Online Puja Services

పంచమూర్తులు ఎవరో తెలుసా?

3.147.104.248

పంచమూర్తులు ఎవరో తెలుసా?
లక్ష్మీ రమణ 

మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముప్పై కోట్ల మంది దేవతలు ఉన్నారు. వారు సృష్టి స్థితి లయములకి అవసరమైన అనేకానేక బాధ్యతల్లో తలమునకలుగా ఉంటారు . కోటానుకోట్ల జీవులు నిత్యం పుడుతూ , పోషింపబడుతూ, చనిపోతూ, తిరిగి జన్మిస్తూ  … ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటె, దానినంతా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆ మాత్రం కార్యవర్గం కావాలిగా ! తానూ ఒక్కడే అయ్యుండీ, అనేకుడిగా రూపుదాల్చిన  విరాట్ స్వరూపమే కదా పరబ్రహ్మము . వీటిల్లో ముఖ్యమైన సృష్టి స్థితి లయములకి కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి అందరికీ తెలిసిందే ! అయితే మరి ఈ  పంచమూర్తులు ఎవరు? 

 కోరిన కోర్కెలు తీర్చే వరప్రదాయకులు ఈ పంచమూర్తులు . చాలా మంది త్రిమూర్తులు అయినా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు మరో ఇద్దరు దేవతలని కలిపి పంచమూర్తులుగా చెబుతుంటారు. కానీ, పంచమూర్తులంటే వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, పరమేశ్వరుడు , పార్వతీదేవి ,  చండికేశ్వరుడు .  వీళ్ళని ఐదుగురిని కలిపి పంచమూర్తులుగా పేర్కొంటారు .  

శ్రీకాళహస్తిలో ఏటా శివరాత్రి సందర్భంలో ఈ పంచమూర్తులనూ ఊరేగిస్తారు . నందిపైన అయ్యవారు , కామధేనువు పైన జ్ఞానప్రసూనాంబగా అమ్మ మిగిలిన పంచమూర్తులూ వెంట తరలిరాగా కన్నుల పండుగగా పురవీధులలో ఊరేగవచ్చే ఆ వేడుక కన్నుల పండుగగా ఉంటుంది .  

అదేవిధంగా కర్ణాటకలోని నంజనగూడులో కొలువైన రోగులపాలిటి అపారసంజీవనిగా పేరొందిన స్వామీ శ్రీ కంఠేశ్వరుడు కూడా ఏడాదికి రెండుమార్లు జాతర జరుపుకుంటారు .  ఆయన కూడా తన పరివారమైన ఈ పంచమూర్తులతోనూ ఊరేగవస్తారు . 
 
కాబట్టి పంచమూర్తులు అంటే త్రిమూర్తుల స్వరూపాలుకాదు . శివపరివారమైన విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు , జ్ఞానప్రదాత సుబ్రహ్మణ్యుడు , కార్యసాధకుడు , అనుగ్రహప్రదాత  అయిన చండికేశ్వరుడు పరివారంగా పార్వతీ, పరమేశ్వరులని కలిపి పంచమూర్తులుగా పేర్కొంటారు. ఈ  పంచ మూర్తులకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. 

సర్వే సుజనా సుఖినో భవంతు.  

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore