ఇప్పుడు అర్ధం అవుతోంది

3.239.58.199
ఇప్పుడు అర్ధం అవుతోంది
 
1) పూర్వకాలంలో ఇంటికి దూరంగా మరుగుదొడ్లు ఎందుకు ఉండేవో...
2) చెప్పులు ఇంటి బయట విడిచి కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ఎందుకు రావాలో...
3) ఇంటా బయట ప్రతీ గడపకీ పసుపు ఎందుకు రాసేవారో....
4) వారానికి ఒకసారి ఇంట్లో సామానులన్నీ సర్ది ఇల్లంతా ఎందుకు కడిగేవారో....
5) సుద్దతో ఇల్లంతా ముగ్గులు ఎందుకు వేసేవారో...
(Calcium నుండి విలువడే ధాతువులు ఇల్లంతా వ్యాపించి కొన్ని వ్యాధికారక వైరస్ లను నిరోదిస్తాయి)
6) సుచిగా స్నానం చేసాకే వంట ఎందుకు చేసేవారో....
7) నోట్లో వేళ్ళు పెట్టుకోవద్దని,  గోళ్లు కొరకొద్దని, ఏదయినా తినేముందు చేతులు కడుక్కోవాలని ఎందుకు చెప్పేవారో....
8) స్నానం చేసాక మడి అని చెప్పి... స్నానం చేయ్యని మిగతా వారిని అంటకుండా ఎందుకు తిరిగేవారో....
9) మనం బయటకు వెళ్లేముందు ఎవరైనా తుమ్మితే ఆపశకునం అని... కొద్ది క్షణాలు ఆగి వెళ్ళమని ఎందుకు చెప్పేవారో...
(ఆ తుమ్మిన వ్యక్తి నోటినుండి ముక్కు నుండి వెలువడిన తుంపరలు కొద్దిసేపు గాలిలో తేలియాడి మెల్లగా నెలమీదకు చేరుకుంటాయి.... ఆ తుంపరల బారినపడి అంటువ్యాధులు రాకుండా వుండాలని ఆలా చెప్పేవారు)
10) బయటకు వెళ్ళాక తెలిసినవాళ్ళు ఎదురు పడితే (కారాచలనం చేయ్యకుండా) రెండు చేతులు జోడించి నస్కారం ఎందుకు చేసేవారో.... 
11) ప్రతీ కూరలోనూ పసుపు ఎందుకు వేసేవారో 
12) నెలకి ఒక్కసారి ఐనా మిరియాల చారు, మెంతుల పులుసు తప్పనిసరిగా ఎందుకు చేసేవరో....
13) కనీసం ఆరు నెలలకి ఒక్కసారి అయినా ఆముదం ఎందుకు పట్టించేవారో....
14) ఎవరి ఇంట్లో అయినా బిడ్డ పుట్టినా లేక ఎవరైనా చనిపోయినా 11 రోజులు మైల అని ఎందుకు అనేవరో...
 
ఇంకా ఇటువంటివి చాలా వున్నాయి...
 
ఇవన్నీ ఆలోచిస్తుంటే మన పూర్వికులు కూడా కరోనాలాంటి మహమ్మారితో పోరాడి ఇటువంటి నియమాలను ఆచారాలతో మేళవించి అనుసరించారేమో అనిపిస్తుంది గానీ మనకి ఆధునిక విజ్ఞానం ఎక్కువయ్యి.... కాకరకాయని.... కీకరకాయ అనడం మొదలుపెట్టాము. 
 
పెద్దవాళ్ళకి చాదస్తం ఎక్కువ అని వారిని చాందశవాదులుగా ముద్రవేసి వారు చెప్పిన మాటలను గేలిచేసి... గాలికి వదిలేసి ఇంతకాలం ఇష్టనుసారం తిరిగి.... ఇదిగో ఇప్పుడు మనకి తెలియకుండానే అవన్నీ కాకపోయినా అందులో కొన్ని ఆచరిస్తున్నాము.
 
- సేకరణ 

Quote of the day

And as long as you're subject to birth and death, you'll never attain enlightenment.…

__________Bodhidharma