్రతకకండి.  
తోటివారితో కఠినంగా  ఉండకండి. 

జీవితకాలం  చాలా  తక్కువ.  పక్కవారితో కఠినంగా   ఉండి మీరు  సాధించేది  ఏమిటి?  పాజిటివ్  దృక్పధం,  సంతోషాన్ని  పంచే  స్నేహితులతో  ఉండండి.  దానివలన  మీ  జీవితం  సంతోషదాయకం  అవుతుంది.  కఠిన  మనస్కులతో  ఉంటె   మీరూ  కఠినాత్ములుగా  మారిపోతారు.  అది  మీకు  ఆనందాన్ని  ఇవ్వదు.  మీరు  త్వరగా  ముసలివారు  అవుతారు.

13. మీకు  ఆర్ధికశక్తి  ఉంటె,  ఆరోగ్యం  ఉంటె   మీ  పిల్లలతో  మనుమలతో  కలిసి  ఉండకండి. కుటుంబ సభ్యులతో  కలిసి  ఉండడం  మంచిది  అని  అనిపించవచ్చు.  కానీ  అది  వారి  ప్రైవసీకి  మీ  ప్రైవసీకి కూడా  అవరోధం  అవుతుంది. వారి  జీవితాలు  వారివి.  
మీ  జీవితం  మీది. వారికి  అవుసరం  అయినా,  మీకు  అవుసరం  అయినా  తప్పక  పిల్లలతో  కలిసి  ఉండండి. 

14. మీ  హాబీలను  వదులుకోకండి.  ఉద్యోగజీవితం  లో  అంత  ఖాళీ  లేదు  అనుకుంటే  ఇప్పుడు  చేసుకోండి.  తీర్థ  యాత్రలు  చెయ్యడం,  పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో  పెంచడం,  తోట పెంపకం, పెయింటింగ్ ...  రచనా  వ్యాసంగం   ...  ఏదో  ఒకటి  ఎంచుకోండి. 

15. ఇంటిబయటకు  వెళ్ళడం  అలవాటు  చేసుకోండి.  కొత్త  పరిచయాలు  పెంచుకోండి. పార్కుకి  వెళ్లండి, గుడికి  వెళ్ళండి,  ఏదైనా  సభలకు  వెళ్ళండి.  ఇంటిబయట  గడపడం  కూడా  మీ  ఆరోగ్యానికి  మేలు  చేస్తుంది. 

16. మర్యాదగా   మాట్లాడడం  అలవాటు  చేసుకోండి.  నోరు  మంచిది  అయితే  ఊరు  మంచిది  అవుతుంది.  పిర్యాదులు  చెయ్యకండి. లోపాలను  ఎత్తిచూపడం  అలవాటు  చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను  అర్ధం  చేసుకుని  ప్రవర్తించండి. సున్నితంగా  సమస్యలను  చెప్పడం  అలవాటు  చేసుకోండి. 

17. వృద్ధాప్యం  లో  బాధలూ,  సంతోషాలూ  కలిసి  మెలసి  ఉంటాయి.  బాధలను  తవ్వి  తీసుకుంటూ ఉండకండి. అన్నీ  జీవితంలో  భాగాలే 

18. మిమ్మల్ని  బాధపెట్టిన  వారిని  క్షమించండి
 
మీరు  బాధపెట్టిన  వారిని  క్షమాపణ  కోరండి 

మీతోపాటు  అసంతృప్తిని  వెంటబెట్టుకోకండి.

అది మిమ్మల్ని విచారకరం  గానూ,
కఠినం గానూ   మారుస్తుంది 
ఎవరు  రైటు అన్నది  ఆలోచించకండి. 

19. ఒకరిపై పగ  పెట్టుకోవద్దు
క్షమించు,  మర్చిపో,  జీవితం  సాగించు. 

20. నవ్వండి నవ్వించండి. బాధలపై  నవ్వండి 
ఎందరికన్నానో  మీరు  అదృష్టవంతులు. 
దీర్ఘకాలం  హాయిగా  జీవించండి. 

ఈ వయసు వరకు  కొందరు  రాలేరు  అని  గుర్తించండి. 
మీరు  పూర్ణ  ఆయుర్దాయం  పొందినందుకు   ఆనందించండి.


ఇందులో మీకు నచ్చని విషయాలను వొదిలేయండి.  మీకు నచ్చినవి చేయండి. 

- వాట్సాప్ సేకరణ. 

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda