ఓ ... పరమేశ్వరా

ఓ ... పరమేశ్వరా !
తమరి పరిశీలనలకు ఎన్ని అర్జీలో.
జగన్నాటక సూత్రధారి !
దేవాదిదేవ! మహాదేవ !
విశ్వప్రభుత్వ అధినేత !
మానవులు తమరికి పెట్టే అప్లికేషన్లు
ఎన్నో అర్జీలు ఎన్నో కదా,
ఆ అర్జీలు జీవితమంతా ఉండును కదా
అవి ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం,
కడుపు కొట్టాలని కొందరు,
కడుపు నింపాలని కొందరు,
కలిసి రావాలని కొందరు,
కలిసి రాకూడదు అని కొందరు,
వాన రావాలని కొందరు,
వాన రాకూడదు అని కొందరు,
పంట పండాలని కొందరు,
పంట ఎండాలని కూడదు అని కొందరు,
గెలవాలని కొందరు,
గెలవకూడదు అని కొందరు,
మంత్రి కావాలని కొందరు,
కాకూడదు అని కొందరు,
మనశ్శాంతి కావాలని కొందరు,
మనోబలం కావాలని కొందరు,
ఉన్నది నిలవాలని కొందరు,
లేనిది కావాలని కొందరు,
ఆకలిగా ఉన్నదని కొందరు
ఆరోగ్యం బాగా లేదని కొందరు
ఆనందం కావాలనే కొందరు,
భోగభాగ్యాలు కావాలని కొందరు,
కుమారులు కావాలనీ కొందరు,
కూతుళ్లు కావాలని కొందరు,
మంచి కోడలు రావాలని కొందరు,
మంచి అల్లుళ్ళు రావాలని కొందరు,
బ్రతకాలని కొందరు, ఇంత మంది
కోటానుకోట్ల మంది తమకు ఎన్ని
అర్జీలు అందుతున్నవో కదా,
వీటిని అన్నింటిని తమరు
ఎప్పుడు పరిశీలిస్తారు, పరిశోధిస్తారు,
పరీక్షిస్తారు ఫలితాలు ఇస్తారు. ఇవన్నీ
ఒక్కసారి ఊహిస్తే ఆశ్చర్యం కలుగుతుంది, సమస్త ప్రాణి కోట్ల యొక్క అర్జీలు తమరు క్షణంలో పరిష్కరించి చేస్తున్నారు..
ఆట్టి తమ అపూర్వ దివ్యశక్తికి
మా అనంత కోటి జోహార్లు,
సమస్త ప్రాణకోటి యొక్క ఇన్ని కేసులు
క్షణంలో పరిష్కరిస్తూ ఉన్నారు కదా,
మరి తమరికి విశ్రాంతి ఎక్కడ ?
అని కొందరు తలచ వచ్చును,
అన్ని కార్యక్రమాలు జరుపుతున్న తమరు శాంతస్వరూపులుగా ఉన్నారు,
( శాంతాకారం భుజగ శయనం )
తమరు సాక్షి భూతులు.
తమ సాన్నిధ్యమున అన్ని పనులు
సవ్యంగా శాంతంగా జరిగిపోతున్నాయి, తమరు సృష్టించిన విశ్వ శాసనము తన పనిని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నది,
పాపం చే దుఃఖము, పుణ్యం చే సుఖం,
జ్ఞానం చే మోక్షము, అన్నం అనునది
మీ శాసనము, ఆ శాసానము ప్రకారం
ఎవరు చేసిన కర్మ లు వారికి
ఫలాలుగా అందుతూ ఉన్నాయి,
ధర్మో రక్షతి రక్షిత .... ధర్మాన్ని రక్షిస్తే
అది మనల్ని రక్షిస్తుంది అని తెలిసి కూడా ఎంతమంది ఆచరించి గలుగుతున్నారు, మహాదేవ ? ఎవరి కర్మకు వాళ్ళు నమస్కరించుకుని సత్కర్మలు
సదాచారాలు చేసి ధన్యులు కావలసినదే,
ఎవరి ఉదార్థము వారే పొందాలని అర్థమవుతున్నది అలా ఉన్నతి పొందుటకు మాకు శక్తిని ప్రసాదించా లని మనసా వాచా శిరసా కోరుకుంటున్నాము దేవా.




మీ,రాజు సానం