Online Puja Services

అంతరాలు

3.133.131.168

అంతరాలు, ఓ చక్కని వ్యాసం 

మధ్యతరగతి అంతరంగంలో ఆ  అంతరం అలాగే ఉండిపోయింది!

1) చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం, కొంతమంది రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది! 
అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!

ఇప్పుడు పెద్దయ్యాక మనం కొనుక్కుని తినే టైంకి ఆ పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.

దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .

2) చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే, కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు, అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!   

పెద్దయ్యాక మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే వాళ్ళు కాటన్ కు దిగారు ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ ! 

దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..

3) చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే మోకాళ్ళ దగ్గర చినిగితే పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా రఫ్ చేసి ఇస్తే మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం! 

పెద్దయ్యాక చూస్తే జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని ఫ్యాషన్ పేరుతో అధికధరలకు కొంటున్నారు !

దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...

4) *ఓ వయసులో మనకు సైకిల్ కొనగలగడమే కష్టం, అదీ సాధించేసరికి వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు, మనం స్కూటర్ కొనే సమయానికి వాళ్ళు కార్లలో తిరిగేవారు, మనం కొంచెం ఎదిగి మారుతి 800 కొనే సమయానికి వాళ్ళు BMW ల్లో తిరిగారు, మనం రిటైర్మెంట్ వయసుకి  వచ్చిన కూడబెట్టుకున్న వాటితో  కొంచెం పెద్ద కారు కోనేసమయానికి వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!

*దాంతో ఇప్పటికి ఆ అంతరం
 అలాగే ఉండిపోయింది . .
                        
ప్రతి దశలో ప్రతి సమయాన విభిన్న మనుషుల మధ్య స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.

*"ఆ అంతరం నిరంతరం" ఎప్పటికి ఉండి తీరుతుంది *

రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని మళ్ళీ రేపటిరోజున గతించిన  ఇవాళ్టి గురించి చింతించేకంటే, ఇవాళ అందినదానితో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ రేపటి స్వాగతం పలకడం శ్రేయస్కరం.

*మన, మనవారి గురించి
కాలాన్ని వెచ్చిద్దాం *

మనం నవ్వుతూ ఉందాం

జీవితం కూడా సంతోషంగా ఉంటుంది 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore