దూర్వాస మహాముని జననం కధ

35.175.191.36
ఓం శ్రీ గురుభ్యోనమః
 
"దూర్వాస" మహర్షి అంటే కోపానికి ప్రతి రూపం అనే మన అందరికి తెలుసు. 
ఆయన మహా సిద్ధుడు..

మహాయోగి... తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి వుంది ఆయనకు.
ఆయన చిరంజీవి...

మహా మంత్ర శాస్త్రాలన్నీ ఆపోసన పట్టిన  మహాత్ముడు
పుణ్య వంతుడు...ప్రజ్ఞా శీలి... 
 
ఆయన జన్మ గురించి రెండు రకాల కధలున్నాయి.
 
పూర్వం "త్రిపురాసుర" సంహారం చేసి... 

శివుడు చంకలో ఒక బాణం పెట్టుకుని వస్తున్నాడు.
దారిలో ఇద్దరు దేవ పురుషులు కనిపించారు. 
వారికి శివుడి చంకలో వున్న "బాణం" శిశురూపం లో వున్న  "శివుని" లాగా కన్పించిందట.
 
వారు శివుణ్ణి... ఆ శిశువు ఎవరు అని అడిగారు.
అప్పుడు శివుడు ఆతడు తన కుమారుడని... 
పేరు "దూర్వాసుడు" అని చెప్పాడు. 
వెంటనే ఆ బాణం శివానుగ్రహం తో శిశువు గా మారి... క్రమ క్రమం గా పెరిగి... మహా మేధావి, జ్ఞాని అయిన "దుర్వాస మహర్షి" గా వృద్ధి చెందాడు.
ఇది దూర్వాసుని గురించిన మొదటి కధ.
 
రెండవ కధ...
 
"అత్రి" మహర్షి భార్య అనసూయా దేవి...
మహాపతి వ్రత. 
అనసూయ దేవి.. దేవ హోతీ, కర్దము ల కుమార్తె .
 
అత్రి, అనసూయలు  ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకొంటు వున్నారు.
 
ఒక సారి త్రిమూర్తులైన బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు... తమ వాహనాల మీద తిరుగుతూ...
అత్రి మహర్షి ఆశ్రమం మీదగా ప్రయాణిస్తుంటే ఆ వాహనాలు కదల కుండా ఆగి పోయాయి. 
 
అప్పుడు గరుత్మంతుడు విష్ణు మూర్తి తో ”స్వామీ...కింద "అత్రి మహా ముని" ఆశ్రమం వుంది.
దాని మీద నుంచి... దానిని అతిక్రమించి ఎవరు పోరాదు...
పోవటం సాధ్యం కూడా కాదు ”అని విన్నవించాడు.
సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్ళారు. 
 
అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది.
అత్రి మహర్షి అంతటి మహిమాన్వితుడా... అయితే పరీక్షించాలి అనుకొన్నారు.   త్రిమూర్తులు...బ్రాహ్మణ వేషాలు వేసుకొని అత్రి మహర్షి ఆశ్రమం చేరారు.
ఆకలి గా వుందని తమకు భోజనం పెట్టమని మహర్షిని వేడుకొన్నారు .
 
మహాసాధ్వి అనసూయా దేవి...భర్త అనుమతి తో వారికి పీటలు వేసి విస్తళ్ళు పరిచి వడ్డించటానికి సిద్ధ పడింది.
 
అప్పుడు ఆ బ్రాహ్మణ వేషం లోని త్రిమూర్తులు ”అమ్మా !మాకు ఒక నియమం వుంది.
మాకు వడ్డించే వారు దిసమొల తో వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాం అన్నారు. 
 
వీరిని గుర్తించిన సాధ్వి వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది.
వారు పసి పాపలు గా మారి పోయారు. 
అప్పుడు వారికి వారు కోరినట్లే వడ్డించి మళ్ళీ నీళ్ళు చల్లింది. మళ్ళీ యధా రూపం పొందారు. 
 
వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసి పాపలు గా మార్చి ఉయ్యాల లో ఊపుతూ పెంచసాగింది.
 
అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాక పోయేసరికి...
ఏదో కీడు శంకించి... 
చివరికి వారు అత్రి ముని ఆశ్రమం లో అనసూయమ్మ ఒడిలో పెరుగు తున్నారని 
తెలుసు కోని... వెంటనే అక్కడికి చేరారు.
 
తమ నాదులను తమకు ఇవ్వ వలసినది గా అనసూయా దేవిని ప్రార్ధించారు.
జగన్మాతలు తమ ఆశ్రమం కు వచ్చిన కారణం తెలుసు కొన్న అనసూయ దేవి వారి అతిధి మర్యాదలు చేసి సభక్తి గా పూజించించింది.
 
వారి కోరికను మన్నించి ఆ పసి బాలురను మళ్ళీ త్రిమూర్తులను గా మార్చి వేసింది.
 బ్రహ్మ విష్ణు ,మహేశ్వరులు ఆమె కు వరాలు ఇవ్వాలని అనుకొంటున్నామని కోరుకోమని విన్నవించారు.
 
ఆ అమ్మ... త్రిమూర్తులు తనకు కుమారులు గా జన్మించి...ఆసలైన పుత్ర ప్రేమ ను కల్గించమని కోరింది.  తధాస్తు అన్నారు.  
కొంత కాలం తర్వాత...
బ్రహ్మ అంశ తో... అనసూయ గర్భం లో "చంద్రుడు" జన్మించాడు.
విష్ణువు అంశ తో... "దత్తాత్రేయ" మహర్షి ...
శివాంశ తో "దూర్వాస" మహర్షి ఆమెకు జన్మించారు. ఇలా దూర్వాస మహర్షి...
 
మహా తపస్సంపన్ను లైన అత్రి ,అనసూయ దంపతులకు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు అని రెండో కధ వివరిస్తోంది.
 
  హర హర మహాదేవ శంభో శంకర 
 
         ఓం నమఃశివాయ
 
- సత్య వాడపల్లి 

Quote of the day

The one excellent thing that can be learned from a lion is that whatever a man intends doing should be done by him with a whole-hearted and strenuous effort.…

__________Chanakya