శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం –కపిల తీర్ధం

3.232.133.141
సందర్శించే సమయం 5.00 a.m. to 12.00 p.m. and 4.00 p.m. to 9.00 p.m. చిత్తూర్ జిల్లా తిరుపతి బస్ స్టాండ్ నుండి కొండపైకి వెళ్ళేదారిలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్లలో కపిల తీర్ధం ఉన్నది .ఈ ఆలయం కొండపైనున్న ఏడుకొండల వాడి ఆలయం కంటే కొండ దిగువన ఉన్న ఆలయాలన్నిటికంటే కూడా చాలా ప్రాచీనమైనదని చరిత్రకారుల నిర్ణయం .చూడటానికి చాలా చిన్న ఆలయం గా ఉంటుందికాని కాని లోపలి వెళ్లి చూస్తె చాలా పెద్దవిశాలమైన ఆలయం .కొండ కింద ఒక కొండకు ఆనుకొని ఉంటుంది.

కొండమీడ నుండి జలం కింద ఉన్న కోనేటిలోకి నిరంతరం పడుతూ ఉంది .స్నానానికి అనువుగా ఉంటుంది .తిరుపతికి ఉత్తరాన ఈశాన్యం లో శ్రీ వెంకటాచలం మొదట్లో ఒక కోనేరుంది దీన్లోకి వచ్చే నీరు పైన జలపాతం నుండి వచ్చేదే .ఈ కోనేటికి తూర్పున ఒక గహాలయం ,ఆ ఆలయం లో కపిల మహర్షి ప్రతిష్టించిన శివలింగం ఉంది. అందుకే దీనికి కపిల తీర్ధం అనే పేరొచ్చింది. శ్రీ వెంకటేశ్వరస్వామి స్వయం గా కావాలని గరుత్మంతుడిని దేవలోకానికి పంపి తెప్పించుకొన్న క్రీడాద్రి మొదట్లో ఉన్నది అంటే ఈ క్షేత్రం శివ కేశవ అభేదానికి నిలు వెత్తు సాక్ష్యం .

కపిలేశ్వర ప్రాంగణం లో శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం ఉండటం మరీ విశేషం .శ్రీ వెంకటేశ్వర కొండ గుహలో వెలసిన కపిలేశ్వరుడు సాక్షాత్తు స్వయంభు గా భావిస్తారు .అనేక పురాణాలలో కపిలతీర్ధ ప్రస్తావన ఉంది .వేంకటాచల మహాత్మ్యం లో ,ఇతిహాసాలలోను కపిలక్షేత్ర ప్రశస్తి కనిపిస్తుంది .తమిళభక్తులు కపిల తీర్ధాన్ని ఆళ్వారు తీర్ధం అంటారు .ఆలయానికి తూర్పున పెద్ద నందీశ్వర విగ్రహం చూపరులను యిట్టె ఆకర్షిస్తుంది .

కపిలేశ్వరలింగం ఆలయం లో పశ్చిమంగా ప్రతిష్టి౦ప బడింది ..బంగారుపూత ధ్వజ స్థంభం , బలిపీఠం ఉన్నాయి. స్వామికి ఎడమవైపు అమ్మవారు మీనాక్షీ దేవి ప్రతిస్టింప బడింది .శివాగమ విధానం లో అర్చన జరుగుతుంది .శ్రీ వేణుగోపాలస్వామి రుక్మిణీ సత్యభామలతోను ,ఎదురుగా వేదికపై శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దర్శన మిస్తారు .

కపిలతీర్ధలయాభి వృద్ధికి విజయ నగర రాజులు సాళువ నరసింహ దేవా రాయలు ,కృష్ణ దేవరాయలు ఆయన అల్లుడు అళియ రామ రాజు భూరి దానాలు చేశారు .కార్తీక పౌర్ణమినాడు మధ్యాహ్నం 12 గంటలకు మూడు లోకాలలో ఉన్న సకల పవిత్ర తీర్దాలు కీ కపిల తీర్ధం లో కలిసిపోతాయని పురాణ కధనం .ఈ కలయిక రెండు గంటల వరకు ఉంటుంది .అప్పుడు స్నానం చేస్తే ముక్తి లభిస్తుందని విశ్వాసం .పితృదేవతలకు ఏనాడూ పిండం పెట్టని వారు అప్పుడు ఇక్కడ పెడితే అప్పటిదాకా పెట్టని పాపం తొలగి పోతుంది అని నమ్మకం .

మహా శివరాత్రికి కార్తీక పౌర్ణమికి ,కృత్తికా నక్షత్రం నాడు ,వినాయక చవితినాడు భక్త జన సందోహం అనంతం గా ఉంటుంది .ఫిబ్రవరి లో కపిలేశ్వర బ్రహ్మోత్సవం 9 రోజులు జరుగుతుంది .హంస మొదలైన వాహనాలమీద శివపార్వతులను ఊరేగిస్తారు కళ్యాణ మహోత్సవం వైభవం గా చేస్తారు

సర్వేజనా సుఖినోభవంతు

రామకృష్ణంరాజు గాదిరాజు

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gautama Buddha