మానవుడు ఎలా జీవించాలి?

18.213.192.104
ఫ్రెండ్స్ జీవితంలో మానవుడు ఎలా జీవించాలి అంటే తేనెటీగల జీవించాలి. ఎందుకు అలా అన్నాను అంటే. వేప చెట్టు లో అంతా చేదే ఈ దోషాన్ని విస్మరించి తేనెటీగ వేప పూవు లో ఉన్న తేనెనే గ్రహిస్తుంది. అలాగే ప్రతి మనిషి లో మంచి ఉంటుంది అది గ్రహించే అంతటి ఉదార స్వభావం గల వాడికి ప్రపంచం మొత్తం స్వకుటుంబమే.

మరల ఇంకో మాట జీవితంలో గెలవటానికీ జాలి దయ మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి దానధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవటం వలన చెడు (కౌరవులు) వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

కావున జీవితంలో గెలవాలంటే మంచి తనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి. జీవితంలో రోజు ఎందరో వ్యక్తులు పరిచయం అవుతుంటారు. మనకి పరిచయం అయిన వ్యక్తులది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క మనస్తత్వం భిన్న విభిన్న అభిప్రాయాలు. అందరూ ఒకేలా ఉంటారు అనుకోవడం మనం అనుకున్నట్లే ఉండాలి అనుకోవడం అందరికీ మనం ఒకేలా అర్థం అయ్యాము అనుకోవటం మన మూర్ఖత్వం.

పరిచయమైన వారి మనసులో మనం ఒక సామాన్య వ్యక్తులం అర్థం చేసుకున్న వారి మనసులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం అసూయపడే వారి మనసులో మనం ఒక పొగరుబోతు వ్యక్తులం మోసగించే వారి మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం అర్థం చేసుకోలేని వారి మనసులో మనం లోకం లోనే పొగరుబోతులం మనల్ని ప్రేమించేవారికి మనమే ప్రపంచం మన అభిప్రాయలు వెళ్లబుచ్చే సమయాన ఏకీభవించలేని మనసుకి మనం మొండివాళ్ళం చూసేరా ఎలా ఉంటాయో అభిప్రాయాలు ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం. ఒక్కొక్కొరి దృష్టికి మనం ఒక్కోలా కనపడతాం.

అందుకే ఎవరి కోసమో మనం మారాలని లేదు మనం మనలానే బతికేద్దాం.చక్కగా భగవంతుడు మెచ్చేలా ఆయన ఆశీస్సులు మన జీవితంలో ఉండేలా నిజాయితీ క్రమశిక్షణ తప్పు చేయని మంచి మనసు మోసపు ఆలోచనలు లేని మంచి గుణంతో అందరూ మనవాళ్ళే ఆ పరమాత్మ బిడ్డలమే అనే ఉదార స్వభావం కలిగి ప్రతిక్షణం ఆనందంగా బతుకుదాం. ఆ తండ్రి పరమాత్మ పాదాల చెంత చేరు వరకు శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి

- బి. సునీత 
 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya