ఇండియా పాజిటివ్

3.236.175.108

కుందేలు తాబేలు కథ అందరికీ తెలిసిందే. అయితే, అది సగ భాగం మాత్రమే; తర్వాత ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు, మనమూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక అడవిలో చెంగు చెంగున ఎగరగలను అనుకునే కుందేలు, తాబేలు ని చూసి నీలా నెమ్మదిగా నడిచే జీవి ని నేను ఎప్పుడూ చూడలేదు అంటే...అప్పుడు తాబేలు కుందేలుతో నాతో పరుగుపందెం పెట్టుకొని చూడు అంటుంది.  
పరుగు పందెం ప్రారంభమవుతుంది. కుందేలు చెంగు చెంగునా చాలా దూరం వెళ్ళి వెనక్కు తిరిగి చూస్తే తాబేలు కనుచూపుమేరలో కూడా లేదు. అప్పుడు కుందేలు తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుందిలే అని చెట్టు క్రింద పడుకుంటుంది.. తాబేలు మాత్రం అడుగులో అడుగు వేసుకుంటుంటూ 2 రోజులు ఎక్కడా ఆగకుండా నడిచి గమ్యస్థానానికి చేరుతుంది. పరుగు పందెం లో తాబేలు గెలిసింది, కుందేలు ఓడిపోయింది.

గర్వం ఉండకూడదు అనేది నీతి అని అందరూ వినే ఉంటారు. నిజానికి  ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే. సెకండ్ హాఫ్ లో నేను వెళ్ళి కుందేలు ని అడిగా..నీకు అంత సోమరితనం, బలుపు ఎందుకు అని..అయ్యో అందరిలానే నీవూ పొరపాటు పడ్డావా, అసలు ఏమి జరిగిందో తెలుసా అని కుందేలు చెప్పటం ప్రారంభించింది.

మా పోటీ ఒక మైదానం నుంచి ప్రారంభం అయ్యింది. నేను వేగం గా పరిగెత్తుతూ ఉంటే మైదానం పక్కన ఒక కొండ కనిపించింది, దాని పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కనుచూపు మేరలో లేదు. మా పోటీ 2 రోజులు ఉంటుంది, ఆరోగ్యం గా ఉండాలి అంటే నాకు చాలినంత నిద్ర కావాలి కాబట్టి మర్రి చెట్టి క్రింద కొద్దిసేపు నిద్రించా. 

కొద్దిసేపటికి తాబేలు వచ్చి నా సామర్ధ్యం ఎక్కువ, విశ్రాంతి తీసుకోకుండా నేను ఎన్ని రోజులు అయినా నడవగలను అని ప్రగల్భాలు పలికింది. నాకు ఏమో మర్రి చెట్టు నీడ ఒక గొడుగులా అనిపించింది.
నేను లేసి కొంచెం ముందుకు పరిగెత్తితే ఒక సరస్సు కనిపించింది, సరస్సులో ఒక పెద్ద దుంగ తేలుతూ ఉంటే దాని మీద నించొని అవతలి ఒడ్డుకు చేరాను. ఒక పెద్దాయన కనిపించాడు. ఎవరు నీవు అని అడిగితే నేను ఒక పరుగు కుందేలు ని, ఒక తాబేలు నన్ను ఛాలెంజ్ చేస్తే దానితో పరుగుపందెం లో ఉన్నాను అని చెప్పాను. 

గెలిస్తే నీకు ఏమొస్తది అని అడిగాడు. మెడల్ వస్తుంది అని చెప్పాను. ఆ మెడల్ తో ఏమి చేసుకుంటావ్ అని అడిగితే అమ్మి ఆహారం కొంటాను చెప్పాను. ఈ అడవిలో ఇంత ఆహారం ఉంటే ఆ మెడల్ తోనే సంపాదించాలా అని చెప్పాడు పెద్దాయన. మరి, నాకు వేగం గా పరిగెత్తగలిగే కుందేలు అన్న బిరుదు, గౌరవం కూడా వస్తుంది కదా అని చెప్పాను. 

100 సంవత్సరాల క్రితం ఈ అడవిలో వేగం గా పరిగెత్తిన జింక పేరు నీకు తెలుసా..? అతి పెద్ద ఏనుగు పేరు నీకు తెలుసా..? బలమైన సింహం పేరు నీకు గుర్తు ఉందా..? అని పెద్దాయన అడిగాడు. లేదు నాకు తెలియదు అని చెప్పాను. 

ఈ రోజు తాబేలు తో గెలిశాక రేపు ఒక పాము ఛాలెంజ్ చేస్తుంది, ఎల్లుండు ఒక జీబ్రా తనతో పోటీ పడమని అడుగుతుంది. జీవితాంతం నిన్ను నీవు ప్రూవ్ చేసుకోటానికి, వేగం గా పరిగెత్తగలను అని చూపించుకోటానికే నీ జీవితం కేటాయించుకుంటావా, ఈ పనులు వ్యర్ధమైనవి అని చెప్పి వెళ్ళిపోయాడు. 

నాకు జ్ఞానోదయం అయ్యి సరస్సు ఓడ్డున ఉన్న చెట్టు క్రింద కూర్చొని సరస్సులోని బాతులని చెట్టు మీద పక్షుల రాగాలని వింటున్నాను. అప్పుడు ఒక బాతు వచ్చి.. అవును, తాబేలు తో పోటీ లో ఉండాలి కదా, ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగింది. జీవితం రన్నింగ్ రేస్ కాదు, నేను ఎవరితో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా బలం నాకు తెలుసు, బలహీనత నాకు తెలుసు అని చెప్పాను. సాయంత్రం ఒక నక్క వచ్చి..తాబేలు గమ్యస్థానానికి చేరి గెలిసింది. ఎక్కడా ఆగకుండా 2 రోజులు నడిచేసరికి గమ్యస్థానానికి చేరిన 10 నిమిషాలకే మరణించింది అని చెప్పింది.

ఇది అసలు జరిగింది అని కుందేలు నాతో క్లియర్ గా చెప్పింది. ప్రపంచం అంతా అజ్ఞానం లో ఉన్నప్పుడు విజ్ఞానాన్ని ప్రసాదించిన దేశం మనది. ఆస్కార్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయి..? నోబెల్ బహుమతులు ఎన్ని వచ్చాయి, ఇండియా ఎందుకు గ్రేట్ అని ఈ సీరిస్ రాయటం స్టార్ట్ చేశాక కొందరు అడిగారు. నా సమాధానం ఇదే; ఇక్కడ కుందేలు ఇండియా, తాబేలు మిగతా ప్రపంచం. ఎక్కడా ఆగకుండా ప్రపంచం పోతూ ఉంది కరక్టే; తర్వాత ఏమవుతుంది, ఏమైంది తాబేలు కి..? ఇప్పుడు అయితే క్లియర్ గా తెలిసింది కదా. 

ఈ శతాబ్ధం లో అత్యంత తెలివైన స్టీవ్ జాబ్స్ మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు ఏమన్నాడు..? జీవితం పరుగు పందెం కాదు, ఈ ఆవిష్కరణలు ఏవీ మరణాన్ని ఆపలేవు. అవార్డ్స్, సాధించిన విజయాలు ఏవీ నాకు బదులు అవి  నా మరణాన్ని తీసుకోలేవు. ఉన్నన్ని రోజులు ప్రశాంతం గా కుటుంభం తో భారతీయుల్లా జీవించాలి అన్నదే స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటల సారాంశం. 

అందుకే నేను అంటాను...భారతీయతే ఈ ప్రపంచానికి గురువు. మన జీవన విధానమే అత్యున్నతమైన జీవన విధానం.ఎవర్నో కాపీ కొట్టి వాళ్ళ లాగే అనవసర పరుగులు తీయాల్సిన అవసరం లేదు, పోల్చుకోవాల్సిన ఆవశ్యకత అంత కంటే లేదు.

ఇండియా పాజిటివ్ లో భాగం గా సనాతమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి, ఆధునికమైనా మంచి ఉంటే స్వీకరించాలి.

Quote of the day

There is nothing more dreadful than the habit of doubt. Doubt separates people. It is a poison that disintegrates friendships and breaks up pleasant relations. It is a thorn that irritates and hurts; it is a sword that kills.…

__________Gautam Buddha