శ్రీ దత్తా క్షేత్రం, జునాగడ్, గుజరాత్.

18.215.185.97
నేను మీకు చేబుతున్న ఆలయం పేరు శ్రీ దత్తా క్షేత్రం జునాగడ్ గుజరాత్......నేను మీకు చెప్పేవి కొన్ని విషయాలు మాత్రమే ముందుగానే చెబుతున్న ఏమైనా తప్పులుంటే క్షమించండి....

అతిముఖ్య మైనవి 5 పర్వత శిఖరాలు. మొదటి శిఖరమైన అంబాశిఖరంలో నేమినాథ మరియు అంబామాత (పార్వతి దేవి) దేవాలయాలు గలవు. రెండవ శిఖరమైన గురుగోరఖ్ నాథ్ శిఖరంలో గురుగోరఖ్ నాథ్ దేవాలయం మరియు అఖండ ధుని గలవు, మూడవ శిఖరమైన ఒఘాద్ శిఖరంలో అనేక గుహాలయాలు గలవు. నాలుగవ శిఖరమైన గురుదత్తాత్రేయ శిఖరంలో దత్తాత్రేయుని కమండలకుండం, అఖండ దత్త ధుని మరియు గురు దత్తాత్రేయుని పాదుకలు గలవు. ఐదవ శిఖరమైన కాళికాశిఖరంలో మహాకాళీమాత దేవాలయం కలదు. దీనినే పావఘర్ శిఖరం అంటారు. దీనిని చేరుకోవడానికి కమండలకుండం నుండి వేరొక దారి తీసుకోని వెళ్ళాలి. ఇక్కడ సహజంగా ఏర్పడిన మహాకాళీమాత యొక్క ప్రసాద పాత్రను చూడవచ్చు..

ఆలయానికి చేరాటానికి మొత్తం 10,000 steps ఎక్కాలి...ఎవరైనా వెళ్ళితే తెల్లవారుజామున నుండే trekking స్టార్ట్ చేస్తే చాలా మంచింది..
భావనాథ్ దేవాలయం గిర్నార్ పర్వత శ్రేణుల పాదాలదగ్గర గల అతి గొప్ప పురాతన శివాలయం. శివరాత్రికి శివుడే స్వయంగా ఇక్కడకు వస్తాడని భావించే యోగులు, అఘోరాలు, దిగంబర సాధువులు ఆ రోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరౌతారు. ఈ దేవాలయంలోఅత్యంత మహిమగల స్వయంభూ శివలింగం గలదు. శివ పార్వతుల విహారంలో వారి దుస్తులు ఇక్కడ పడిపోయాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అందువల్లనే ఇక్కడ సాధువులు దానికి ప్రతీకగా దిగంబరంగా తురుగుతారు. ఈ దేవాలయంలో ‘మృగికుండ్’ అనే కుండం కలదు. భక్తులు ఇందులో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. శివరాత్రికి ఇక్కడ అతి పెద్ద జాతర జరుగుతుంది. ‘గిర్నార్ లిలి పరిక్రమ’ మరియు ఇతర పోటీలు ఇక్కడ నుండే ప్రారంభం అవుతాయి.

మనం ఏకార్యక్రమమైనా ప్రారంభించబోయేముందు విఘ్ననాయకుడైన విఘ్నేశ్వరుడిని ముందుగా పూజించి పనిని ప్రారంభించడం ఆనవాయితి . ఈ సంప్రదాయానికి భిన్నంగా గిరిరాజ్ గిర్నార్ క్షేత్ర యాత్రలో పర్వత అధిరోహణకు ముందు అందరూ ఖచ్చితంగా ఛడవొవ్ హనుమాన్ కు ప్రార్ధన లేదా పూజ చేయాలి. దీనికి గల కారణం ఛడవొవ్ హనుమాన్ ‘ప్రాణవాయువుకు’ అధిష్టాన దేవుడు. సాధారణంగా ఈ యాత్రలో భక్తులు గిర్నార్ పర్వతం పైకి వెళ్ళే కొలది ప్రాణవాయువు(ఆక్సిజన్) అందక ఇబ్బంది పడతారు , అలాంటివేవీ జరగకుండా ఛడవొవ్ హనుమాన్ భక్తులను రక్షిస్తుంటారు. ఈయన మూలాధార చక్రం లోనే అతి శక్తి వంతమైన గణపతి కుడా ఉంటారు. అందువల్లనే ఛడవొవ్ హనుమాన్ దేవాలయం మొదటి మెట్టు దాటగానే మొట్టమొదటగా ఉంటుంది. ఈయన ఆశీస్సులుంటేనే ముందుకు…లేదంటే వెనక్కే! మొదటి మెట్టు ఎక్కే ముందు ఈయనను మర్చిపోయి కొద్దిదూరం వెళ్ళాక గుర్తుతెచ్చుకొని తిరిగి వెనకకు వచ్చి ప్రార్ధించే వారంటే ఈయనకు పిచ్చి కోపమట. కాబట్టి భక్తులు ముందుగానే మొదటిమెట్టు ఎక్కుతూనే ఈయన సహాయాన్ని, అనుమతిని కోరాలి.

అంబా జీ మాత దేవాలయం:
మాత ఆలయం -
అంబా జీ మాత (పార్వతి దేవి) దేవాలయాన్ని 12వ శతాబ్దంలో పునర్నిర్మించారు. అంతకు ముందు ఇక్కడ చిన్నదైన గుడి ఉండేది. ఈ చిన్న గుడి చుట్టూ పెద్ద ప్రాకారాలను కట్టి పెద్ద దేవాలయంగా మార్చారు. ఈ దేవాలయం అతి పురాతనమైదని. ఈ దేవాలయ పునర్నిర్మాణంలో మాత యొక్క రధం మరియు ఆమె కాలి ముద్రలు కనుగొన్నారు. ఈ ప్రదేశంలో కృష్ణుడుకి తలకేశాలు [పుట్టు వెంట్రుకలు] తీసారని చరిత్ర చెబుతోంది. అంబా జీ మాత యొక్క కళ్ళు అతిశక్తి వంతమైనవి. అమ్మ మొత్తం గిర్నార్ పర్వత శ్రేణులను రక్షిస్తూ పహారా కాస్తూ ఉంటారని ఇక్కడి పూజారులు చెబుతుంటారు. అంబా జీ మాత దేవాలయం దాటిన తరువాత వచ్చే మైదానంలో అనేక దుకాణాలు ఉంటాయి.ఇది దాటితే ఇక ఎలాంటి దుకాణాలు ఉండవు. కాబట్టి నీళ్ళు మొదలైనవి తీసుకొన్ని వెళ్ళితే చాలా మంచిది..
సాధారణంగా భక్తులు ముందుగా కమండల కుండం వెళ్లి, మళ్లీ మెట్లుఎక్కి పైకి వచ్చి దత్తాత్రేయశిఖరం( అవలోకన శిఖరం), దత్త పాదుకల దర్శనానికి వెళతారు. కమండల్ కుండ్ లో భోజనం చెయ్యాలనుకునే భక్తులు ముందుగా గురు దత్తాత్రేయశిఖరం( అవలోకన శిఖరం) వెళతారు.
కమండల కుండం

గురు దత్తాత్రేయుడు ఆయన కమండలాన్ని విసిరేసిన ప్రదేశంలో రాళ్ల మధ్యలో నుండి ఉద్భవించిన కుండమే ‘కమండల కుండం’. ఇక్కడ గురు దత్తాత్రేయుల వారి అఖండ ధుని, వారు వాడిన త్రిశూలం, కమండలంమరియు ఇతర వస్తువులు ఇప్పటికీ ఉన్నాయి. కమండల కుండం లోని నీరు తియ్యగా, చల్లగా ఉంటాయి. ఇక్కడ గల ఆశ్రమంలో భక్తులకు ఉచిత భోజనం (ఉదయం 11:00 గంటల నుండి) మరియు ఉచిత తేనీరు (Tea) ఇస్తారు. ఇక్కడ గల గురు దత్తాత్రేయుల వారి అఖండ ధుని దత్తాత్రేయుల వారే 12000 సంవత్సరాల క్రితం వెలిగించారు. ఇప్పటికీ ఆ ధుని నిరంతరాయంగా వెలుగుతూ ఉండడం ఇక్కడి విశేషం. ప్రతీ సోమవారం ఉదయం ఇక్కడ గల అతి పవిత్రమైన దత్తాత్రేయుల వారి అఖండ ధునిని Open చేస్తారు. ప్రతీ భక్తుడు ఈ దృశ్యాన్ని చూసి తిరవలసినదే! దత్తాత్రేయశిఖరం కమాన్ దగ్గర నుండి నిట్ట నిలువుగా వుండే కొన్ని వందల మెట్లు ఎక్కిన తరువాత ఆఖరుగా మనమెంతగానో ఎదురుచూసే, మన జన్మని చరితార్ధం చేసే గురు దత్తాత్రేయ పాదుకలు వస్తాయి. ఆ పాదుకల మహిమను ఏమానవ మాత్రుడు వర్ణింప సాహసం చేయగలడు? గురు పాదుకా దర్శనం అనంతరం అక్కడ ఉండే పెద్ద ‘ఘంట’ను కొట్టడం అక్కడి ఆనవాయితి. 10,000 మెట్లు ఎక్కిన అలసటంతా ఒక్కసారిగా ఆ పాదుకా దర్శనంతో పటాపంచలైపోతాయి. భక్తులు ఎంతో ఆనందంతో , గురు దత్తుడికి కృతజ్ఞతలు తెలుపుతూ తృప్తితో క్రిందకి దిగుతారు..జై గురుదత్తా..

- శ్రీనివాస గుప్తా వనమా

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda