మహర్షి బాటసారి

3.236.222.124

శ్రీ  రాముని సాక్షాత్కారం కోసం ఏళ్ళు తరబడి ఎదురు చూస్తూ, శ్రీరాముని పాద స్పర్శతో పునీతం అయిన అహల్య ఎక్కడ?  శ్రీ రాముడు ఎవరో మాకు తెలీదు అని వెనక్కి తిరిగి నుంచున్న ఈ నాటి వందమాగిధ సాములోరు ఎక్కడ?

శ్రీ రాముడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన శబరి ఎక్కడ?
శ్రీరాముడు ను కాపాడలేని నేటి  స్వార్థపరులు ఎక్కడ? నీ  రాముడు ఎక్కడ? అని అడిగితే ఇదిగో  *ఇక్కడ* అని తన  గుండెలు చీల్చి శ్రీరాముని  చూపించిన ఆనాటి  హనుమంతుడు ఎక్కడ, ఈనాటి కుహనా స్వాములు ఎక్కడ? రాముడే తన ఏకైక  దేముడు అని కీర్తనలు రాసి తన జీవితాన్నే రామగానం కోసం అర్పించుకున్న త్యాగరాజు ఎక్కడ?  ప్రభుత్వానికి భయపడి కూని రాగాలు తీస్తున్న ఈనాటి దొంగ స్వాములు ఎక్కడ?

తాను  జన్మతహ ముస్లింగా పుట్టినా, రాముడే నా దేముడు అని మన రాముడిని అక్కున చేర్చుకుని పూజించిన భక్త కబీర్ దాస్ ఎక్కడ? పోలీసులకు భయపడి దాక్కున్న దొంగ స్వాములు ఎక్కడ?
ఏ కులం లో పుట్టినా,  శ్రీ రాముడే నా  భర్త అని అనేక కష్టాలు ఎదుర్కుని, జీవితాన్ని తృణ ప్రాయంగా భావించిన  కవయిత్రి  మొల్ల ఎక్కడ? హిందూ మతం ఎన్నడూ లేని, ఎప్పుడు చూడని కష్టం లో ఉంటే, హిందూ మతం తన ఉనికి ని కోల్పోయే ప్రమాదం లో ఉంటే మాకు సంబంధం లేదు అని చేతులు కట్టుకుని, చేష్టలుడిగి దిక్కులు చూస్తున్న నేటి స్వాములు అనబడే  స్వార్ధపరులు ఎక్కడ?
శ్రీ రాముడుకు గుడి కట్టినందుకు హైదరాబాద్ నవాబు జైలు శిక్ష వేస్తె ఆఁ శిక్షను తృణపార్యంగా భావించి ఎదిరించిన భక్త రామదాసు ఎక్కడ?  కాళ్ళ కు దాసోహం అంటూ నేల నమస్కారాలు చేస్తున్న ఈనాటి పిరికి స్వాములు ఎక్కడ?

హిందూ ధర్మం కష్టంలో ఉన్నప్పుడు హిరణ్యకశీపుడు, రావణాసురుడు, హిరణ్యక్షుడు లాంటి దుర్మార్గులు సామాన్యులను వేధిస్తే, గుండె చూపి ఎదిరించినది ఆఁనాటి స్వాములు, యోగులు, ఋషులే. కానీ నేటి స్వాములు  పిరికి పందలు  మునులు, ఋషులు ఆనాడు  కదన రంగంలో  రామనామంతో ముందుకు ఉరికారు. తలక్రిందులుగా వేలాడతిసి,  ఋషులకు కింద మంట పెట్టినా *శ్రీ  రామ అన్న నామ జపం* ఋషులు, మునులు ఎన్నడూ వదలలేదు. ప్రజల కోసం తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు ఆనాటి మహర్షులు. 

ఈరోజు స్వాములు,  రాజకీయ ఊబిలో నిండా మునిగి, రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కుతూ, దుర్మార్గుల పంచకాస్తూ, దేముడుకి కష్టం వచ్చినప్పుడు, ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు, నేటి స్వాములు పలాయన మంత్రం చిత్తగించారు. లోపలదాగి, తమ తల నిప్పుకోడిలా ఇసుకలో దాచి మమ్మల్ని ఎవ్వరు చూడటం లేదు అని నటిస్తూ మనం నమ్మిన రాముడి కోసం త్యాగం వదిలి, యైహిక సుఖాలుకు బానిసలూ గా మారి ప్రజలకు బహిరంగ పిలుపు   నివ్వటం మరిచారు
రోడ్డులకు కు అడ్డం అని కేంద్రం గుడులు తీస్తే చంద్రబాబు పై గావు కేక పెట్టిన స్వారుపానంద  ఈరోజు ఎక్కడ?

ఇటుకలు సేకరించి, అయోధ్య లో రామాలయం అన్న  RSS, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్  ఇంకా బతికే ఉన్నాయా ? ఉంటే ఈ రోజు మాట్లాడవే? చంద్రబాబు హిందూ గుడులను కాపాడటం లేదు అని దొంగ కన్నీరు కార్చిన చిలుకూరి బాలాజీ  దేవాలయం పూజారి  రంగరాజన్ ఎక్కడ?
మతం వదిలి రాజకీయం పట్టి తెలుగు దేశం పార్టీ పై  విమర్శలు కసితో చేసిన  పరిపూర్ణనంద ఇప్పుడు ఎక్కడ? ఆలోచించండి ప్రజలారా శ్రీలంక లో మసీదు కూలితే అది  అంతర్జాతీయ వార్త
ఆస్ట్రేలియా లో చర్చి కూలితే  అది బీబీసీ వార్త మన రాముడు ఎవరికీ అవసరం లేదు
మన హిందూ దేముడు అంటే అందరికి అలుసే నిజం గ్రహించండి
రాజకీయాలు తో పెన వేసుకున్న దొంగ స్వాములను తరిమి కొట్టండి మన రాముడును మనమే కాపాడు కుందాం మౌనం ఇంకానా? 150 గుళ్లు కూలాక కూడానా? ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు?
ఘోరి, ఘజని, బాబర్, అవురంగా జేబు సమయంలో కూడా ఇన్ని గుడులు కూల లేదు
ఒక్క సారి ఆలోచన చేయండి మనసు లో రాముని తలచి ముందుకు కదలండి మన రాముడు ని మనమే కాపాడు కుందాం 


kRiShNa naamasmaraNa 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore