సృష్ఠి లోని సమస్త జీవులు — వాటి జన్మ సార్ధకత

3.236.175.108

బ్రహ్మ విద్య 

ఓం శ్రీ అచ్యుతార్పణమస్తు

సృష్ఠి లోని సమస్త జీవులు — వాటి జన్మ సార్ధకత  

సృష్ఠి లోని ప్రతి జీవి దైవ నిర్ణయ ప్రకారం తమ జన్మ సార్ధకతను చేసుకొని పోతున్నాయి –ప్రకృతికే పచ్చదనమైన అందాన్నిస్తూ — జీవులకు కనువిందు చేసే రంగు రంగుల — రమ్యమైన కళాకాంతులతో –మనో ఉల్లాస పరుస్తూ — జన్మ సార్ధకత చేసుకుంటూ –పరోపకార బుద్ధితో ఈ సృష్ఠి లోని సమస్త జీవులకు అందించి — మీరు నియమించిన నియతి ప్రకారముగా

పూర్తి చేసుకొని పోతున్నాను ప్రభో ! — కర్మానుసారముగా నాకు వచ్చిన ఈ జన్మలను పూర్తి చేసుకున్న తరువాత మంచి జన్మ అయినట్టి — జ్ఞాన వంతమైనటువంటి మానవ జన్మ ఇవ్వగలరని మిమ్ములను ప్రాధేయ పడుతున్నాను దైవమా !! — సృష్ఠి లోని సమస్త జీవులు విజ్ఞానవంతమైన మానవ జన్మ యొక్క ప్లాట్ ఫామ్ కు రావాలని
ఉవ్వి ళ్లూరుతున్నాయి –ఆ జీవులన్ని ఎలాగ సమస్త జీవులకు నిస్వార్ధముతో సహకారము అందిస్తున్నాయో పరిశీలిద్ధాం ? –మానవ ప్లాట్ ఫామ్ లో వున్న మనము బుద్ధిగల జీవులము — ఎలా అన్ని జీవులకు తమ సహకారాన్ని అందిస్తున్నామో అవగాహన చేసుకుందాం .

1. వృక్షాలు :
A. విస్తారమైన వృక్షాలు:– వనాలు లేనిదే వర్షాలు రావు. — త్యాగులు యోగులు వున్ననాడే జ్ఞానవర్షం కురుస్తుంది — ఆడంబరం లేకుండా అభ్యుదయానికి సహకరించడం , హడావుడి లేకుండా సేవలు చేయడం అలవాటై పోయింది –అందుకే ఋషులకు , మునులకు అడవులంటే, చెట్లు అంటే ఇష్టం .
చెట్లు తమ కొమ్మలు అనే చేతులను వూపుతూ నీకు చల్లని గాలినిస్తాయి — హాయినిస్తాయి –చేతులున్నది ఇతరులకు సహకరించేందుకే అని , మనిషికి సందేశమిస్తాయి — చెట్టు కొమ్మలు కరెంటు తీగలకు అడ్డు వచ్చాయంటూ నరికివేస్తున్న వద్దని వారించవు — ఓ మానవా ! ఇది మీకు న్యాయమా ! అని ప్రశ్నించవు — మా చేతులు పోయినా పర్వాలేదు కాని మీ ఇళ్ళల్లో

దీపాలు వెలిగితే అదే పదివేలు అంటాయి. — అందుకే తరువులకు త్యాగమే నిలయము
చెట్టు త్యాగమయీ — అనురాగమయీ — మనము వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని జీవులకు కావలసిన ఆక్సీజన్ ను మానవునికి కావలసిన ఔషద గుణములు కలవాటిని ఎన్నింటినో అందిస్తాయి — అంతే కాకుండా ఆకులను, పూలను, కాయలను, పండ్లను ఇస్తూ తమ జన్మ సార్ధకత చేసుకుంటూ చివరన మన ఇంటిలో తలుపులు, దర్వాజలు, వంట చెరకు,

బల్లాలు , బేంచీలు , కుర్చీలు, ఇంటి పైకప్పులుగా మారి మనకు, మన ఇంటికి రక్షణనిస్తాయి — సాయంత్రమయితే గూటికి పక్షులు రాలేదని ఆవేదనపడుతూ చెట్లు చలించిపోతాయి — మన పిల్లవాడు సాయంత్రమై చీకటి పడుతున్నా ఇంటికి రాని యెడల మనము ఎలా కంగారు పడుతూ మానసికంగా చలించి పోతామో అదే విదంగా చెట్లు కూడా పక్షులు రానిచో

అల్లాడి పోతాయి — తన చేతులైన కొమ్మల ద్వారా ఊపుతూ పిలుస్తుంది — అలిసిన పక్షులు గూటికి చేరగానే చెట్టు శాంతిస్తుంది — వాటికి నిద్రాభంగము కలుగకుండా, కదలకుండా, మెదలకుండా, నిశ్చలంగా ఒక యోగిలా వుంటుంది.
తన వేళ్ళు భూమిలో కూరుకు పోయినా — సేవ చేయాలనే ఉత్సాహంతో ఊర్ధ్వంగా పెరుగుతుంది. — బాధల్లో మానవుడు కూరుకు పోయినా భగవంతుని వైపు ఊర్ధ్వంగా సాగే మనసును తయారు చేసుకొమ్మని మనకు సందేశమిస్తుంది. — తన పెరుగుదలలోని రహస్యము నీ ఎదుగుదలకు ఆదర్శమంటుంది.
ఆచార్యులైన ఋషులకు , మునులకు, తపోధనులకు వృక్షాలే ఆధారాలు — వృక్షాల నాశ్రయించి గురువులు ధ్యాన్న నిమగ్నులైనారు — చెట్లకు, ఋషులకు మల్లె స్వార్ధము తెలియదు — సమీపిస్తే చాలు చెట్టు — నీడనిస్తుంది — ఫలాల నిస్తుంది — తమతర బేధం లేకుండా ఇస్తుంది — ప్రతిఫలం ఆశించకుండా ఇస్తుంది — వాతావరణ కాలుష్యాన్ని నిర్మూ

లిస్తుంది — చెట్టు ఒక గొప్ప తపస్విని లాగా — నిలుచుండి తపస్సు చేసిన దృవుని లాగా — అలా నిలబడే ఉంటుంది — కూర్చోవటం తెలియదు — నిద్రించడం ఎరుగదు — ఎంత ఘోరమైన తపస్సో ? అందుకే ఋషులకు వృక్షములు అంటే ప్రేమ.
చెట్లు ద్వంద్వాలను అధిగమించి జీవిస్తాయి. — ఎండను వహిస్తాయి — వర్షాన్ని సహిస్తాయి — శీతోష్ణాలను సమంగా భావించి జీవించడం యోగి లక్షణం కదూ ! — అంతేకాదు తాము ఎండను భరిస్తూ — ఆశ్రితులకు చల్లదనాన్ని అందిస్తాయి — గొడుగు పట్టినట్లు రక్షిస్తాయి — చెట్లు నిస్వార్ధ త్యా గులు కూడా.
రాగ ద్వేషాలు ఎవరిలో అదృశ్యమైనవో అట్టివారు నివసించే గృహం తపోవనం అన్నారు — సర్వులను సమా నంగా భావించి ప్రేమించే వృక్షాలు రాగద్వేషాలను అధిగమించాయి — అథిది సేవలో ఆనందిస్తాయి. ” అథిది దేవో భవా ” అనే శృతి ప్రమాణాన్ని అక్షరాల అమలు చేస్తాయి — నీ గృహానికి అరుదెంచిన అథిది నీకు దైవమగు గాకా ! అనే వేదవాణికి

అద్ధం పడుతున్నాయి — కనుకనే చెట్లు నివసించే ప్రదేశాలను వనాలు అంటారు — వాస్తవానికి అవి తపోవనాలు.
ఈ జగడాల జగత్తులో ఆగడాలు ఆగవు — నిందాస్తుతుల్నీ, మానాభిమానములను సమానంగా స్వీకరించు వారే నాలాగా పచ్చగా జీవించగలరు అని చెట్లు సందేశమిస్తున్నాయి — అంతేకాదు ఆచరించి చూపిస్తాయి — కోకిల మధురరావాన్ని — కాకి గోలను సమంగా స్వీకరిస్తాయి చెట్లు — తమస్సులో పడి మేనువాల్చిన బుద్దునికి — చెట్టు కిందనే జ్ఞానోదయం

కలిగింది — పైరు గాలికి పైటను కదిలిస్తూ — కొండగాలికి కొంగును ఝాడీస్తూ — ఏటిగాలితో కలిసి ఎగిరే చెట్టు నాట్యము ఎంత సుందరమో! — గాలి శృతి నందుకొని చెట్టు పాడేపాట ఎంత సుమధురమో ? — ఎంతని చెప్పిన చెట్టు గురించి తక్కువే — ఇంత ఉంది గనుకనే తరువులకు — గురువులకు స్నేహము కుదిరింది — వృక్షాలకు, ఋషులకు సఖ్యమేర్పడింది —

తమలో ఎంత జ్ణానమున్న సామాన్యంగా కనిపించడం ఋషుల ప్రవృత్తి — అలాగే తమలో ఎన్నో రకాల గుణాలు కలిగి ఉన్నప్పటికీ నిరాడంభరంగా కనిపించడం చెట్ల ప్రవృత్తి — చెట్టు చిగురిస్తుంది — పళ్లనిస్తుంది — పుష్పిస్తుంది — ఆ తరువాత ఫలిస్తుంది.
B. తీగజాతి మొక్కలు :– తీగజాతిలో ముఖ్యముగా సుగందద్రవ్యాలు అయిన లవంగాల , మిరియాల, యాలకుల, తమలపాకుల లాంటి ఎన్నో రకాల తీగజాతులు తమలోని విలువైన ఔషదగుణములను మానవులకు అందిస్తూ తమ జన్మ సార్ధకత చేసుకుంటున్నాయి.
C. దుంప జాతులు :– ఈ దుంప జాతి అయిన ఆలుగడ్డ, కందగడ్డ, చేమగడ్డ, మొగరంగడ్డ , క్యారెట్టు, జాజిరిగడ్డ లాంటి మొదలైన చెట్లు — రకరకములైన తమ స్వాభావిక రీత్యా ఆకృతిని ఏర్పరుచుకొని — గడ్డలుగా మారి ఎంతో విలువైన పోషక పదార్ధాలతో నింపి ఈ మానవ సమాజానికి అందిస్తూ — తమ జన్మ సార్ధకత నిలబెట్టుకుంటున్నాయి.
D. గింజ జాతి మొక్కలు :– గింజ జాతుల నిచ్చే చెట్లు తమ తమ రుతుక్రమములో పుట్టుతూ — పెరుగుతూ జీవులకు కావల్సిన ఇందనముగా శక్తిని ఇచ్చు విటమిన్సును — ఎంజైమ్సును — మినరల్సును — అయిల్ ను — కార్బో హైడ్రేట్సును మొదలగునవి మన దేహమునుకు — దేహములోని భాగములకు కావలిసిన — పోషక పదార్థములను కలిగివుండి మన

భోజనమునకు ఉపయోగపడుతున్నాయి. ఉదహారణకు — వరి గింజ — ఆహారమునకు, పప్పు గింజలు — కూ రలుగను, గోధు మలు — చపాతీలుగను, సజ్జ, జొన్న మొదలగు గింజలు మనకు నిత్య జీవితములో — నిత్యము వాడకములో ఉన్నాయి. ఈ గింజ జాతి మన దేహ యంత్రము నడవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి — అవి లేని రోజు మన జీవ యంత్రము

కొనసాగలేదు –అన్ని పోషక పదార్థాలనిచ్చి అవి తమ తమ మనుగడను — జీవిత సాఫల్యాన్ని పొందుతున్నాయి — అంతే కాకుండా పశుపక్షాదులకు — క్రిమి కీటకాలకు కూడా ఆహారంగా మారుతుంది — ప్రతి జీవికి క్షుద్భాద ఆగాలంటే గింజల యొక్క చెట్లే ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి –సాధ్యమైనంత వరకు జీవుల ప్రాణాలను నిలబెట్టడములో ప్రధాన

పాత్ర వహిస్తూ తన జీవిత సార్ధకతను పూర్తి చేసుకుంటున్నాయి .
E. కాయగూరల జాతి చెట్లు:– ఈ కాయ గూరలు తమ దేహము నిండా ఎన్నో రకాల విటమిన్సును — మినరల్సు లాంటి శక్తినిచ్చు పదార్థములను తమలో ఇముడ్చుకొని అన్ని రకాల జీవులకు ఆహార పదార్థం గాను వెలసిల్లుతున్నాయన్న సంగతి మీ అందరకు తెలిసిందే — ఒక కాయ రూపములో వుండి మన దేహమునకు కావలసిన పోషక పధార్థాలను అందిస్తూ తమ

జన్మ సార్ధకత చేసుకుంటున్నాయి.
F . ఆకు కూరల జాతి :– అనేక రకములైన ఆకు కూరల జాతి తన పలుచటి అకులలో ఎన్నో రకములైన అమోఘమైన వస్తు గుణములు కలిగి — సృష్టి లోని ప్రతి జీవులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి — వెలకట్ట లేని పోషకాలను ధరించియున్న ఈ ఆకుల చెట్లు అన్ని రకాల జీవులకు ఎంతో మేలు చేస్తూ జన్మ సార్ధకత చేసుకుంటున్నాయి.
G . పుష్ప జాతి మొక్కలు :– ఈ పుష్ప జాతి మొక్కలు ఒకే రకమైన నేలలలో, ఒకే రకమైన కుండీలలో — జన్మించినప్పటికి — అవి తమ జన్మ ధర్మ నియతి ప్రకారముగా పెద్దవై — వివిధ రంగులలో –అ నేకమైన సువాసనలు వెదజల్లుతు — మనసుకు మనోరంజకమై — కన్నులకు కనువిందై — చూపరుల దృష్టి మళ్లించనిదై — ఎన్నో రకాల ఆనందాలకు నిలయమై —

నిత్యము గుభాళిస్తూ — దైవార్చనలో ప్రధాన పాత్ర పోషిస్తూ — ఆడవారి జడల అలంకరణలలో, ముద్దులోలికే బుజ్జి పాపాయిల కొప్పులలో — రాజకీయ నాయకుల మెడలలో — ఉద్యోగ విరమణ సంధర్భములలో — పెళ్లి మంటపాలలో — వధూ వరుల మె డలలో — తొలినాటి సన్నివేశాలలో — పసికందుల జన్మ ఉత్సవాలలో — ముగింపు యాత్రలలో — అలంకార తోరణాలై —

అందరిని ఆకర్షిస్తూ ఆహ్లాదపరుస్తూ — తన మనోహరమైన సువాసనలను వెదజల్లుతూ — మైమరపిస్తూ — ముద్ద బంగారముగా వుంటూ తను వచ్చిన జన్మ — ధర్మ — నియతి — నియమాలను — నిర్వర్తిస్తూ తన జన్మ సార్ధకత చేసుకొని హే బ్రహ్మా! నన్ను ఈ జన్మ నుండి — మానవ ప్లాట్ ఫామ్ కు పంపించమని వేడుకుంటున్నాను.
H . కాయ మరియు పండ్ల జాతి చెట్లు:– ఈ కాయ మరియు పండ్ల జాతి చెట్లయిన కొబ్బర — జామ — బోప్పాయి — దాన్నిమ్మ — అరటి — కర్జూర — తాటి — ఈత — నిమ్మ — బత్తాయి — గుమ్మడి — దోస — బీర — చిక్కుడు — ఫైనాఫిల్ లాంటి ఎన్నో రకాలైన — ఎంతో విలువైన — ఎన్నో పోషక పదార్థాలు — వెల కట్టలేనివి అంది స్తూ తమ తమ — జన్మ సార్ధకత చేసుకుంటున్న

విషయము మీ అంద రికి తెలిసిన విషయమే.

2. జంతువులు :– అలాగే పై వాటి ప్రకారంగానే ప్రతి జీవి A. పాలు ఇచ్చు గేదె జాతులు B. శ్రమించు ఎద్దు — గుర్రము — ఏనుగు — గాడిద మొదలగునవి C. విశ్వాసము గల కుక్క మొదలైనవి D. అడవులను రక్షించు క్రూరమృగాలు — అడవులను రక్షించడమే కాకుండా తమ చర్మా లతో — అనేకమైన — అలంకారమైన వాటిని తయారు చేస్తారు జంతు వినియోగము

నిత్య జీవితములో ఎంత ఉపయోగమో — మీ అందరికి తెలిసినదే .

3. పక్షి జాతులు :– పక్షి జాతుల వినియోగము మీకు వేరే చెప్పనవసరం లేదు — అవి తమ జన్మను సార్ధకత చేసుకుంటూ సమాజానికి ఎంతో మేలు కలిగిస్తూ — భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు గరుఢ వాహనమైన సంగతి మీ అందరికి తెలిసిందే — సరస్వతి దేవికి హంస వాహనమై — భగవాన్ శివుని పుత్రుడైన కుమార స్వామికి నెమలి వాహనమైన విషయం జగమెరిగిన

సత్యమే — తమ తమ గొంతు ద్వనులతో కిలకిలరావాలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తూ — మైమరపిస్తూ ఇలాంటి ప్రముఖుల అందరికి వినియోగ పడుతున్న ఈ పక్షి జాతి అవి తమ తమ జన్మలు సార్ధకము చేసుకొని మానవ — ప్లాట్ ఫామ్ కు ఎదురుచూస్తున్నాయి.

4. నీరు దాని స్వభావము :– నీరు భూ భాగములో నాల్గింట మూడు వంతులు ఆక్రమించి — అదే విధముగా మన దేహములో కూడ వుండి జీవన యంత్రాన్ని — నడిపియ్యడమే కాకుండా తను ఆవిరిగా మారి మేఘంగా ఏర్పడి — వర్షించి నేల తల్లిని తడుపుతూ — పంటలు పండిస్తూ — ఈ జీవ కోటికి ఆధారభూతమై — వర్షించిన నీరు తిరిగి తన యధా స్థానమునకు

చేరుకోవాలన్న తపనతో ఒక్కొక్క — చినుకుబొట్టు ఒక కాలువగా — వాగుగా — నదిగా ఏర్పడి పారుతూ –బిరబిరా తన గమ్యమైన సముద్ర గర్భము చేరుతుంది — అంటే తన విధ్యుక్త ధర్మాన్ని తూచ తప్పకుండా నిర్వర్తిస్తూ — జీవకోటి మనుగడకు ఎంతో ఆధారభూతమౌతుంధి — దానిని చూసి మనము కూడ నేర్చుకొని వచ్చిన యధాస్థానము చేరుకోవాలి.

5. సృష్టిలోని అన్ని జీవులు తమ విధ్యుక్తధర్మాలను పాటిస్తున్నాయని పై విషయాలను చదివితే — వింటే — సూక్ష్మ మనసుతో — ఆలోచిస్తే మనకు అందులోని ఆంతర్యము గోచరిస్తుంది — ఓ మానవా! నీవు ఈ జగడాల ఝంజాట సంసార బంధంలో చిక్కుకొని — వచ్చిన మార్గము మరచి — చేరు కోవలసిన గమ్యం చేరుకోక — జన్మ జన్మాంతరాలుగా — ఈ కర్మ బంధములో

పడి కొట్టుమిట్టాడుతు అఘోరిస్తున్న ఓ ధీనమానవా! ఇప్పుడైనా — ఈ మానవజన్మలో కండ్లు తెరిసి — విజ్ఞానవంతుడవై — ఎక్కడినుండి వచ్చావో — అక్కడికి చేరుకొను ప్రయత్నం చేసుకో — ఈ మానవ ప్లాట్ ఫామ్ కొరకు — సృష్టిలోని ప్రతి జీవి పరితపిస్తుంది — కాని మానవ ప్లాట్ ఫామ్ లో ఉన్న నీవు ఆద మరిచి నిద్ర పోవటం బావ్యమా? — ఇది నీ వెంట రాదని తెలిసినా —

ముందు తరాల వారు చెప్పినా — ఎందుకీ ఆరాటము — ఈ ఆజ్ఞాములో పడడం — విజ్ణానవంతుడవైన ఓ పుణ్యజీవుడా — ఇకనైనా కండ్లు తెరువు — ఈ గాడాంధకారమైన ఆజ్ఞానము నుండి బయట పడాలని — మిమ్ములను ప్రాధేయ పడుతున్నాను. అని ఆత్మ ఘోశి స్తుం ది

R.B.Satyanarayana

Quote of the day

There is nothing more dreadful than the habit of doubt. Doubt separates people. It is a poison that disintegrates friendships and breaks up pleasant relations. It is a thorn that irritates and hurts; it is a sword that kills.…

__________Gautam Buddha