శ్రవణా నక్షత్రం శ్రీనివాసుని ప్రార్ధన..,

34.239.170.169
మహా విషువు యొక్క మహా ప్రీతికరమైన పూజ, శ్రావణ నక్షత్రం శ్రీ వారి నక్షత్రం గా ఆ రోజు శ్రీనివాసుడిని విశేషమైన రోజుగా కొలుస్తాము, అట్టి శ్రావణ నక్షత్రం రోజు స్వామి వారిని పూజిస్తే చాలా శుభం స్వామివారి అనుగ్రహము తో పాటు ఆ రోజు ఈ పూజ చేసిన వారికి లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది, జేష్ఠ దేవి కూడా శాంతించి వారిని గృహం నుండి వెళ్ళిపోతుంది, ఆ మాసం అంతా శ్రీనివాసుని పూజించిన ఫలితం దక్కుతుంది...

ఈ శ్రావణ నక్షత్రం రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము... ఈ పూజకు ముఖ్యమైనది వస్తువులు అలంకారాలు , కాదు సమయము ఈ పూజ చేయవలసిన సమయం ఈ పూజకు ముఖ్యం , ఉదయం 3 గం లకు పూజ మొదలు పెట్టాలి అంటే మీరు కనీసం 2 .30 గ కైనా లేవాలి...3 గం సమయం ప్రతిరోజూ కూడా స్వామి వారికి చాలా విశేషం అయిన సమయం... ఎందుకంటే ప్రపంచంలో శాస్త్రోత్రంగా ప్రతిష్ట చేసిన ప్రతి దేవతా విగ్రహం రెప్పపాటు సమయం మహా విష్ణువు రూపామ్ దాల్చి యధావిధిగా మళ్ళి ఆ విగ్రహ రూపం లోకి మారుతుంది ఆ క్షణం పాటు స్వామి అద్భుతమైన దర్శనాన్ని చూసి నమస్కరించడానికి దేవతలు మునులు అంతా ఎదురు చూస్తుంటారు..

శ్రావణ నక్షత్రం రోజున 3 గంటలకు ఆవు నైయి తో దీపం పెట్టి స్వామి వారికి తేన నివేదన చేయాలి, స్వామి వారికి ప్రీతి కరమైన పదార్థంలో తేన , పచ్చ కర్పూరం చాలా ముక్యమైనవి... తేన నైవేద్యం పెట్టి అష్టోత్తరం చదివి స్వామి కి తులసితో అర్చన చేయాలి... హారతి ఇవ్వాలి..పూజ ఐయ్యాక ఒక అరగంట ఆగి నిద్రపోవచ్చు,

ఇలా ప్రతి మాసం లో వచ్చే శ్రావణ నక్షత్రం రోజు ఉదయం 3 గం కు ఇలా స్వామి కి పూజ చేస్తే లక్ష్మీ నారాయనుల అనుగ్రహం దక్కుతుంది వారు మీ కుటుంబానికి అండగా ఉంటారు... ఒక్కసారి ప్రయత్నం చేయండి.

ఓం నమో నారాయణ..

- ఉషారాణి వంకాయలపాటి 

Quote of the day

Truth is by nature self-evident. As soon as you remove the cobwebs of ignorance that surround it, it shines clear.…

__________Mahatma Gandhi