అయోధ్యలో శ్రీ రాముని మందిర నిర్మాణానికి శిలాన్యాసం,భూమిపూజ జరిగిన సంధర్భంగా
విశేషాలు ఒక నాడు వసుధైక కుటుంబం అయిన ఈ భూమండలమంతా సనాతన ధర్మంలోనే విరాజిల్లినది.. ఎంతో మంది ఎన్నో రకాలుగా నాశనం చెయ్యాలని చూసినా,ధ్వంసం చెయ్యాలని చూసినా మళ్లీ ఎంతో బలం గా లెగిస్తూ నే ఉంది.. అందులో భాగం గానే ఈ రోజు రామ మందిర నిర్మాణం భూమి పూజ జరగడం..అందులో మనందరం మన కళ్ళతో చూడటం జరిగింది. ఈ రోజు మన జన్మ ధన్యం అయింది.... అందులో భాగం గా ఈ సాయంత్రం ఇంటి ముందు
మేము దీప ప్రజ్వలనమ్ చేసాము.
సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య భగవాన్ శ్రీ రాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన రఘు వంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది. రాకుమారుడైన రాముడి చుట్టూ నే రామాయణం కథ మొత్తం తిరుగుతుంది. శ్రీ రాముడు వనవాసానికి 14 ఏళ్ళ పాటు వెళ్ళి వచ్చిన తరువాత ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి పండుగని జరుపుకుంటారు.
హిందూ మతం తో పాటు అయోధ్య లో బౌద్ధ మతం, జైన మతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరు ల లో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు.
హిందువుల యొక్క అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అయోధ్య. ఆధ్యాత్మిత కలిగిన వ్యక్తులకి అయోధ్య పర్యాటకశాఖ ఎన్నో అందిస్తుంది.
శ్రీ రాముడి పుత్రుడు కుశుడి చేత నిర్మించబడిన నాగేశ్వరనాథ్-ఆలయం మరియు చక్ర-హర్జి విష్ణు ఆలయాలు ఇక్కడ సందర్శించదగిన ఆలయాలు.
తులసీదాస్ యొక్క జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం చేత నిర్మించబడిన తులసీ స్మారాక్ భవన్ ఇక్కడ ఉంది. 1992 లో ద్వంసం చేయబడిన బాబ్రీ మసీదు రామ జన్మ భూమిలోనే ఉండేది.(అది అందరికీ తెలుసు)
బంగారపు కిరీటాలు ధరించిన సీతారాముల చిత్రాలని #కనక-భవన్ లో గమనించవచ్చు.
#హనుమాన్-గర్హి అనే భారీ నిర్మాణం ప్రతి ములలో వృత్తాకార కోట బురుజుల తో ఉంటుంది.
శ్రీ రాముడి తండ్రి కి సంబంధించిన #దశరథ్-భవన్ ని ఇక్కడ గమనించవచ్చు. ట్రేటా-కే-ఠాకూర్ అనే ప్రదేశం లో నే శ్రీ రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని తెలుస్తోంది.
రామ్ జన్మభూమి ఆలయానికి సమీపం లో సీత-కి-రసోయి ని గమనించవచ్చు. శ్రీ రాముడి తో వివాహం తరువాత సీతాదేవి మొట్ట మొదటి సారి ఇక్కడే వంట చేసిందని అంటారు.
సరయు నది వద్ద ఉన్న రామ్-కి-పైది అనే స్నానపు-ఘాట్స్ ఉన్నాయి. ఆ తరువాత, మని పర్బాత్ అనే బౌద్ధుల విహార ప్రదేశం ఉంది .
ఆ తరువాత హిందువుల ఆలయం గా మారింది.
ఇక్కడ నుంచి ఈ నగరం యొక్క సుందరమైన వీక్షణలు చెయ్యవచ్చు.
జై శ్రీ రామ్, జై జై శ్రీ రామ్....
సనాతన ధర్మస్య రక్షిత-రక్షతః
- ప్రసాద్ సింగ్