Online Puja Services

శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, ఎనమలకుదురు

3.145.119.199
దర్శనం సమయం 6.00 a.m. to 12.00 p.m. and 5.00 p.m. to 8.00 p.m. కృష్ణా జిల్లాలో విజయవాడకు దగ్గర కృష్ణా నదీ తీరం లో కరకట్ట కు ఆనుకొని ఉన్న యనమల కుదురు గ్రామంలో ‘’ముని గిరి ‘’అనే 612అడుగుల ఎత్తైన కొండ పై శ్రీ రామ లింగేశ్వరస్వామి స్వయంభు గా వెలిశాడు .ఈ గ్రామం బెజవాడ బెంజ్ సర్కిల్ కు చాలా దగ్గర .పటమట సెంటర్ నంచి కూడా బస్ సౌకర్యం ఉంది .త్రేతాయుగం లో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతం గా ఇక్కడికి వచ్చి స్వామి సేవలో పాల్గొన్నాడని స్థల పురాణం తెలియ జేస్తోంది కొండమీదికి ఆలలో చేరుకోవచ్చు..

పరశురాముడు క్షత్రియ సంహారం చేసి ,ప్రాయశ్చి త్తం చేసుకో దలచి ,అనేక క్షేత్ర సందర్శన చేస్తూ ఈ మునిగిరి కి చేరాడు .ఇక్కడ అప్పటికే తపస్సు చేస్తున్న మునులను చూశాడు .వారికి ఏ ఇబ్బందీ లేకుండా రక్షిస్తున్నాడు .స్వయంభు ప్రతిస్తితుడైన శ్రీ రామేశ్వర లింగాన్ని పునః ప్రతిష్ట చేసి స్వామిని అర్చించాడు .కొండపై నుడి కింద కృష్ణా నదీ తీరం వరకు వరుసగా 101శివలింగాలను ప్రతిస్ట చేశాడు .కొంతకాలానికి అవి కాల గర్భం లో కలిసిపోయాయి

ఇంద్ర కీలాద్రి ,మునిగిరి ,రుష్యశృంగం ,గరుడాద్రి, వేదాద్రి మొదలైన పర్వత శ్రేణులు కృష్ణానదీ ప్రవాహం వలన విడి పోయాయి .అప్పుడు కృష్ణకు దక్షిణాన ఈ మునిగిరి ఏర్పడింది .ఇక్కడి శ్రీరామ లింగం వాయు లింగం .ఈ వాయులింగాన్నే పరశురాముడు మళ్ళీ ప్రతిష్టించి ఉంటాడని భావన .కాకతి రాజులు ,చాళుక్యులు రెడ్డి రాజులు విజయ నగర పాలకులు ఇక్కడికి వచ్చి స్వామి సేవలో పునీతులైనారు .ఎందరో మహర్షులు మహా మునులు దర్శించి తరించిన క్షేత్రం ఎనమల కుదురు వెయ్యి మంది మునులు ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి .కనుక దీనికి ‘’వేయి మునుల కుదురు ‘’అనే పేరొచ్చింది .అదే కాలక్రమంలో రూపాంతరం చెంది ఎనమల కుదురు అయింది .

ఇక్కడవాయులింగ రామలింగేశ్వరుడు ‘’అష్టముఖ పానవట్టం ‘’పై దర్శనమివ్వటం ఒక ప్రత్యేకత .స్వామికి ఎడమ వైపు ఉపాలయం లో శ్రీ పార్వతీ అమ్మవారు ఉంటుంది .ఆలయ ప్రాంగణం లో విఘ్నేశ్వర ,,సుబ్రహ్మణ్య స్వాములున్నారు. ఆలయ అంతర్భాగమంతా వివిధ దేవతా మూర్తులతో శోభాయ మానంగా కనిపిస్తుంది .

1983లో ధర్మకర్త శ్రీ ధనేకుల శివన్నారాయణ ఆధ్వర్యం లో శ్రీ శృంగేరి పీఠాది పతి జగద్గురువులు శ్రీ భారతీతీర్ధ స్వామి వారి చేతుల మీదుగా ఆలయ శిఖర ప్రతిస్ట జరిపించారు .ఆలయ ప్రాంగణం లో కలిసి ఉన్న రావి ,వేప దేవతా వృక్షాలను శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపులుగా భావిస్తారు .ఈ రెండు కలిసిన చోట వేదిక పై ‘’నాగ శిలలు’’ దర్శన మిస్తాయి.

సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటారు నిరంతర నాగ దేవతా సంచారం ఉన్న పవిత్ర క్షేత్రం ఎనమలకుదురు శివుని నక్షత్రం అయిన ఆర్ద్రా నక్షత్రం రోజున స్వామికి మహన్యాస పూర్వక మహా కుంభాభి షేకం చేస్తారు .అన్నదానం నిర్వహిస్తారు మహా శివరాత్రి పర్వ దినాన పెద్దఎత్తున ‘’జాతర ‘’జరుగు తుంది .విద్యుత్ అలంకార పూర్వకమైన ప్రభలతో పెద్ద ఊరేగింపు చేస్తారు

సర్వేజనా సుఖినోభవంతు

- రామకృష్ణంరాజు గాదిరాజు

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha