Online Puja Services

గోమూత్రం వలన నివారణ అయ్యే వ్యాధులు

18.216.227.76
గోమూత్రంలో రసాయనిక పదార్దాల వలన నివారణ అయ్యే వ్యాధులు  -
 
 * నత్రజని  - మూత్రము మరియు మూత్రపిండములను ఉత్తేజితపరుచును. రక్తము నందలి విషపదార్ధాలను హరించును .

*  గంధకము - రక్తమును శుద్దిపరచును. పెద్దప్రేగులు యొక్క పనితనాన్ని మెరుగుపరచును.

*  అమ్మోనియా - ఇది శరీరమునందలి ధాతువులను మరియు రక్తము నందలి పదార్థములను స్థిరంగా ఉంచును.

*  అమ్మోనియా గ్యాస్  - ఊపిరితిత్తులు మరియు ఆయా అవయవములను క్రిముల నుండి రక్షించును.
 
 *  తామ్రము  - క్రిమిహరము . ఆయా గ్రంథులను పెరగనీయదు. వాపులను రానీయదు.
 
 *  లోహము (ఐరన్ ) - రక్తము నందలి ఎర్రరక్త కణములను నిర్మాణం చేయును . పనిచేయు శక్తిని కలిగించును.
 
 *  యూరియా  - మూత్రవిసర్జన పైన ప్రభావం చూపించును. క్రిములను హరించును .
 
 *  యూరిక్ ఆసిడ్  - మలమూత్ర సంబంధ దోషాలను మరియు హృదయ సంబంధ దోషాలను హరించును . విషమును బలహీనపరుచును.
 
 *  ఫాస్ఫెట్లు - మూత్రవ్యవస్థ నందలి ఏర్పడే సన్నటి రాళ్లను బయటకి పంపించడంలో తోడ్పడును .
 
 *  సోడియం  - రక్తమును శుద్దిచేయును . ఆమ్లతత్వమును (antacid ) నివారించును.
 
 *  పొటాషియం  - ఆకలిని పుట్టించును . మాంసకండరాల బలహీనతని నివారించును. బద్ధకమును నివారించును.
 
 *  మాంగనీసు  - క్రిమి నిరోధము , క్రిమిహరము , శరీరభాగాలు కుళ్లిపోవుట (Gangrene ) నివారించును.
 
 *  క్యాల్షియం  - రక్తశోధకం , ఎముకలను బలపరుచును. క్రిములను హరించును . రక్తస్రావాన్ని అరికట్టును.
 
 *  లవణము - దుష్టవ్రణములు , నాడివ్రణములు , మధుమేహము , పుట్టుకతో వచ్చు మూర్చ , రక్తములో ఆమ్లతత్వం పెరుగుట నివారించును. క్రిములను హరించును .
 
 *  విటమిన్స్  - A , B , C , D , E విటమిన్స్ శరీరముకు ఉత్సాహము కలిగించును. ఎముకలను దృఢపరచును. ప్రత్యుత్పత్తిశక్తిని పెంచును.
 
 *  ఇతర ఖనిజములు  - రోగనిరోధక శక్తిని పెంచును.
 
 *  ల్యాక్టోజ్  - అతి దాహమును తగ్గించును . నోరు ఎండుకుపోవుట , మూత్రము నందు చక్కర పోవుట నివారించును. దప్పిక , గుండెదడ నివారించును. హృదయమునకు హితవు చేయును .
 
 *  ఎంజైములు - శక్తివర్ధకములు .
 
 *  జలము  - జీవశక్తిని పెంచును. రక్తమును ద్రవస్థితిలో ఉంచును. శరీర ఉష్ణమును స్థిరముగా ఉంచును.
 
 *  హిఫ్యూరిక్ యాసిడ్  - మూత్రము ద్వారా విషాలను బహిర్గతం చేయును .

 *  క్రియాటినిన్  - క్రిమిహరము .

*  స్వర్ణ క్షారము  -  క్రిమిహరము . రోగనిరోధక శక్తిని పెంచును. విషాన్ని హరించును .
 
ఎనిమిది మాసముల గర్భిణి అయిన గోవు యొక్క మూత్రము నందు హార్మోనులు ఉండును. ఇవి ఆరోగ్యవర్ధకములు. పైన చెప్పిన ధాతువులు యెక్క ఫలితాలు కేవలం దేశీయ గోజాతి ముత్ర సేవన వలన మాత్రమే లభించును. గోమాతయొక్క గొప్పతనం గురించి మరొక్క అద్భుతవిషయం మీకు చెప్తాను . గోవు ఆహారం తీసుకునేప్పుడు మేతలో ఏదన్న విషపదార్ధం లోపలికి వెళ్ళినను అట్టి విషపదార్ధాన్ని తన మాంసంలోకి గ్రహించును. అంతేగాని మూత్రములోగాని , గోమయములో గాని , లేక పాలలోగాని విసర్జించదు. ఒకవేళ విసర్జించినను అత్యల్పమోతాదులో విసర్జించును. దానివల్ల వాటిని సేవించినవారి ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండదు.     నేనురాసిన గ్రంథాలలో ఆవునెయ్యి , ఆవుపాలు , ఆవు వెన్న మొదలైన వాటిగురించి మరింత విపులంగా ఇచ్చాను .
 
   గమనిక  - నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను. మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
 
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
 
కాళహస్తి వేంకటేశ్వరరావు 
9885030034 
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Quote of the day

A small body of determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history.…

__________Mahatma Gandhi