సీతమ్మ వంటలను ఆర్తి తో భుజిస్తున్న హనుమ

3.239.33.139
ప్రతినిత్యమూ హనుమ ప్రార్దన సీతామాతకు మేలుకొలుపు అయిపోయింది🌹
🌹రామునికిపట్టాభిషేకం అనంతరమూ అతిధులుగా వచ్చినావారంతా కొద్దిరోజులుండి ఎవరి స్వస్థలాలకు వారు వెళ్ళిపోయినారు ...ఇక హనుమ పని ఐపొయిందికదా అని రాముడు పొమ్మనలేదు ...రామ పాదాలు విడిచిరాడుకాబట్టి సుగ్రీవుడు తనతో రమ్మనలేదు ..కనుక హనుమ అయోధ్యలోనే ఉండిపోయాడు ..అతడికి ఒక పనిలేదు ..బాధ్యతలేదు ..నివాసముకు మందిరమూ లేదు 🌹🌹🌹...
🌹రాముడు అంతహ్ పురము లోనుంచి బయటకు వచ్చేసరికి ద్వారం బయట నులచి ఉంటాడు హనుమ ....రాముడు పిలవనవసరం లేకుండానే అతనివెంట రాజసభకి వెళుతాడు ...రాముడు సిమ్హాసనాదీశుడైతే అతని వెనక నిలబడతాడు ...రధం ఆగిన మరుక్షణం క్రిందకి దూకి రాముడు క్రిందికి దిగడానికి వీలుగా తన అరచేతులను మెట్లుగా ఉపయోగిస్తాడు ...రధాన్ని అధిరోహించెటప్పుడు కూడా హనుమచేతులే సోపానాలవుతాయి🌹 ..
🌹రాత్రికి రాముడు అంతహ్ పురమందిరములోనికి ప్రవేశించగానే ద్వారభందనాలు మూసుకుంటాయి ....హనుమ ద్వారం బైటనే రామనామం పలుకుతూ ఆగిపోతాడు ....మళ్ళీ బ్రహ్మీ ముహూర్తసమయంలో హనుమ ప్రార్ధనతోటే రాముని అంతహ్ పురం మేలుకొంటుంది ..అయోధ్యానగరం మేలుకొంటుంది ...ఒక్క మాటలో చెప్పాలంటే రామరాజ్యం మేలుకొంటుంది🌹🌹🌹
💥పాపం హనుమ ..జాలికలిగింది సీతమ్మకు ...నిగ్గదీసి అడిగింది విభుడిని ఓరాత్రి ...మనకోసం ఇన్నిచేసిన హనుమకు మనం చూపే కృతజ్ఞత ఇదేనా అని💥
🏹"హనుమకి కృతజ్ఞతా ..." అంటూ రాముడు మందహాసం చేసి "తన హృదయంలో నేనూ-నా హృదయములో అతను ....నాలోనే ఉంటూ నన్ను నడిపించేవాడికి కృతజ్ఞత ఎలా చూపించను ".అన్నాడు 🏹
💥"చాల్లేండి మీ రాచరికపు మాటలు ..హనుమ సరిగ్గా తింటున్నాడో లేదో ..ఈరోజు హనుమను నేనే భోజనానికి పిలుస్తాను ..స్వయంగా వండి వడ్డించి దగ్గర కుర్చుని తినిపిస్తాను "అంది సీతమ్మ💥
🏹"పిలు ..పిలు నీకే అర్దమవుతుంది" అన్నాడు రాముడు నవ్వుతూ🏹
💥అన్నప్రకారమే సీతమ్మ అన్నీ సిద్దంచేసి హనుమకు వడ్డిస్తూ ఉంది దగ్గరకుర్చుని ..తిను నాయనా మొహమాటపడకు అంటూ ....
🐵"సరేనమ్మా అంటూ హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు ..సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తుంటే హనుమ వద్దు అనకుండా తింటున్నాడు ..కొంతసేపటికి పదార్దాలన్నీ ఐపోయాయి ..సీతమ్మ కంగారుపడి అంతహ్పురవాసులకోసం వండిన పదార్దాలుకూడా తెప్పించింది ...అవీ ఐపోయాయి ...తలవంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురుమంటూ ....సీతమ్మకు కంగారు పుట్టి "రోజూ ఏమి తింటున్నావు నాయనా"అని అడిగింది విస్మయంగా💥
#రామనామంతల్లీ"..వంచినతలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ ...సీతమ్మ తుళ్ళిపడి నిరంతరం రామనామం భుజించేవాడూ ,భజించేవాడూ ....శివుడొక్కడేకధా .....సీతమ్మ తేరిపార చూసింది ....అప్పుడు కనిపించాడు సీతమ్మకు హనుమలో శంకరుడు ...శంకరుడే హనుమ ...నిత్యం రామ నామ ఆహారంగా స్వీకరించేవాడికి తను ఇంక ఏమిపెట్టగలదు ?
🌹💥సీతమ్మ ఒక్క అన్నపు ముద్దను పట్టుకుని రామార్పణం అని ప్రార్దించి వడ్డించింది ..ఆ ముద్దను భక్తితో కళ్ళకు అద్దుకుని తిని కడుపు నిండిందమ్మా ..అన్నదాతా సుఖీభవ అన్నాడు హనుమ సతృప్తిగా🌹
🌹హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ🌹🌹🌹🌹
🌹జై శ్రీరామా🙏🏼🙏🏼
🌹జై శ్రీహనుమా🙏🏼🧘

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha