శ్రీ సుబ్రమణ్యస్వామి చరిత్ర ...ఒకటవ భాగం

34.239.170.169
అది పరమపావన కైలాసం. జగత్పిత జగన్మాత నిలయం. అది మహనీయ కమనీయ సుందర కుసుమ సౌరభాన్ని నాలుగు దీక్షలా వెదజల్లు కైలాస గిరీంద్రo. వర్ణింప శక్యం కానిది. ఈ గిరీంద్ర గుహల్లో మునీంద్రులు వేలాది సంవత్సరాలుగా శంకరుని గురించి తపోనిష్టా గరిష్టులై ఎక్కడ చూచినా అక్కడ కనిపించుతారు.

పార్వతిని గూడి పరమశివుడు,  తమ కళ్యాణానంతరం వేయి సంవత్సరాలుగా శృంగార లీలల్లో విహరించి కాలం గడుపుతున్నారు. 

ఆ సమయమున వర గర్వాoధుడు తారకుడి ఆగడాలకు హద్దులేకుండా ఉన్నది. వాడిని గర్వం అణచు వాడు  కేవలం శివ వీర్య సంజాతుడే తప్ప అన్యులు కారు. ఆ బాలుడెప్పుడు ఉదయిస్తాడాయని సర్వ దేవతలు ఎదురు చూస్తున్నారు. అది అంత తేలికైన విషయం కాదని, దేవతలు బ్రహ్మకడ కేగి ఆయనను తొడు గైకొని శ్రీహరి చెంతకు చేరి తారకుని ఘోరాకృత్యాలు ఏకరవు పెట్టారు.

అపుడు నారాయణుడు, "బ్రహ్మాదిదేవతల్లారా! మీ కష్టాలుతీరు తరుణం అసన్నమవుతున్నది. ఓపిక వహించండి. ముందుగా మీరు పరమశివ దివ్యతేజాన్ని, పార్వతీ గర్భములో చేరకుండా చూడాలి. ఒక వేళ పార్వతి గర్భము,  ఆ తేజము పడినదా, మీరు, నేను తుదకు పరమశివుడునికి కూడా లొంగని, పుత్రుడు ఉద్భవించి, అజేయుడై ముల్లోకాలను సాధించే వాడుఅవుతాడు. అందువల్ల మీరు వారి కలయికను నిరోధించాలి. శివుని దివ్యతేజము భూమిపై పడినట్లు చేయాలి. అప్పుడా తేజము మహా పరాక్రమ సంపన్నుడవుతాడు. అతనే తారకాసుర సoహారి అవుతాడు. మీరందరు కైలాసం వెళ్లoడి"- అని సెలవిచ్చారు.

అంతదేవతలందరును  తిన్నగా కైలాస గిరిని చేరి శివుని ప్రార్థింప సాగారు. శంకరా! పరమశివా! భక్తవశంకరా! దోషనాశంకరా! పాహిమాం! రక్షమాo! మహా ఆర్తులం! ప్రభూ! రక్షించుము. కాపాడుము! తారకాసురుని బారినుండి కాపాడమని భోరున విలపిoప సాగారు.

ఆ రక్కసుని బారినుండి కాపాడుము దేవా! వాడిని  అంత మొందించిన కానీ మేము బ్రతుకజాలము. లేకున్న మేమందరము కూడి తమ దివ్య పాదారవిందాలు పట్టి, ఇచ్చటనే ప్రాణాలు విడుస్తాము. ఆ తారకుని అంతమొందించ, తమ గర్భావాసము నుండి ఉద్భవించు అజేయుడైన కుమార శేఖరుడే మాకు రక్ష. అతని మాకు ప్రసాధింపుమని  పదే పదే మొరలిడ సాగారు.

భక్తులు చేసే దీనాలాపములు భోళాశంకరుడి చెవిన పడింది.   పార్వతి తో శృంగారకేళీలీలాశంకరుడు, తటాలున, పార్వతిని వదిలి లేచి,  దేవతలవద్దకు వచ్చాడు.

తమ శృంగార లీలాకళకు అంతరాయం కలిగినందులకు ఆగజాకుమారికి కోపావేశమున ముఖం జేవురించినది. ఆ రౌద్ర రూపం గాంచి దేవతలు వణికి పోయారు. పార్వతి ఆవేశంతో, క్రోధవీక్షణాలతో  దేవతల చూచి, "నాకు సంతానం కలుగకుండా, అడ్డు పడిన  మీకందరికీ సంతాన ప్రాప్తి లేకుండుగాక! అని శపించినది. ఆ ఘోర శాపాన్ని తలదాల్చి సురలందరు మనస్సులలో సంతోషించారు.

రతిక్రీడకు అంతరాయం కలిగి నందువలన, పరమ శివుని వీర్యం జారి భూమి మీద పడినది. అపుడుదేవతల ప్రార్థన మేరకు, అగ్ని దేవుడు పావురమై ఆ శివతేజాన్ని మ్రింగాడు. మిగిలిన దానిని దేవతలు కొంచెం కొంచెం మ్రింగారు.

(సశేషం)

 L. రాజేశ్వర్ 

Quote of the day

Truth is by nature self-evident. As soon as you remove the cobwebs of ignorance that surround it, it shines clear.…

__________Mahatma Gandhi