అమ్మ మాట

3.236.175.108
పిల్లాడికి అమ్మ ఎప్పుడు తొలిగురువే.

అందుకే ఎవరు చెప్పినా చెప్పకపోయినా పిల్లాడు మాత్రం తల్లి చెప్పినమాట కచ్చితంగా వింటాడు.
జీవితంలో చివరిరోజు వరకు గుర్తున్చుకొని మరి పాటిస్తాడు. అందుకే జగన్మాత ఐన లక్ష్మీదేవే విష్ణుచిత్తుల వారికి పుత్రికగా పుట్టి ఈశ్వరుడిని పొందే మార్గాన్ని భావితరాలకు చూపింది.
ఆవిడ ఈశ్వరుడిని పొందటం కాదు పిల్లలు సర్వోత్కృష్టమైన మానవ జన్మలోకి వచ్చి ఎందుకు వచ్చామో తెలుసుకోకుండా అర్థంపర్థం లేనట్టు విషయ సుఖలతో భోగాలతో అసలు మనుష్య శరీరంలోకి జీవుడు ఎందుకు వచ్చాడు అన్న సంగతే మరచిపోయి జీవితాన్ని వృధా చేసుకుంటారు అని, ఆవిడే భూమిమీద మానవ కాంతగా పుట్టి జనులకు ఈశ్వరుడిని చేరేందుకు మార్గం చూపింది, తన స్వస్థానం నుండి ఆవిడ పిల్లల కోసం కడలి వచ్చింది, అమ్మంటే అమ్మే అటువంటి తల్లి.

అందుకే మొదటి నమస్కారం మా అమ్మ ఆండాళ్ కే తర్వాత ఎలాగో చేరిపోయేది. చేరిపోవాల్సింది సర్వ స్వతంత్రుడు, సర్వ వ్యాపాకుడు, సర్వ శక్తిమంతుడైన జగన్నాధుడినే అనుకోండి, అందుకే ఈశ్వరుడా గురువా అంటే ఎలా గురువు అని చెపుతామో, అలానే అమ్మా నాన్నా అని అంటే మొదట అమ్మా అనే చెపుతాము, ఆవిడది అంత దారాళమైన హృదయం పిల్లలకోసం భతృత్వాన్ని కూడా పక్కన పెట్టి పిల్లలకి మార్గానిర్దేశకత్వం చేసి మళ్ళీ వైకుంఠానికి రంఘనాధుడిని పేళ్లాడి స్వస్థాననికి చేరుకుంది.
అటువంటి తల్లిదండ్రులకు మనం ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే, ఎన్ని పూజలు చేసిన తక్కువే.

Quote of the day

There is nothing more dreadful than the habit of doubt. Doubt separates people. It is a poison that disintegrates friendships and breaks up pleasant relations. It is a thorn that irritates and hurts; it is a sword that kills.…

__________Gautam Buddha