ఎవ్వరివాడాగాను యేమందునిందుకు - అన్నమయ్య కీర్తన

3.231.167.166

ఎవ్వరివాడాగాను యేమందునిందుకు
నవ్వుచు నాలోనిహరి నన్నుగావవే


కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు నేను
చూపుడుఁబూట వెట్టితి సొగిసి నేను
యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను
దాపుగ తొర్లుఁబూట తగిలించుకొంటిని


మొదల కర్మములకు మోసపోయి యీ బ్రదుకు
కుదువవెట్టితి నే గురి గానక
వెదకి కామునికి విషయములకు నే
అదివో నావయసెల్ల నాహివెట్టితిని


ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు
కప్పిన గురుడు నీకు క్రయమిచ్చెను
వొప్పించిరిందరు బలువుడు చేపట్టెననుచు
అప్పులెల్లబాసి నీ సొమ్మైతినేనయ్యా

Quote of the day

As mortals, we're ruled by conditions, not by ourselves.…

__________Bodhidharma