ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న

18.215.185.97

ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమి చెయ్యాలి  శ్రీ మారుతి కృప ఉంటే ఎంతటి జటిలమైన సమస్య అయినా సులువుగా తీరిపోతుంది. మనం చేసే పని విజయవంతం కావాలన్న, కార్యం లో ఉన్న ఆటంకాలు తొలగాలన్నా ఆంజనేయ స్వామి వారిని ఒక క్రమ పద్దతిలో ఆరాధించాలి.

ఉద్యోగం,వ్యాపారం, ఆరోగ్యం,ధనం మొదలగు యే కోరికైనా మారుతిని ఆరాధిస్తే నెరవేరుతుంది .  అందుకు ఈ క్రింది విధంగా చేయాలి... ప్రతి రోజు శ్రీ హనుమాన్ చాలీసా ని 11 సార్లు ఒకే ఆసనం మీద కూర్చొని మధ్యలో లేవకుండా చదవాలి. అంటే 11 సార్లు వరుసగా చదవాలి. 

ప్రారంభం లో 1 గంట పడుతుంది. అలవాటు అయ్యాక 40 నిముషాల్లో పూర్తవుతుంది. 11 సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఒక సారి "శ్రీ రామ రక్షా స్తోత్రం" చదవాలి మంగళవారం రోజు ఒక పూట ఉపవాసం ఉండి అన్ని నియమాలు పాటించాలి. మంగళవారం రోజు కొబ్బరికాయను స్వామి వారికి సమర్పించాలి. వీలుంటే నెలకు ఒక మంగళవారం రోజు ఆకుపూజ ను స్వామి వారికి చేయించాలి.

ఈ విధంగా చేస్తూ ఉంటే మీ సమస్యలు ఎంత జటిలమైనవి అయినా క్రమంగా తొలిగిపోతాయి. స్వామి వారి పై పూర్తి విశ్వాసం తప్పనిసరి తండ్రి ఆంజనేయ అందరిని చల్లగా చుడయ్యా 

బి. సునీత 

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda