శ్రీ బద్రీ నాధ్ ధామ్. శిఖర దర్శనం

3.235.11.178
శ్రీ బద్రీ నాధ్ ధామ్. శిఖర దర్శనం

పురాణాలలో వివరించిన ప్రకారం శిఖర దర్శనం పాప నాశనం. అంటే ఏదైనా మందిరం యొక్క శిఖరాన్ని దర్శించిన మాత్రమునే మన పాపాలు నాశనము అవుతాయి అని ప్రతీతి.
ఒక వేళ మీరు ప్రతిరోజూ దైవాన్ని దర్శించడానికి మందిరానికి వెళ్లే సమయం లేనట్లయితే ఏదైనా మందిరం యొక్క శిఖరం కన్పిస్తుంటే అక్కడి నుంచే భగవానుని గుర్తు చేసుకొంటూ శిఖర దర్శనం చేయాలి.

అంతే కాకుండ , మన హిందూ ధర్మం లో శిఖర దర్శనం కూడా దైవ దర్శనం తో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పబడినది. అలాగే ఆలయంలో ని విగ్రహం వలే శిఖరం కూడా మహత్తు కలిగినదిశిఖర దర్శనము చేసే సమయంలో రెండు విషయాలు విశేషంగా ధ్యానము లో ఉంచుకోవాలి. మొదటిది మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి రెండవది మనస్సులో భగవంతుని నామము మాత్రమే ధ్యానిస్తూ చింతన చేయాలి.

కావున మీకు ఆలయానికి వెళ్లే సమయం తక్కువ వున్నప్పుడు శిఖర దర్శనము చేసుకొంటూ తమ ఇష్ట దైవాన్ని ధ్యానం చేయండి తద్వారా మానసిక పునరుత్తేజము మరియు శాంతి తో పాటు ఉచిత ఫలం కూడా లభిస్తుంది.

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi