Online Puja Services

ఏలూరు కమలాంబికా దేవి

18.223.171.12

నిజంగా జరిగిన సంఘటన

 మన పుణ్యభూమిలో ఆ భగవంతుడు తో సావాసం చేస్తూ ఆధ్యాత్మికం ప్రాణంగా జీవించిన ఎందరో మహానుభావులు ఉన్నారు 
అందులో ఏలూరు కమలాంబికా దేవి గారు ఒకరు 

లలితా సహస్త్రనామ పారాయణ గొప్పతనం గురించి ఈ లోకానికి తెలియజేయటానికి ఈ భూమ్మీద అవతరించిన మహానుభావులలో ఈవిడ ఒకరు..

రాజమండ్రి లో కొక్కొండం వెంకటరత్నం పంతులుగారు అని ఒకాయన ఉండేవారు ఆయన నిత్యం తనుమధ్యాంబికా దేవి ఉపాసన చేసేవారు .. ఈయన ఆ కాలంలోనె మొట్ట మొదటి మహామహోపాధ్యాయ భిరుదాంకితులు..  ఆయన ఉపాసనలో అమ్మవారి సాక్షాత్కారం పొందిన మహనీయుడు ఆయన అనుష్టానానికి ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండేది.. ఒకనాడు ఆయన ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల అకస్మాత్తుగా కనపడదు దాంట్లో ఇంట్లో అందరు కంగారు పడి ఊరు అంతా వెతికిస్తూ ఉండగా ఈ వెంకటరత్నం గారు ఇంటికి వస్తారు దాంట్లో ఇంట్లో అందరు పిల్ల అదృశ్యం సంగతి చెప్పగా ఆయన ఒక్కక్షణం కళ్ళు మూసుకుని చిరునవ్వుతో తన అనుష్టాన గది తెరిచి చూడగా పాప అక్కడ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆయన నెమ్మదిగా ఆ పాప దగ్గరకి వెళ్లి కదపగా కళ్ళు తెరుస్తుంది. ఆయన ఆ పాప తో తాళం వేసి ఉన్న గదిలోకి ఎలా వచ్చావ్ తల్లి అనగా ఏమో నాన్నగారు నాకు తెలీదు కిటికీ లోనుండి ఈ గదిలోకి చూస్తూ ఉండగా ఒకావిడ నన్ను లోపలకి పిలిచింది ఎలా వచ్చానో తెలీదు ఇప్పుడు లేపేవరకు ఏమైందో కూడా తెలీదు అంటుంది దాంతో ఆయన సంతోషించి నువ్వు కారణజన్మురాలివి అని దీవిస్తాడు.. ఆవిడే మన కమలాంబికా అమ్మ..

ఆవిడ నిత్యం పూజాలలో ఇంట్లో తండ్రితో పాటే కూర్చునేది ధ్యానం కూడా సాధన చేసేది కొన్నాళ్లకి ధ్యానస్థాయి మించి సమాధి స్థాయికి వెళ్లిపోయేది..

 ఆవిడ యుక్త వయసుకి రాగానే సత్యన్నారాయణ అనే ఆయనకి ఇచ్చి వివాహం చేసి కాపురానికి పంపుతారు అక్కడ కూడా ఈవిడ ధ్యానం చేస్తూనే ఉండేది భర్త ఈవిడ దగ్గరకి ఎప్పుడు వచ్చిన ఒక రకమైన భయం కలిగేది దాంతో కాపురం ఇద్దరి మధ్యలో సజావుగా జరిగేది కాదు..

ఒకనాడు ఆ దంపతులు ఈ సమస్య తో మద్రాస్ దగ్గర తిరువత్తియ్యుర్ అనే క్షేత్రం లో బాలాజీ స్వామి అనే ఒక యోగి ఉండేవారు.. ఆయన వద్దకి వెళ్లగా ఆయన ఒక్క క్షణం ధ్యానం లొకి వెళ్లి ఇద్దరికీ తలో మంత్రం ఇచ్చి మండలం పాటు ఇక్కడే ఆశ్రమం లో ఉండి ధ్యానం చేయండి అంటారు.. ఆ దంపతులు అలాగే ధ్యానం చేసిన తర్వాత స్వామి పిలిచి నీకు జరిగిన అనుభవాలు చెప్పు అని కమలాంబిక అమ్మ ని అడుగుతారు దానికి ఆవిడ ఇంతకుముందు ధ్యానం లో అమ్మవారు ఉగ్రం గా కనిపించేవారు ఇప్పుడు శాంతమూర్తి గా వాత్సల్యం తో కనిపిస్తోంది అంటుంది సరే ఇక మీ కాపురానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు వెళ్ళిరండి అని చెప్తారు ఆ స్వామితర్వాత వాళ్ళు ముంబై వెళ్లి కొన్నాళ్ళు కాపురం చెసి మళ్ళీ ఏలూరు వస్తారు వాళ్లకి సంతానం కలుగుతుంది..

రెండవ ఆడపిల్ల గర్భంలో ఉన్న సమయంలో ఆవిడకి స్వప్నం లో రెండు కోరలతో ఒక చిన్న పిల్ల తనకి పుట్టినట్టు కనపడుతుంది.. వెంటనే బాలాజీ స్వామి వారి దగ్గరకి వెళ్లగా ఆయన ధ్యానం చేసి నీ ఇంట్లో మరో కారణ జన్మురాలు పుడుతోంది ఇక్కడ నుండీ నీ జీవితం మొత్తం మారిపోతుంది అని చెప్తారు.

అలాగే కొన్నాళ్ళ తర్వాత రెండు కోరలతో ఒక పాప జన్మిస్తుంది కమలాంబికా అమ్మ రోజు లలితా పారాయణం, ఖడ్గమాల 22 రోజుల పాటు చేయగా ఆ కోరలు ఊడిపోతాయి పాప నిర్మలం గా నవ్వుతూ ఉంటుంది...

ఈవిడ చిన్నప్పటి నుండీ లలిత పారాయణం చేస్తూ ఉండటం అందరితోనూ చేయిస్తూ ఉండటం వల్ల ఆవిడకి అమ్మవారి కరుణ కలుగుతుంది..

ఈవిడ దగ్గరకి సమస్య అని వచ్చిన అందరితోనూ లలితా పారాయణం ఖడ్గమాల పారాయణం చేయించి పానకం నైవేద్యం గా పెట్టించేది చిత్రంగా వారు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు తీరిపోయేవి.. ఇలా అందరు వారి వారి సమస్యలు తీర్చుకుని ఆవిడకి ఏమన్నా తృణమో పణమో ఇవ్వబోతే నాకు ఇవన్నీ వద్దు మీరు మీ ఇంట్లో నిత్యం లలితా పారాయణం చెసి పానకం నైవేద్యం పెట్టండి అని కోరిన ఉత్తమురాలు..

ఎందరో భక్తులు ఆవిడ దగ్గర వారి వారి సమస్యలకి పరిష్కారం పొందారు...

ఒకనాడు ఆవిడ ఉన్న వీధి లో ఒకావిడకి అనారోగ్యం చేస్తుంది ఆవిడ ఎన్నో హాస్పటల్స్ తిరుగుతుంది కానీ నయం కాదు ఒకనాడు ఒక కోయవాడు కనికట్టు విద్య ఆవిడ ముందు ప్రదర్శించి ఆవిడ అనారొగ్యాన్నీ నయం చేస్తా అని నమ్మబలుకుతాడు ఆవిడ నమ్మి ఎంతో డబ్బు ఇస్తుంది ఒకనాడు ఆ దారి వెంట వెళ్తు కమలాంబికా గారు ఆవిడ ఇంటికి వచ్చేసరికి కోయవాడు చేసే వింత పూజలు చూసి ఏంటి ఇదంతా అని గద్దించేసరికి వాడు కమలాంబికా అమ్మ మోహంలో తేజస్సు, ఆగ్రహం చూసి బయపడి పారిపోతాడు తరువాత ఆవిడతో కమలాంబికా అమ్మ లలితా, ఖడ్గమాల పారాయణ చెసి పానకం నైవేద్యం గా పెట్టిస్తుంది కొంతసేపటికే ఆవిడకి స్వస్థత కలుగుతుంది ఇలా ఎవ్వరు ఏ సమస్యతో వచ్చిన ఈవిడ లలిత పారాయణ తోనే సమస్యకి పరిష్కారం చూపించేది..

ఒకనాటి రాత్రి కమలాంబికా అమ్మకి కల్లో అమ్మవారు కనిపించి నీ బిడ్డకి త్వరలో గండం ఉంది అంటుంది మరి పరిష్కారం చెప్పు తల్లి అని కమలాంబికా అమ్మ కోరగా నీకు నేను పరిష్కారం చెప్పాలా ఎలా తగ్గించుకోవాలో నీకు తెలీదా అని చెప్పి అదృశ్యం అవుతుంది అన్నట్టే కొన్ని రోజులకే ఆ పాప ఆడుకుంటూ కింద పడిపోయి కాళ్ళు చేతులు వెంటనే ఆ పాప ని తీసుకుని పూజ గదిలోకి వెళ్లి నాకు తెలిసిన మార్గం నువ్వే తల్లి అంటూ తన్మయత్వం తో లలితాసహస్త్రనామ పారాయణ ఖడ్గమాల తో చెసి నైవేద్యం పెట్టడానికి కళ్ళు తెరిచి చూడగా పిల్ల మాములుగా ఉండి ఒళ్ళో ఆడుకుంటూ ఉంటుంది దాంతో కమలాంబికా అమ్మ సంతోషించి అమ్మవారికి నైవేద్యం పెడుతుంది..

ఆ రోజు స్వప్నం లో తల్లి సాక్షాత్కారం ఇచ్చి నీకు నేను అనుగ్రహించిన శక్తిని ఏనాడూ నువ్వు స్వార్దానికి వాడుకోలేదు నీ నిష్కల్మష భక్తి నాకు నచ్చింది నీకు వాక్సుద్ది ఇస్తున్నాను ఇవాళ్టి నుండి నీ పూజ గదిలో నేను కొలువై ఉంటాను ఆ గదే నా పీఠం లా మారుతుంది అని ఆశీర్వదిస్తుంది...

మర్నాడు ఆవిడ కళ్ళు తెరిచేసరికి పూజ మండపం లొకి బాలాదేవి విగ్రహం వచ్చి ఉంటుంది ఆవిడకి ఇది అమ్మ దయే అని అర్ధం అవుతుంది..
ఇలా ఎన్నో సంఘటనలు ఆవిడ వల్ల జరిగాయి..

ఆవిడ తన వాక్ సుద్ది ని కానీ తన శక్తిని కానీ ఏనాడూ తన స్వార్ధానికి వాడుకోలేదు ఆపద అని వచ్చిన అందరికి లలితా పారాయణం ఖడ్గమాల సహితం గా చేయమని చెప్పి నైవేద్యం గా పానకం పెట్టమనేది......దాంతోనే వారి సమస్యలు తీరేవి గండాలు గట్టేక్కెవి.. 

 అందరికి శుక్రవారం దీక్షలు ఇచ్చేదీ నవరాత్రులు కటిక ఉపవాసం ఉంటూ అమ్మవారి సేవ చేసేది.. అమ్మవారి సేవలోనే ఆవిడ తన జీవితం అంతా ముగించింది..

ఇప్పటికి ఏలూరు లో
old కరెంటు ఆఫీస్ రోడ్డు
అగ్రహారం
Tucu బ్యాంకు దగ్గర ఆ ఆశ్రమం ఉందీ

 ఆ ఆశ్రమం లో ఉన్న ప్రతి విగ్రహం వెనకాల
ఏదోక సంఘటన కి సాక్షం గా ఉన్నదే...

అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 

- B . సునీత 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya