తాయత్తుమహిమ లో సిద్ధవైద్య రహస్యం !

54.173.214.227

తాయత్తుమహిమ లో సిద్ధవైద్య రహస్యం !
కూర్పు- లక్ష్మీ రమణ 

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు

అని చిన్నప్పుడు నేర్చుకున్న చిన్ని కృష్ణుని పద్యం .  ఈ పద్యంలో చిన్ని కృష్ణునికి కూడా యశోదమ్మ కట్టిన తాయత్తు ఉంది కదూ !తాయితు, తాయెతు, తాయెత్తు అని వాడుకలో వాడే మాటలు . వీటిని  రక్షరేకు లేదా తావీజు అనే అర్ధంలోనే ఎక్కువగా తీసుకుంటున్నాం. 

దీని అర్ధాన్ని మరింత లోతుగా విశదీకరిస్తే ,  తాయి + ఎత్తు అని కదా తాయి అంటే తల్లి లేదా పిన్ని. తల్లి బిడ్డలకుకట్టే రక్షరేకు అని అర్థం వస్తుంది . తమిళంలో 'తాయ్' అంటే తల్లి. 'అత్తు' అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు అర్థం తల్లి (నుండి) ఖండించినది అని. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్). ప్రాచీనకాలంలో బిడ్డ పుట్టగానే మంత్రసాని బొడ్డుతాడుని నుండి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి ఒక గొట్టంలో పోసి మూతపెట్టి ఉంచేది. బారసాల అయినాక ఆ గొట్టాన్ని ఒక త్రాటికి కట్టి దానిని మొలత్రాడుగా కట్టేవారు. అదే తాయత్తు.

ఇది మన ప్రాచీన సిద్ధవైద్యం :

మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని. ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు.ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే "తాయత్తు మహిమ" అనేవారు. ఈ "తాయత్తుమహిమ" అనే పదానికి అసలైన అర్థమిదే.

ఈ ఆచారం అనేక ప్రాంతాలలో, పల్లెపట్టుల్లో ఉండేది. ఎవరికైనా పాము కరిచినా, ఏదైనా పెద్ద జబ్బు చేసినా, సిద్ధ వైద్యులు ఈ తాయత్తులోని రక్తాన్ని,కణాలనూ తీసి ఇతర అవసరమైన మూలికలు కలిపి వైద్యం చేసేవారు. దీనికోసం ఎప్పుడైనా ఒక వ్యక్తి స్టెమ్ సెల్స్ కావాలంటే అతని మొలత్రాడును తడిమితే సరిపోయేది. అది దాచడానికి అంతకంటే భద్రమైన ప్రదేశం ఏముంటుంది ?

ఐతే కాలక్రమంలో ఇలా స్టెమ్ సెల్స్ భద్రపరిచే జ్ఞానం లుప్తమైపోయింది. కేవలం ఆచారం మాత్రం మిగిలింది. తాయెత్తు గొట్టంలో ఏం ఉంచాలో తెలీక రాగిరేకులపై వ్రాసిన యంత్రాలు వంటివి ఉంచి కట్టడం ప్రారంభించారు. మెల్లగా తాయత్తు అన్నది మూఢనమ్మకం అన్న నమ్మకం ప్రబలి తాయత్తును వదిలి కేవలం మొలత్రాడు మాత్రం కట్టడం ప్రారంభించారు.

ఇప్పటి శాస్త్రవేత్తలమాట :

ఈ బొడ్డుతాడును పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చని ఇప్పటి శాస్త్రవేత్తల అభిప్రాయం . అందుకే ఇప్పుడు ఈ బొడ్డు తాడునుండి స్టెమ్ సెల్స్ సేకరించి భద్రపరిచే బాంకులు భారత దేశంలో కూడా అందుబాటులోకి వచ్చాయి . ఐతే ఈ ఆధునిక తాయత్తులను చాలా జాగ్రత్తగా క్రయోజెనిక్ ఉష్ణోగ్రతలలో భద్ర పరచాలి. అది ఉంటే కాన్సర్ లాంటి ఏ రోగాన్నైనా నయం చేయవచ్చనీ, భవిష్యత్తులో మనిషి అవయవం ఏదైనా కోల్పోతే ఈ రక్తంనుండి మళ్లీ ఆ అవయవాన్ని పునరుత్పత్తి చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ దిశగా కృషి జరుగుతోంది.

స్టెమ్ సెల్స్ ఉపయోగం గురించి ఆధునిక వైద్య విజ్ఞానం గుర్తించింది నిన్న మొన్ననే. మరి మొలత్రాడు, తాయత్తుల సంప్రదాయం ఏనాటిది ? దీన్ని ఈనాడు పరిశీలించి, తిరిగి పరిశోధించి చెబితే, ఆచరణలో పెట్టె వారు , మన హిందూ ధర్మాల్లో ఉన్న ఆచారాలకు ఉన్న శాస్త్రీయతని ఎప్పటికి అర్థం చేసుకుంటారో మరి !!

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda