దైద అమరలి౦గేశ్వరాలయం –గుత్తికొండ బిలం

18.213.192.104
గుంటూరు జిల్లా పిడుగు రాళ్ళకు 25 కిలో మీటర్ల దూరం లో ఉన్న గుత్తికొండ లో ఒక మహా బిలం ఉంది .చుట్టూ పర్వతాలు మధ్యలో బిల సముదాయాలు కంటికి విందు గా ఉంటాయి .ఈ బిలం ప్రక్రుతి సిద్ధంగా ఏర్పడినది .బిలం ప్రధాన మార్గం నుంచి లోపలి వెడితే చీకటిలో కొలువై ఉన్న ‘’చీకటి మల్లయ్య ‘’దర్శన మిస్తాడు .కటిక చీకటి కన్ను పొడుచుకున్నా వెలుతురూ కాన రాదు .

అలాంటి చీకటిలో విద్యుద్దీప కాంతి తోడ్పాటుతో ముందుకు వెడితే నీటి కొలను వస్తుంది .రూపాయ నాణెం కింద పడేసినా కనిపించేంత అచ్చమైన స్వచ్చమైన జలం అందులో ఉంది ఆశ్చర్య పరుస్తుంది .భక్తులు ఈ స్వచ్చ జల కోనేటిలో పవిత్ర స్నానాలు చేసి ,ప్రధాన బిలం గుండా ముందుకు వెళ్లి స్వామిని దర్శిస్తారు. దారిలో 101 బిలాలున్నాయని చెబుతారు .ఇంకా ముందుకు వెడితే గరళం సేవించిన శివుని విగ్రహం కనిపిస్తుందని అంటారు .

ఈ బిలానికి ద్వాపర యుగానికి చెందిన చరిత్ర ఉంది ..కాలయవున రాక్షస సంహారం కోసం శ్రీ కృష్ణుడు ఈ బిలం లో ప్రవేశించాడు .అక్కడ మహా తపస్సాదనలో మునిగి ఉన్న ‘’ముచి కుంద మహర్షి’’ పై కృష్ణుడు తన ఉత్తరీయం కప్పి ముదుకు వెళ్లి దాక్కుంటాడు .కృష్ణుని వెతుక్కుంటూ వచ్చిన కాలయవండు ముచి కుందమని దగ్గరకు రాగానే ఉత్తరీయం చూసి కృష్ణుడే అనుకోని తపో భంగం కలిగిస్తాడు.

ముని కోపం తో తీక్షణంగా చూడగానే కాలయవనుడు మాడి మసి ఐ పోతాడు .వాడి మరణం ముని చేతిలో ఉందని కృష్ణుడు ఈ మాయో పాయం పన్ని లోక కంటకుడైన వాడిని సంహరింప జేసి లోక కల్యాణం చేశాడు . .అందుకే కాలయవన సంహారిణేనమః ‘’’’ముచి కుంద వరదాయనమః ‘’అనే నామాలు కృష్ణ అస్తోత్తరం లో చేరాయి .


గురజాలకు 15 కిలోమీటర్లలో కృష్ణానదీ తీరాన స్వయంభువుగా గుహలో వెలసిన శ్రీ అమర లింగేశ్వర స్వామి ఉన్నాడు. ఇదీ చీకటి గుహయే .దీపాల వెలుగుతో సరంగ మార్గం గుండా 40౦ మీటర్లు అడిచి వెళ్లి అమరేశ్వరుని దర్శించాలి .పల్నాటి యుద్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మ నాయుడు ఈ బిలం లోకే ప్రవేశించాడని చారిత్రిక కధనం .కష్టపడినా తప్పక దర్శించాల్సిన క్షేత్రాలివి

సర్వేజనా సుఖినోభవంతు

రామకృష్ణంరాజు గాదిరాజు

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya