Online Puja Services

జ్వరాన్ని పోగెట్టే ఆయుర్వేద మార్గాలు

3.144.140.151
జ్వరాలను హరించు ఔషధయోగాలు  - 
 
 *  ఆల్ బకరా పండు బుగ్గన పెట్టుకుని రసము మింగుచున్న జ్వరము హరించును . 
 
 *  రేగుచెట్టు వేఱు కషాయం జ్వరాన్ని హరించును . 
 
 *  సొంపు తేలిక ( పలుచటి ) కషాయం జ్వరాన్ని హరించును . ఒక ఔన్స్ మోతాదులో కషాయం తీసుకోవలెను . 
 
 *  వాము , ధనియాలు , జీలకర్ర సమాన భాగాలుగా తీసుకుని వేయించి కషాయం కాచి సేవించిన జ్వరము తగ్గును. అజీర్తి నశించును. 
 
 *  సీతాఫలం చెట్టు బెరడు కషాయం తాగిన జ్వరం తగ్గును. 
 
 *  బోడసరం చెట్టు సమూల రసం లోపలికి తీసుకొనుచున్న జ్వరము తగ్గును. 
 
 *  మిరియాల చూర్ణం తేనెతో సేవించుచున్న జ్వరము హరించును . 
 
 *  అడ్డసరం ఆకుల రసము సేవించిన జ్వరము తగ్గును. 
 
 *  పిప్పళ్ల చూర్ణం తేనెతో సేవించుచున్న జ్వరం , దగ్గు తగ్గును. 
 
 *  లేత కొబ్బరి బొండం నీరు జ్వరాన్ని తగ్గించును . 
 
 *  మెంతుల కషాయం పావు కప్పు మోతాదుగా తాగిన జ్వర తీవ్రత తగ్గును. 
 
 *  ఉశిరికాయల కషాయం అరకప్పు మోతాదులో తాగుచున్న జ్వరము త్వరగా తగ్గును. 
 
 *  సరస్వతి ఆకుచూర్ణం పావుచెంచా మోతాదులో గాని సరస్వతి ఆకు రసం మూడు చెంచాలుగా గాని తీసుకొనుచున్న  జ్వరాలు త్వరగా తగ్గును. మోదుగ ఆకుల రసం రెండు చెంచాల మోతాదులో తీసుకున్నా పనిచేస్తుంది . 
 
 *  ఒక కప్పు పాలలో ఒక వెల్లుల్లి పాయలోని సగం రేకులు వేసి మరిగించి వాటిని తీసివేసి ఆ పాలను తాగిన జ్వరం త్వరగా తగ్గును. కుంకుమపువ్వు చింతగింజ అంత మోతాదులో తీసుకున్నను జ్వరం తగ్గును. 
 
 *  దువ్వెన చెట్టు ఆకుల కషాయం పావుకప్పు మోతాదులో తాగుచున్న జ్వరం తగ్గును. 
 
          పైన చెప్పిన యోగాలు ఒకసారి వాడితే చాలదు. జ్వరం తగ్గేంతవరకు వాడవలెను . 
 
 జ్వర నివారణలో నా అనుభవ యోగాలు  - 
 
 
 *  300ml గోరువెచ్చటి నీటిలో 6 నిమ్మకాయల రసం , 4 స్పూనుల పటిక పంచదార ( మిస్త్రీ ) వేసి బాగా కలిపి రోజుమొత్తం మీద కొంచం కొంచం మోతాదులో తీసుకొనుచుండిన జ్వరం వెంటనే నయం అగును. 
 
 *  వేపచెక్క బెరడు బెత్తెడు ముక్క తీసుకుని ఒక గ్లాసున్నర  నీటిలో వేసి గ్లాసు వచ్చేంత వరకు మరిగించి వడకట్టి ఒక మోతాదుగా తాగించి 5 దుప్పట్లతో శరీరం మొత్తం కప్పవలెను. కొంతసేపటికి లోపల చెమట పట్టి జ్వరం దిగును . ఇలా మూడుపూటలా , 3 రోజుల పాటు చేసిన ఎంతటి తీవ్ర జ్వరం అయినను తగ్గును. 
 
          జ్వరంతో భాదపడువారికి తేలికైన ఆహారం ఇవ్వవలెను . ఇప్పుడు మీకు జ్వరము నందు తీసుకోవలసిన ఆహారాల గురించి మీకు వివరిస్తాను . 
 
 
  తీసుకోవలసిన ఆహారాలు  - 
 
    జ్వరం తగ్గేవరకు బార్లీ గింజల జావ దానిలో గ్లూకోజ్ గాని పటికపంచదార కలిపి ఇవ్వవలెను. జ్వరం తగ్గిన తరువాత బార్లీజావలో ఆవుపాలు , పంచదార కలిపి గోధుమనూక గాని , బియ్యమునూక గాని వేసి పలుచని జావ గాని ఇవ్వవచ్చు.  
 
      పాతబియ్యపు అన్నం , పాతబియ్యం వేయించి వార్చిన అన్నం , పొట్లకాయ , బీరకాయ , పొట్టికాకర కాయ , నక్కదోసకాయ , వేపపువ్వు , చిర్రికూర , పెరుగుతోటకూర , కొయ్యతోటకూర , పొన్నగంటికూర , కరివేపాకు , లేతముల్లంగి , చక్రవర్తికూర , చెంచలి కూర , కందిపప్పు , పెసరపప్పు , మైసూర్ పప్పు , ఉలవలు , లేత మేక మాంసం , నేతిలో వేయించిన మాంసం , పాత చింతకాయ పచ్చడి , పాత నిమ్మకాయ , పుల్లదబ్బకాయ పచ్చళ్లు , కొత్తిమీర , పుదీనా పచ్చళ్లు , పచ్చిద్రాక్ష , పుల్ల దానిమ్మ , తియ్యటి దానిమ్మ , ఆల్ బకరా పండ్లు , బత్తాయి , నారింజ , ఆపిల్ , సపోటా మొదలగు పండ్లు తీసుకోవచ్చు . విషజ్వరాలుకు ఉపవాసం చేయడం చాలా మంచిది . జ్వరం పూర్తిగా తగ్గాక వేడినీటిస్నానం చేయవలెను . తలస్నానం చేయరాదు . 
 
 
                   
 
  గమనిక  -
 
           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
 
           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
 
            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
 
      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
 
            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
 
                  కాళహస్తి వేంకటేశ్వరరావు 
 
                         9885030034 
 
               అనువంశిక ఆయుర్వేద వైద్యులు
 
 

Quote of the day

Do not be very upright in your dealings for you would see by going to the forest that straight trees are cut down while crooked ones are left standing.…

__________Chanakya